IPL: ఐపీఎల్ సీజన్‌లో ఈ స్టాక్స్ కొంటే.. లాభమంతా మీదే!

IPL:ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభమైంది. మొదటి మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగింది. ఇందులో రాయల్స్ బెంగళూరు జట్టు ఈ సీజన్‌లో బోణీ కొట్టింది. మొత్తం 74 రోజుల పాటు ఈ ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఐపీఎల్ సీజన్‌లో కూడా ఎక్కువగా బెట్టింగ్‌లు జరుగుతాయి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఇలా ప్రతీ దాంట్లో బెట్టింగ్ జరగడం పక్కా. అయితే ఐపీఎల్ సమయంలో కేవలం బెట్టింగ్‌లు మాత్రమే కాకుండా స్టాక్ మార్కెట్‌లో కూడా చాలా మంది ఇన్వెస్ట్ చేస్తారట. ఈ క్రికెట్ సమయంలో స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అసలు ఐపీఎల్‌కి, స్టాక్ మార్కెట్‌లకు ఉన్న సంబంధం ఏంటి? ఈ సమయంలో ఇన్వెస్ట్ చేస్తే స్టాక్ మార్కెట్‌లో ఎందుకు లాభాలు వస్తాయనే సందేహం వస్తుంది కదా. వెంటనే ఈ డౌట్‌ను క్లియర్ చేసేద్దాం.
దేశంలో క్రికెట్ ప్రేమికులు చాలా మంది ఉన్నారు. మ్యాచ్ వస్తుందంటే చాలు.. క్రికెట్ ప్రేమికులు అందరూ కూడా టీవీలకు అతుక్కుపోతారు. అందులోనూ ఐపీఎల్ అయితే తప్పకుండా టీవీల ముందే ఉంటారు. వీటితో పాటు ఫుడ్ డెలివరీ ఫ్లాట్ ఫామ్స్, క్విక్ డెలివరీ ప్లాట్ ఫామ్స్‌లోని స్టా్క్స్‌కి మంచి లాభాలు వస్తాయి. ఎందుకంటే గంటలు తరబడి టీవీలు చూస్తు్ంటారు. ఈ సమయంలో దీనికి సంబంధించిన స్టాక్స్ పెరుగుతాయి. ఐపీఎల్ దేశ వ్యాప్తంగా జరుగుతాయి. ఈ క్రమంలో చాలా మంది వెళ్తుంటారు. అక్కడ హోటల్స్‌లో ఉండటం, ఫుడ్ తినడం, ఫుడ్ డెలివరీ నుంచి ఆర్డర్లు పెట్టుకోవడం వల్ల వారికి లాభాలు పెరుగుతాయి. వీటితో పాటు ట్రావెలింగ్, ఫుడ్ సంస్థలు, హోటళ్లకు బాగా లాభాలు వస్తాయి. మీరు స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ ఐపీఎల్ సీజన్‌లో ఫుడ్, హోటళ్లు, ట్రావెలింగ్ రంగాల్లో ఉన్న స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్ చేయండి. ఇందులో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు ఈ ఐపీఎల్ సీజన్‌లో మంచి లాభాలు వస్తాయి. అలాగే ఈ ఐపీఎల్ కేవలం దేశీయులను మాత్రమే కాకుండా విదేశీయులను కూడా ఆకర్షిస్తుంది. ఎందుకంటే ఐపీఎల్‌లోని ప్రతీ జట్టులో కనీసం ముగ్గురు లేదా నలుగురు అయినా విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఈ కారణంగా విదేశీయులు కూడా ఐపీఎల్ చూస్తారు. మిగతా స్పోర్ట్స్‌లా ఐపీఎల్‌కు కూడా మంచి డిమాండ్ ఉంది. ప్రపంచ వ్యాప్తంపగా ఎక్కువ మంది ఐపీఎల్‌ను వీక్షిస్తుంటారు. దీనివల్ల స్టాక్స్ పెరుగుతాయని అంటున్నారు. ఈ సమయంలో స్టాక్స్ కొనుగోలు చేయాలంటే మాత్రం తప్పకుండా హోటళ్లు, జొమాటో, స్విగ్గీ, హాస్పిటాలిటీ విభాగంలో కొనుగోలు చేయండి. ఇండియాలో ఉన్న టాప్ హోటళ్ల షేర్లను మాత్రమే కొనుగోలు చేయండి. మీకు నష్టాలు వచ్చే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. తప్పకుండా లాభాలు పొందుతారని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
-
Golden ATM: గోల్డెన్ ఏటీఎం.. బంగారం వేస్తే అకౌంట్లోకి డబ్బులు
-
Gold Loan: బంగారం లోన్ తీసుకునే ముందు.. ఈ విషయాలు తెలుసుకోవడం మరిచిపోవద్దు
-
Top up loan: టాప్ అప్ లోన్ తీసుకునే ముందు.. ఈ విషయాలు తప్పనిసరి
-
BSNL: బీఎస్ఎన్ఎల్ బెస్ట్ ప్లాన్.. బెనిఫిట్స్ తెలిస్తే రీఛార్జ్ చేయకుండా ఉండలేరు
-
Rashid Khan: బుమ్రా రికార్డ్ బ్రేక్ చేసిన రషీద్ ఖాన్
-
Vignesh Putur: చెన్నైకి చెమటలు పట్టించిన పుతుర్.. ఇంతకీ ఎవరు?