Sudden Weight Loss: తొందరగా బరువు తగ్గుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త

Sudden Weight Loss:
కాస్త బొద్దుగా ఉంటే చాలు బరువు తగ్గాలని చాలా మంది అనుకుంటారు. దీంతో వెంటనే బరువు తగ్గాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా తొందరగా బరువు తగ్గాలని అనుకుంటారు. ఒక 15 రోజులు లేదా నెల రోజుల్లో ఈజీగా బరువు తగ్గాలని ప్లాన్ చేసుకుంటారు. ఈ క్రమంలో కొందరు జిమ్‌కి వెళ్లడం, బరువు తగ్గే వాటి దగ్గరికి వెళ్తుంటారు. కొందరు అయితే పూర్తిగా తినడం మానేస్తారు. ఫుడ్ తినడం మానేస్తే ఈజీగా బరువు తగ్గుతారని అనుకుంటారు. అయితే ఇలా తొందరగా కూడా బరువు తగ్గడం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు. అయితే తొందరగా బరువు తగ్గడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటో చూద్దాం.
కండరాల సమస్యలు
తొందరగా బరువు తగ్గడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే తొందరగా తగ్గడం వల్ల కండరాలకు సరిగ్గా పోషకాలు అందవు. దీంతో అవి బలహీనం అవుతాయి. కాబట్టి తొందరగా బరువు తగ్గవద్దు. బరువు తగ్గడం కూడా సరైన పద్ధతిలో ఉంటేనే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. లేకపోతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడతారు.
జుట్టు రాలిపోవడం
ఒక్కసారిగా బరువు తగ్గితే శరీరంలోని క్యాలరీలు అన్ని కూడా తగ్గిపోతాయి. వీటివల్ల జుట్టు రాలిపోవడం, రక్తహీనత వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
రోగనిరోధక శక్తి
సడెన్‌గా బరువు తగ్గితే రోగనిరోధక శక్తి పూర్తిగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఎక్కువగా ఇన్ఫెక్షన్లు, జలుబు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మళ్లీ బరువు పెరగడం
అకస్మాత్తుగా బరువు తగ్గడం వల్ల జీవక్రియ మందగిస్తుంది. దీంతో ఒక్కసారిగా మళ్లీ బరువు పెరుగుతారు. అలాగే మహిళల్లో నెలసరి సమస్యలు వస్తాయి. ఒత్తిడి ఎక్కువగా పెరుగుతుంది.
గుండె సమస్యలు
తొందరగా బరువు తగ్గడం వల్ల గుండె సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గడం వల్ల రక్తపోటు తగ్గిపోతుంది. దీంతో గుండె పోటు వచ్చే ప్రమాదం ఉంది.
మలబద్ధకం
బరువు తగ్గడం వల్ల మలబద్ధకం, కడుపు సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే బరువు తగ్గితే శరీరంలో ఎలాంటి ఫైబర్లు కూడా ఉండవు. వీటివల్ల కడుపు నొప్పి వంటివి కూడా వచ్చే ప్రమాదం ఉంది.
మానసిక సమస్యలు
సడెన్‌గా బరువు తగ్గితే కాలేయంలో రాళ్లు, మానసిక సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటితో పాటు నీరసం అలసట వంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Exercise: మనం ఎక్కువ సేపు కూర్చోవడం కోసం పుట్టలేదు.. అలా ఉంటే డేంజరే
-
Biryani With Drink: బిర్యానీ విత్ డ్రింక్ తాగుతున్నారా.. అయితే ఈ ఆర్టికల్ మీకోసమే!
-
Stress Relief: ఒత్తిడి నుంచి విముక్తి పొందాలంటే.. ఈ టైప్ ధ్యానం తప్పనిసరి
-
Breakfast: ప్రతీ రోజూ టిఫిన్ స్కిప్ చేస్తున్నారా.. అయితే ఇది మీ కోసమే
-
Cardiac Arrest : హార్ట్ ఎటాక్ కంటే కార్డియాక్ అరెస్ట్ మరింత ప్రమాదకరమా? దీని లక్షణాలు ఎలా ఉంటాయి?
-
Pani puri: ఇష్టమని పానీ పూరీ లాగించేస్తున్నారా.. ఈ సీజన్‌లో తింటే ప్రాణాలు గోవిందా!