Health Tips : ఈ ఫుడ్స్ తీసుకుంటే.. థైరాయిడ్ సమస్య ఔట్

Health Tips :
ప్రస్తుత ఆహార అలవాట్ల వల్ల చాలా మంది థైరాయిడ్‌తో బాధపడుతున్నారు. ఈ సమస్య వస్తే తగ్గడం అంత ఈజీ కాదు. థైరాయిడ్ సమస్య ఉన్నవారు ఒక్కసారిగా బరువు పెరిగిపోతారు. లేదంటే పూర్తిగా బరువు తగ్గిపోతారు. ఈ సమస్య వస్తే మనుషులు కూడా చాలా బలహీనం అయిపోతారు. నీరసంగా అనిపిస్తుంది. ఎలాంటి పని కూడా చేయలేరు. ఏ పని మీద కూడా ఇంట్రెస్ట్ పెట్టలేరు. ఎంత ఆరోగ్యమైన ఫుడ్ తీసుకున్నా కూడా ఈ సమస్య అంత ఈజీగా తగ్గదు. ఈ థైరాయిడ్ గ్రంథి శరీర జీవక్రియను నియంత్రిస్తుంది. దీంతో మీరు అనారోగ్య బారిన పడతారు. అయితే ఈ థైరాయిడ్ సమస్య నుంచి బయటపడాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.
పొద్దు తిరుగుడు గింజలు
వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, సెలీనియం, విటమిన్ ఇ, జింక్ వంటివి ఎక్కువగా ఉన్నాయి. ఇవి థైరాయిడ్‌ను తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలాగే నీరసం, అలసటను తగ్గిస్తుంది. ఎలాంటి బలహీనత లేకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. డైలీ ఉదయం వీటిని తినడం అలవాటు చేసుకోండి.
వాల్‌నట్స్
ఇందులో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. అలాగే అలసట రాకుండా చేస్తుంది. వాల్‌నట్స్‌లోని పోషకాలు థైరాయిడ్ గ్రంథి పనితీరును మారుస్తుంది. దీంతో మీరు థైరాయిడ్ సమస్య తగ్గుతుంది.
ఆకుకూరలు
తాజా ఆకు కూరలను ఎక్కువగా తీసుకోండి. ముఖ్యంగా పాలకూర, మెంతులు, ఆవాలు, బతువా వంటి వాటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఇందులో ఐరన్, కాల్షియం, విటమిన్ సి వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎలాంటి అలసట రాకుండా కాపాడతాయి. వీటిని డైలీ తినడం వల్ల కేవలం థైరాయిడ్ మాత్రమే కాకుండా వివిధ రకాల వ్యాధులు కూడా రావు.
బెర్రీలు
బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీ, రాస్ప్బెర్రీ వంటి వాటిని తీసుకోవడం వల్ల థైరాయిడ్ సమస్య తగ్గుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో పాటు ఫ్లేవనాయిడ్స్, విటమిన్ సి కూడా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. వీటివల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
నారింజ
ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరానికి తక్షణమే శక్తిని అందించి.. థైరాయిడ్ సమస్యను తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇది థైరాయిడ్ సమస్యను తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. వీటి వల్ల చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇందులోని పోషకాలు చర్మంపై ముడతలు రాకుండా కాపాడుతుంది. తొందరగా ముసలి తనం కాకుండా చేస్తుంది. డైలా ఒకటి లేదా రెండు ఆరెంజ్ పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.