Heart Attacks: భారతీయుల్లోనే గుండె పోటు ఎక్కువ.. దీనికి కారణమేంటి?

Heart Attacks: ప్రస్తుతం రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది గుండె పోటు బారిన పడుతున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరికీ కూడా గుండె పోటు వస్తుంది. స్కూల్లో చదువుతూ, ఆడుతూ, డ్యాన్స్ వేస్తూ ఇలా ఏదో ఒకటి చేస్తుండగానే కొందరు గుండె పోటు బారిన పడుతున్నారు. మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్ల వల్ల వయస్సుతో సంబంధం లేకుండా ఈ సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఈ గుండెపోటు సమస్య అనేది విదేశీయుల్లో కంటే భారతీయుల్లోనే ఎక్కువగా ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. నిజానికి విదేశీయుల ఆహార అలవాట్ల కంటే ఇండియా ఆహార అలవాట్లు ఆరోగ్యమైనవే ఉంటాయి. ఆరోగ్యానికి మేలు చేసే వాటినే ఎక్కువగా తీసుకుంటారు. అయినా కూడా గుండె పోటు సమస్య బారిన పడుతున్నారు. గత రెండేళ్ల నుంచి అయితే గుండె పోటులో మరణించే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది. అయితే విదేశీయుల కంటే భారతీయుల్లోనే గుండె పోటు ఎందుకో చూద్దాం.
గుండె పోటు రావడానికి ఊబకాయం కూడా ఓ కారణం. ఎందుకంటే ఊబకాయం వల్ల ధమనుల్లో అడ్డంకులు వస్తాయి. ఇలాంటి సమయాల్లో గుండె పోటు వస్తుంది. అయితే దీనికి ముఖ్య కారణం మన జీవనశైలి అని నిపుణులు చెబుతున్నారు. విదేశీయుల ధమనులు విశాలంగా ఉంటాయి. భారతీయుల ధనములు చాలా ఇరుకైనవి. దీంతో మన ఆహార అలవాట్లు సెట్ కావు. దీనివల్లే ఎక్కువగా గుండె పోటు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. విదేశీయుల ధమనులు కాస్త విశాలంగా ఉండటం వల్ల వారు తీసుకున్న ఫుడ్ ఎలాంటి ఇబ్బందులను కలిగించదు. కానీ మనం తీసుకునే ఆహార అలవాట్లు అనారోగ్య సమస్యల బారిన పడేలా చేస్తుంది. ప్రస్తుతం చాలా మంది ఆరోగ్యమైన పదార్థాల కంటే అనారోగ్యాన్ని ఇచ్చే వాటిని తీసుకుంటున్నారు. ఇందులో పోషకాలు లేకపోవడం వల్ల ఇవి అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. ప్రాసెస్డ్ ఫుడ్, వేయించి పదార్థాలు, సాఫ్ట్ డ్రింక్స్, మైదా ఉండే పదార్థాలు ఎక్కువగా తీసుకుంటారు. వీటిలో పూర్తిగా పోషకాలు ఉండవు. ఇవి శరీరానికి ఎలాంటి ప్రయోజనాలను అందించవు. వీటివల్ల బాగా ఊబకాయం పెరిగిపోతుంది. దీంతో గుండె పోటు ఎక్కువగా భారతీయుల్లో వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో కొవ్వు ఎక్కువగా పెరిగిపోయినా కూడా రక్తం గడ్డకడుతుంది. దీంతో రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవడం వల్ల గుండెపై ఒత్తిడి పడి.. గుండె పోటు వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గుండె పోటు వంటివి రాకుండా ఉండాలంటే ఆరోగ్యమైన ఫుడ్స్ తీసుకోండి. పూర్తిగా జంక్ ఫుడ్‌కి దూరంగా ఉండండి. ఆకుపచ్చని కూరగాయలు, పండ్లు, గింజలు, డ్రైఫూట్స్ వంటి వాటిని ఎక్కువగా తీసుకోండి. వీటిలోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. వీటితో పాటు డైలీ వ్యాయామం చేయడం, యోగా, మెడిటేషన్ వంటివి కూడా చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా ఒత్తిడికి గురికాకుండా ఆరోగ్యమైన ఫుడ్స్ తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా దరిచేరవని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఈ నియమాలు పాటిస్తూ.. ఆరోగ్యంగా ఉండండి.
-
Heart Patients: హార్ట్ పేషెంట్స్ నడవచ్చా.. నడిస్తే ఏమవుతుంది?
-
Sudden Weight Loss: తొందరగా బరువు తగ్గుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త
-
Heart Attack: పాదాలలో కానీ బొటనవేలులో కానీ ఈ మార్పులు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి…ఇవి గుండెపోటుకు సంకేతాలు
-
Heart Attack: మీకు గుండె పోటు వచ్చే నెల రోజుల ముందు నుంచే ఈ 8 సంకేతాలు ఉంటాయి.. అవేంటంటే?
-
Heart Health: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే వంటింట్లోని ఈ తెల్ల ఆహారాలకు దూరంగా ఉండాల్సిందే.