Pregnancy time : మహిళలు తల్లి కావడానికి ఉత్తమమైన సమయం ఏంటో తెలుసా?

Pregnancy time :
ఒక్కసారి పెళ్లి అయిందంటే చాలు ఎంత మంది పిల్లలు? ఎంత మంది పిల్లలు అని అడుగుతూనే ఉంటారు. అది కూడా సంవత్సరం కాకముందే కదా..జస్ట్ పెళ్లి అయిన వెంటనే ఏమైనా విశేషమా అంటూ ఓ తెగ అడుగుతుంటారు. కానీ తల్లి కావడం, పెళ్లి చేసుకోవడం వంటి నిర్ణయాలు చాలా వ్యక్తిగతమైనవి కదా. అయినా అందరికీ ఈ విషయాల మీదనే ఆసక్తి ఉంటుంది. కాస్త లేట్ అయితే చాలు కాకుల్లా పొడుస్తుంటారు. అలాంటి నిర్ణయాలు ఎవరి ఒత్తిడిలోనూ కాకుండా జాగ్రత్తగా తీసుకోవాలి. అయితే మహిళలు ఋతుస్రావం ప్రారంభమైనప్పటి నుంచి యుక్తవయస్సు వచ్చి ఋతుస్రావం ఆగిపోయే వరకు పిల్లలను కనే అవకాశం ఉంటుంది. హెల్త్‌లైన్ ప్రకారం, సగటు స్త్రీ పునరుత్పత్తి సంవత్సరాలు 12 – 51 సంవత్సరాల మధ్య ఉంటుంది. అయితే వయసు పెరిగే కొద్దీ, మీ సంతానోత్పత్తి సహజంగా తగ్గుతుంది. ఇలా వయసు పెరుగుతున్న కొద్ది గర్బం దాల్చడం కష్టం అవుతుంది. ఇంతకీ తల్లి కావడానికి ఏ సమయం సరైనది అనే అనుమానం మీలో ఉందా? అయితే ఇప్పుడు తెలుసుకుందాం.
గర్భం దాల్చడానికి ఉత్తమ సమయం 20ల చివరి నుంచి 30ల మధ్య ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ వయస్సు స్త్రీ- బిడ్డ ఇద్దరికీ ఉత్తమ ఫలితాలను అందిస్తుంది. నిజానికి, ఈ వయస్సులో బిడ్డకు జన్మనివ్వడంలో సమస్యలు చాలా తక్కువగా ఉంటాయి. అదే సమయంలో, మొదటి బిడ్డకు జన్మనివ్వడానికి అనువైన వయస్సు 30.5 సంవత్సరాలు అని ఒక అధ్యయనం పేర్కొంది.
ఉత్తమ వయస్సు – మహిళల్లో సంతానోత్పత్తి 20 నుంచి 30 సంవత్సరాల మధ్య అత్యధికంగా ఉంటుంది కూడా. బదులుగా, ఈ దశాబ్దంలో మహిళల సంతానోత్పత్తి గరిష్ట స్థాయిలో ఉంది. గర్భధారణ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు ఈ వయస్సులో గర్భస్రావం, అధిక రక్తపోటు, గర్భధారణ మధుమేహం వంటి సమస్యల ప్రమాదం తగ్గుతుంది. ఈ వయస్సులో గర్భం దాల్చినట్లయితే, బిడ్డలో పుట్టుకతో వచ్చే లోపాలు, జన్యుపరమైన రుగ్మతల ప్రమాదం కూడా తగ్గుతుంది.
30 ఏళ్ల తర్వాత మహిళల్లో ఎలాంటి మార్పులు వస్తాయి?
30-35 సంవత్సరాలు వయస్సు తర్వాత, మహిళల సంతానోత్పత్తి క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది. అయినప్పటికీ దీనిని సురక్షితమైన వయస్సుగా పరిగణిస్తారు. 35 సంవత్సరాల తర్వాత అండాల నాణ్యత తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది గర్భం దాల్చడంలో ఇబ్బందులను కలిగిస్తుంది. గర్భస్రావం, పుట్టుకతో వచ్చే రుగ్మతలు (డౌన్ సిండ్రోమ్ వంటివి) పెరిగే ప్రమాదం కూడా ఉంది. కొన్నిసార్లు IVF (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) వంటి పద్ధతులు అవసరం కావచ్చు.
మహిళలు తల్లులు కావడానికి, తమ పిల్లలను పెంచడానికి ఉత్తమమైన సమయమే వారి కెరీర్ కోసం కూడా ఉత్తమమైన సమయం కాబట్టి ఈ కారణంగానే నేడు చాలా మంది మహిళలు తమ కెరీర్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే ఆలస్యంగా గర్భధారణను ఎంచుకుంటున్నారు మహిళలు. కానీ ఈ సమయంలో వారు అనేక సమస్యలను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. IVF, ఎగ్ ఫ్రీజింగ్, ఇతర వైద్య పద్ధతుల వంటి వైద్య పురోగతి కారణంగా, 35-40 సంవత్సరాల వయస్సులో కూడా ఆరోగ్యకరమైన గర్భధారణ సాధ్యమవుతోంది. అదే సమయంలో, ఆలస్యంగా వివాహం చేసుకోవడం, కుటుంబం ఆలస్యంగా పెరగడం వంటివి కనిపిస్తున్నాయి.
శాస్త్రీయంగా చెప్పాలంటే, 20 నుంచి 30 సంవత్సరాల వయస్సు గర్భధారణకు అత్యంత అనువైనదిగా చెబుతున్నారు నిపుణులు. కానీ మారుతున్న కాలంతో, జీవనశైలి, వైద్య సౌకర్యాల సహాయంతో, 30-35 తర్వాత కూడా ఆరోగ్యకరమైన గర్భం సాధ్యమవుతుంది. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా సిద్ధంగా ఉన్న తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకోవడం ముఖ్యం.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.