Oil: ఈ టిప్స్ పాటిస్తే.. కల్తీ నూనెను గుర్తించడం ఈజీ

Oil:
ఇంట్లో ఏవైనా వంటలు చేయాలంటే తప్పకుండా నూనె ఉండాలి. కానీ ప్రస్తుతం రోజుల్లో నూనె కూడా కల్తీ అవుతోంది. మన ధరించే దుస్తుల నుంచి వండుకునే వంటల వరకు అన్ని కూడా కల్తీ అవుతున్నాయి. ఇలా కల్తీ అయిన వాటిని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఎందుకంటే లాభాల కోసం కల్తీ పదార్థాలను తయారు చేస్తారు. కొన్ని రసాయనాలు ఉపయోగించి వీటిని తయారు చేయడం వల్ల చూడటానికి రియల్ నూనెలానే కనిపిస్తుంది. కానీ కల్తీ అయి ఉంటుంది. ప్రస్తుతం రోజుల్లో అయితే ఇలాంటి కల్తీ నూనెలు ఎక్కువగా ఉన్నాయి. కొందరు ఈ కల్తీ నూనెల వల్ల సహజంగా గానుగ దగ్గర తయారు చేసిన వాటిని తెచ్చుకుంటున్నారు. ఈ నూనెలో ఎలాంటి కల్తీ ఉండదు. ఈ గానుగ నూనెలు ఫ్రెష్‌గానే ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఇంకా శరీర ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. వీటిలో ఎలాంటి రసాయనాలు లేకపోవడం వల్ల ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. అయితే చాలా మందికి కల్తీ నూనె అని తెలియక వాటిని వాడుతుంటారు. మరి కల్తీ నూనెను గుర్తించడం ఎలాగో ఈ స్టోరీలో చూద్దాం.
నూనె కల్తీ కాదో లేదో తెలుసుకోవడానికి నూనెను ఒక గిన్నెలో వేసి ఫ్రీజర్‌లో ఉంచాలి. అది మొత్తం గడ్డకడితే ఆ నూనె స్వచ్ఛమైనది. అదే ద్రవ రూపంలో ఉంటే మాత్రం అది కల్తీ నూనె అని గుర్తించండి. అన్ని నూనెలను ఇలా టెస్ట్ చేయవచ్చు. అలాగే ఒక తెల్లని పేపర్‌పై కాస్త నూనె రాసి ఆరపెట్టాలి. దానిపై వృత్తంలా ఉంటే అది కల్తీ నూనె అని గుర్తించండి. అదే ఏం లేకుండా ఉంటే ఆ నూనె స్వచ్ఛమైనదని అర్థం చేసుకోండి. అలాగే నూనెను కాస్త ట్యూబ్‌లో వేసి బాగా కలపాలి. అందులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ కలపాలి. నూనె రంగు మారకపోతే అది స్వచ్ఛమైనదని అర్థం చేసుకోవాలి. అదే రంగు మారితే కల్తీ అయ్యిందని అర్థం చేసుకోవాలి. అలాగే నూనెను కాస్త కాళ్లకు రాయండి. ఈ నూనె నుంచి ఎలాంటి రంగు అయినా కూడా అంటుకుంటే.. అది కల్తీ అయ్యిందని అర్థం. అదే రంగు ఏం రాకపోతే నూనె కల్తీ కాలేదని అర్థం. మీరు నూనెను కొనుగోలు చేసే ముందు తప్పకుండా ఈ పరీక్షలు చేయండి. లేకపోతే మీరు కల్తీ నూనెను తీసుకుని అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. వీటివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వీటిని రసాయనాలతో కలిపి తయారు చేయడం వల్ల ఇవి శరీర ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. కాబట్టి కల్తీ పదార్థాల నుంచి దూరంగా ఉండండి. వీటికి బదులు గానుగ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిది.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Exams complete: విద్యార్థులకు పరీక్షలు ముగిశాయా.. ఓ కన్నేసి ఉంచండి
-
Cooking Oil: వంటల్లో నూనెను తగ్గించేందుకు చిట్కాలివే
-
Rashmika Mandanna: రష్మిక ఆస్తులు తెలిస్తే.. షాక్ కావాల్సిందే
-
Hair: జుట్టు పెరగాలంటే ఇది ఒక్కటి రాస్తే చాలు
-
Concentration: ఏకాగ్రత ఉన్నవారిలో కనిపించే లక్షణాలివే
-
Health Issues: ఎక్కువగా చెమటలు వస్తున్నాయా.. మీకు ఈ సమస్యలు ఉన్నట్లే