Health Tips: జలుబు, దగ్గు ఉన్నప్పుడు నారింజ తినవద్దు అంటారు? ఎందుకు? నిజమేనా?

Health Tips:
ఒరె నారింజ తినకురా జలుబు ఎక్కువ అవుతుంది. ముక్కు కారుతుంది అయినా తింటున్నావా? ఎన్ని సార్లు చెప్పాలి నీకు? కాస్త జలుబు, దగ్గు తగ్గినాక తిందువులే అని ఇంట్లో ఎవరో ఒకరు అంటూనే ఉంటారు కదా. ఇక సాయంత్రం అవుతోంది, నారింజ తినకండి, మీకు జలుబు చేస్తుంది అనే మాట కూడా వినిపిస్తుంది. జలుబు ఉంటే నారింజ తింటే మరింత ఎక్కువ అవుతుందట.ఈ మాటలు చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. సో వీటి విషయంలో నమ్మకం కూడా అదే రేంజ్ లో ఉంది. సాయంత్రం అయితే నారింజ తినరు. ఇక జలుబు, దగ్గు ఉన్నవారు కూడా వీటికి దూరంగానే ఉంటారు? మరి ఇందులో నిజం ఉందా? లేదా? ఈ విషయాలు ఆర్టికల్ లో తెలుసుకుందాం.
నారింజ తినడం వల్ల జలుబు వస్తుందా?
నారింజ తినడం వల్ల జలుబు రాదని డాక్టర్లు అంటున్నారు. జస్ట్ ఇది పురాతన కాలం నుంచి వినడం వల్ల చాలా మంది నమ్ముతున్నారట. కానీ ఇది నిజమని నిరూపించడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు అంటున్నారు వైద్యులు. నారింజ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఈ విటమిన్ సి వల్ల వచ్చే రోగనిరోధక శక్తి జలుబు, దగ్గును నివారిస్తుంది.
కొంతమంది వ్యక్తులు శీతాకాలంలో లేదా గొంతు నొప్పిగా ఉన్నప్పుడు సిట్రస్ పండ్లను తినరు. ఇలా తింటే లక్షణాలు మరింత తీవ్రం అవుతాయి అని నమ్ముతారు. నారింజ పండ్లు కొద్దిగా ఆమ్లంగా ఉండటం వల్ల ఈ లక్షణాలు నిజంగానే వస్తాయి అంటున్నారు నిపుణులు. కొన్నిసార్లు సున్నితమైన వ్యక్తులలో తేలికపాటి గొంతు చికాకును కలిగిస్తుంది నారింజ.
జలుబు, దగ్గు ఎందుకు వస్తాయి?
జలుబు, దగ్గు వైరస్ల వల్ల వస్తాయని, ఏదైనా ప్రత్యేకమైన ఆహారం తినడం వల్ల కాదని డాక్టర్లు అంటున్నారు. ఈ వైరస్‌లు కలుషితమైన ఉపరితలాలు, శ్వాసకోశ బిందువులు లేదా అనారోగ్య వ్యక్తితో సన్నిహిత సంబంధం ద్వారా వ్యాపిస్తాయి. నిజానికి, మీ ఆహారంలో నారింజ పండ్లను యాడ్ చేసుకుంటే మంచి ఫలితాలే వస్తాయి కానీ ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. వీటి వల్ల అవసరమైన పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు, హైడ్రేషన్‌ను అందుతుంది.
ఈ విషయాలను గుర్తుంచుకోండి
మొత్తం మీద, నారింజ పండ్లు జలుబుకు బదులుగా, రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి అని గుర్తు పెట్టుకోండి. మీకు గొంతు నొప్పి ఉంటే , అసౌకర్యాన్ని నివారించడానికి ఫ్రిజ్‌లో ఉంచిన చల్లని జ్యూస్ కంటే సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఉంచిన తాజా నారింజ రసం తీసుకోవడం బెటర్. అలాగే, నారింజ పండ్లను స్కిప్ చేయడం కంటే మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి మంచి పరిశుభ్రత, సమతుల్య ఆహారం తీసుకోవడంపై దృష్టి పెట్టండి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.
-
Health Tips: రోజంతా ఏం తినకపోయినా సరే ఆకలి అనిపించడం లేదా?
-
Laptop : లాప్ టాప్ ముందు కూర్చొని కూర్చొని భుజం నొప్పి వస్తుందా?
-
Fridge: వామ్మో ఫ్రిజ్ లోని ఆహారం తింటున్నారా?
-
Black Salt: నల్ల ఉప్పు వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?
-
Health Tips: ఈ ఫ్రూట్ జూస్ లను మాత్రం అసలు కలిపి తీసుకోవద్దు..
-
Salt : ఉప్పు తక్కువ అయితే ఫుడ్ తినరా? కాస్త ఎక్కువ అయినా డైరెక్ట్ అటేనట..