Heart Attack: పాదాలలో కానీ బొటనవేలులో కానీ ఈ మార్పులు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి…ఇవి గుండెపోటుకు సంకేతాలు

Heart Attack:
చాలామంది తమ చేతులు మరియు కాళ్లలో సమస్య ఉన్నప్పటికీ లైట్ తీసుకుంటారు. పాదాలలో నొప్పి, పాదాల చర్మంలో సమస్య, గోళ్ళ సమస్య, బొటనవేలు రంగు, ఆకారంలో సమస్య ఉంటే చాలామంది ఈ విషయాన్ని లైట్ తీసుకుంటారు. కానీ దానిని అస్సలు తేలికగా తీసుకోకూడదని చాలా డేంజర్ అని నిపుణులు చెప్తున్నారు.
పాదాలలో మార్పులు తీవ్రమైన గుండె జబ్బుకు సంకేతం కావచ్చని చెప్తున్నారు. నిపుణులు చెప్పిన దాన్ని బట్టి పాదాలలో ఫంగల్ ఇన్ఫెక్షన్ గుండె జబ్బుల ప్రారంభ సంకేతాలు కావచ్చు. కాబట్టి ఇటువంటి విషయాలను ఎప్పుడూ తేలికగా తీసుకోకూడదు. డైలీ మెయిల్ నివేదిక ప్రకారం మన శరీరంలో గుండె జబ్బుల ప్రారంభ సంకేతాలు కనిపించే మొదటి భాగం పాదాలు అని నిపుణులు చెప్తున్నారు. శరీరంలో కొలెస్ట్రాల్ అనే జిగట పదార్థం రక్తనాళాలలో పేరుకుపోవడం వలన అది బ్లడ్ను బ్లాక్ అయ్యేలా చేస్తుంది. దీనివలన శరీరంలోని మారుమూర ప్రాంతాలకు తక్కువగా రక్తం సరఫరా అవుతుంది. ఈ కారణం చేతనే పాదాలలో సంకేతాలు కనిపించడం ప్రారంభిస్తాయి. రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోవడం వలన గుండె నుండి కాళ్లకు రక్తం, ఆక్సిజన్ సరైన పద్ధతిలో చేరవు. దీని చేత గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. చీల మండల వద్దకు వెళ్లే కొన్ని రక్తనాళాలు చాలా సన్నగా మారతాయి. ఈ కారణం చేతనే ఇక్కడికి రక్తం చేరుకోవడంలో సమస్య ఏర్పడుతుంది. ఇక రక్తనాళాలు మూసుకుపోవడం మొదలుపెట్టినప్పుడు మరిన్ని సమస్యలు మొదలవుతాయి. పాదాలకు తక్కువ రక్తం సరఫరా అవ్వడం వలన పాదాలకు తిమ్మిర్లు కూడా వస్తాయి. మరికొన్ని సందర్భాలలో కాళ్లలో నొప్పి, వాపు కూడా కనిపిస్తాయి. పాదాలకు తక్కువ రక్తం సరఫరా అయినప్పుడు అది గోళ్ళపై కూడా ప్రభావం చూపిస్తుంది.
ఈ కారణం చేత గొళ్ళు బలహీనంగా మారతాయి. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ పాదాలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే మన పాదాల ఆరోగ్య ప్రభావం మన మొత్తం శరీర ఆరోగ్యాన్ని చెబుతుంది అని వైద్య నిపుణులు చెప్తున్నారు. శరీరంలో అనేక రకాల వ్యాధుల సంకేతాలు ముందుగా పాదాలలో కనిపిస్తాయి. పరిశోధనాల ప్రకారం 60 ఏళ్లు దాటిన ప్రతి నలుగురిలో ఒకరికి ఏదో ఒక రకమైన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. సకాలంలో పాదాలకు శ్రద్ధ తీసుకోవడం వలన గుండె సంబంధిత సమస్యలను ముందుగానే తగ్గించుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు. శరీరంలోని రక్తనాళాలలో కొవ్వు పేరుకు పోతే దానిని పరిధియ ధమని వ్యాధి అని అంటారు.
దాని సంకేతం ముందుగా పాదాలలో కనిపిస్తుంది. ఈ కారణంగా తరచుగా కాళ్లలో నొప్పి ఉంటుంది. నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. కొంత సమయం తర్వాత ఈ నొప్పి మాయమవుతుంది. ఈ కారణం చేతనే చాలామంది దీనిని శ్రద్ధగా పట్టించుకోరు. రెండు కాళ్లలో కూడా ఈ నొప్పి ఒకేసారి కనిపిస్తుంది. అలాగే పాదాలలో జలదరింపు, నొప్పి, చర్మం పొడిబారడం, మంట, చర్మం పగుళ్లు రావడం, బొబ్బలు రావడం, గాయాలు కనిపించడం వంటివి కూడా తేలికగా తీసుకోకూడదని నిపుణులు చెప్తున్నారు. ఇటువంటి సభ్యతాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.