Health Tips: ఈ టూత్ పేస్ట్ వల్ల నోట్లో బ్యాక్టీరియా తగ్గదు. అమాంతం పెరుగుతుంది..?

Health Tips:
లేవగానే ముందు పళ్లు తోముకుంటారు చాలా మంది. అయినా ప్రస్తుతం చాలా మంది ఫోన్ లు పడుతున్నారు కదా. ఈ ఫోన్ లు పట్టుకొని పండ్లు తోముతూ ఎంత సేపు తోముతున్నారు? ఎలా తోముతున్నారు అనే విషయాలను అసలు పట్టించుకోరు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న చాలా మంది ఎలాంటి టూత్ పేస్ట్ వాడుతున్నాము? అది మంచిదా కాదా అనే విషయాలు తెలుసుకునే సమయం కేటాయిస్తారా? కానీ మీరు వాడుతున్న టూత్‌పేస్ట్ ఎంత సురక్షితమో మీకు తెలుసా? నిజమే అయితే మీరు చాలా విషయాలు తెలుసుకోవాల్సిందే. ఒక కొత్త అధ్యయనం ప్రకారం, టూత్‌పేస్ట్ మీ నోటి మైక్రోబయోమ్‌కు చాలా హాని కలిగిస్తుంది. నోటి మైక్రోబయోమ్ సరిగ్గా ఉంటే మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. సమతుల్య మైక్రోబయోమ్ నోటిలోని హానికరమైన బ్యాక్టీరియాను నియంత్రిస్తుంది. జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. చిగుళ్ళను రక్షిస్తుంది. కానీ టూత్‌పేస్ట్ సరైనది కాకపోతే అది నోటి మైక్రోబయోమ్‌కు హాని కలిగిస్తుంది.
నోటిలో దాదాపు 700 రకాల బ్యాక్టీరియాలు ఉంటాయట. ఇవన్నీ చిగుళ్ళలో, దంతాల ఉపరితలంలో, లాలాజలంలో ఉంటాయి. ఈ బ్యాక్టీరియా pH స్థాయిని సమతుల్యం చేస్తుంది. ఆహారాన్ని విచ్ఛిన్నం చేసి సహజ యాంటీమైక్రోబయల్ సమ్మేళనాలను ఉత్పత్తి చేస్తుంది. కానీ సరైన ఆహారం తీసుకోకపోవడం, నోటి పరిశుభ్రత సరిగా లేకపోవడం, మందులు వంటివి మైక్రోబయోమ్‌ను దెబ్బతీస్తాయి. దీనివల్ల దంతాలపై ఉన్న పూత ఊడిపోయి చిగుళ్ల వ్యాధికి దారితీస్తుంది.
టూత్‌పేస్ట్‌ను ఉపయోగించడానికి ప్రధాన కారణం నోటిలో హానికరమైన బ్యాక్టీరియా ఉండవద్దు అని కదా..కానీ కొన్ని టూత్ పేస్ట్ లు మరింత పెంచుతున్నాయి. అయితే చాలా టూత్‌పేస్ట్‌లకు ఫ్లోరైడ్ కలుపుతారు. ఇది దంత క్షయాలను నివారిస్తుందని, దంతాల బయటి పొర అయిన ఎనామిల్‌ను రక్షిస్తుందని నమ్ముతారు. ఫ్లోరైడ్ ఆమ్లం ఏర్పడే బ్యాక్టీరియాను ఇలా చేయకుండా నిరోధిస్తుంది. కానీ టూత్‌పేస్ట్‌లో ఉండే యాంటీ బాక్టీరియల్ ఏజెంట్ నోటిలోని హానికరమైన బ్యాక్టీరియాతో పాటు మంచి బ్యాక్టీరియాను తొలగించడం ప్రారంభిస్తుందట.
అయితే, నోటిలోని హానికరమైన బ్యాక్టీరియా మాత్రమే చనిపోయి, మంచి బ్యాక్టీరియా చెక్కుచెదరకుండా ఉండేలా ఎలాంటి సమ్మేళనాన్ని ఉపయోగించాలనే దానిపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. అటువంటి పరిస్థితిలో, ప్రస్తుతానికి ఫ్లోరైడ్ ఉన్న టూత్‌పేస్ట్‌ను మాత్రమే ఉపయోగించాలని అధ్యయనం చెబుతోంది.
దంతాలు దృఢంగా ఉండాలంటే ఏం చేయాలి?
దంతాలు దృఢంగా ఉండాలంటే రోజుకు రెండుసార్లు బ్రష్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. మీరు రోజుకు ఒకసారి గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి పుక్కిలిస్తే, అది నోటిలోని హానికరమైన బ్యాక్టీరియాను చంపుతుంది. కాబట్టి మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. దీనితో పాటు, ఆకుకూరలు, తాజా పండ్లు దంతాలను బలోపేతం చేయడానికి మంచివి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.
-
Health Tips: రోజంతా ఏం తినకపోయినా సరే ఆకలి అనిపించడం లేదా?
-
Laptop : లాప్ టాప్ ముందు కూర్చొని కూర్చొని భుజం నొప్పి వస్తుందా?
-
Fridge: వామ్మో ఫ్రిజ్ లోని ఆహారం తింటున్నారా?
-
Black Salt: నల్ల ఉప్పు వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?
-
Health Tips: ఈ ఫ్రూట్ జూస్ లను మాత్రం అసలు కలిపి తీసుకోవద్దు..
-
Salt : ఉప్పు తక్కువ అయితే ఫుడ్ తినరా? కాస్త ఎక్కువ అయినా డైరెక్ట్ అటేనట..