Herbs : మీ కాలేయానికి రక్షకులు ఈ మూలికలు.. ఎలా తీసుకోవాలంటే?

Herbs : మందు బాబులం మేము మందుబాబులం అంటూ మందును తెగ లాగించేస్తున్నారా? కానీ దీని వల్ల ఎన్ని సమస్యలు వస్తాయో మర్చిపోతున్నారా? ఖరీదు చేసి కొనే మందు మిమ్మల్ని ఆస్పత్రి పాలు చేస్తుంది. మరీ ముఖ్యంగా మీ కాలేయ ఆరోగ్యానికి మరింత హాని చేస్తుంది. అయితే మన దేశంలో ఆల్కహాల్ లేని ఫ్యాటీ లివర్ వ్యాధి 9-32 శాతం ఉందని తెలుపుతున్నాయి అధ్యయనాలు. అయితే అతిగా మందు సేవించే వారిలో 90 శాతం మంది ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్నారని చెబుతున్నాయి అధ్యయనాలు. ఇంతకీ ఈ ఫ్యాటీ లివర్ వ్యాధి అంటే ఏంటి అనుకుంటున్నారా? కాలేయంలో అదనపు కొవ్వు పేరుకుపోవడం వల్ల ఈ వ్యాధి వస్తుందట. దీన్ని హెపాటిక్ స్టీటోసిస్ అని చెబుతుంటారు వైద్యులు. అయితే ఈ కాలేయ సంబంధ వ్యాధులు ఎక్కువగా మద్యం సేవించడం వల్ల మాత్రమే వస్తుంటాయి.
కేవలం మద్యం వల్ల మాత్రమే కాకుండా కొన్ని సార్లు మీరు సరైన జీవనశైలి పాటించకపోయినా సరే కాలేయ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే మందు తాగని వారికి కూడా కాలేయ సమస్యలు వస్తుంటాయి. ఎవరైనా సరే మీ కాలేయంలో అధిక కొవ్వు పేరుకుపోతే కొన్ని మూలికలు తీసుకోవచ్చు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు దీక్షా బావ్సర్ సవాలియా. మరి ఆ మూలికలు ఏంటి ఎలాంటి ప్రయోజనాలను అందిస్తాయో చూసేద్దాం.
పునర్నవ మూలిక:
మూలికలను తినడం వల్ల మంచి ఔషధంగా సహాయపడుతుంది. ఇక మూత్రవిసర్జన కూడా తేలిక అవుతుంది. ఈ పునర్నవ మూలిక కాలేయ కాణాల నుంచి విషాన్ని తొలగిస్తుంది. తద్వారా కాలేయ పనితీరు మెరుగు అవుతుంది. ఇక ఇది ఆకలిని పుట్టిస్తుంది. సో జీర్న సమస్యలను కూడా తగ్గిస్తుందట. నిపుణుల సలహా మేరకు కషాయాల రూపంలో ఈ పునర్నవ మూలికను తీసుకోవాలి. ఒక టీ స్పూన్ మూలికల పొడికి 2 కప్పుల నీటిని కలిపి సగం అయ్యే వరకు మరగించాలి. ఆ తర్వాత వడకట్టి తాగాలి.
భూమి- అమల్కి: ఇది మంట, ఒత్తిడిని తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. కాలేయ ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. ఇక కాలేయ సహజ టాక్సిన్ తొలగింపును ప్రోత్సహిస్తుంది ఈ మూలిక. అర టీ స్పూన్ భూమి-అమల్కి పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి ఖాళీ కడుపుతో లేదా భోజనం చేసిన 2 గంటల తర్వాత తీసుకోవాలి.
భ్రింగరాజ్: ఇది కూడా కాలేయానికి ఒక సూపర్ మూలిక. దీన్ని తీసుకుంటే కాలేయ సంబంధ సమస్యలు దూరం అవుతాయి. పిత్తాన్ని సమతుల్యం చేస్తుంది. పిత్త ప్రవాహాన్ని ప్రోత్సహిస్తుంది. ఇక కాలేయం వేగంగా కోలుకుంటుంది. భోజనానికి ముందు లేదా తర్వాత గోరు వెచ్చని నీటిలో రోజుకు ఒక సారి 1/4 నుంచి 1/4 టీ స్పూన్ తీసుకోవాలి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని trendingtelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.
-
Liver Problem Symptoms: ఈ లక్షణాలు కనిపిస్తే మీ లివర్ ప్రాబ్లమ్ లో ఉన్నట్లే..
-
Healthy Food : ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారమే కీలకం.. వృద్ధాప్యంలో పాటించాల్సిన ముఖ్యమైన ఆహార నియమాలు ఇవే!
-
Exercise: మనం ఎక్కువ సేపు కూర్చోవడం కోసం పుట్టలేదు.. అలా ఉంటే డేంజరే
-
Fish Venkat : నటుడు ఫిష్ వెంకట్ ఆరోగ్యం ప్రస్తుతం ఎలా ఉందంటే.. డాక్టర్లు ఏమంటున్నారంటే
-
Astrology: ఈ రత్నాలను వేళ్లకు ధరించారో.. అదృష్టమంతా మీ సొంతం
-
Cancer : మాటిమాటికీ గ్యాస్, మలబద్ధకం క్యాన్సర్‌కు కారణమట.. జాగ్రత్త పడకపోతే కష్టమే!