Skin Health: ఈ పటికతో చర్మాన్ని మెరిపించండి.. ఒక్కసారి అప్లై చేస్తే అందం మీ సొంతం

Skin Health:
వేసవి కాలంలో చర్మం ఎక్కువగా ట్యాన్‌కు గురి అవుతుంది. ఎండ వల్ల చర్మం నల్లగా మారిపోతుంది. దీంతో చాలా మంది బయట దొరికే ప్రొడక్ట్స్ ఎక్కువగా వాడుతుంటారు. వీటివల్ల ఆ నిమిషానికి అందంగా కనిపించినా కూడా తర్వాత మొటిమలు వంటివి వచ్చేస్తాయి. అదే రసాయనాలు లేని వాటిని వాడటం వల్ల ముఖం అందంగా ఉంటుంది. అలాగే ఎలాంటి చర్మ సంబంధిత సమస్యలు కూడా రావు. చర్మం ఆరోగ్యంగా ఉండటంతో పాటు అందంగా ఉంటుంది. రసాయనాలు ఉండే ప్రొడక్ట్స్ వల్ల చర్మం పూర్తిగా దెబ్బతింటుంది. తొందరగా ముడతలు వచ్చి.. ముసలితనం కనిపిస్తుంది. అదే మీరు సహజ పదార్థాలను ముఖానికి అప్లై చేస్తే అందంగా ఉంటారు. మనకి మార్కెట్లో దొరికే పటిను చర్మానికి అప్లై చేస్తే.. చర్మం మెరిసిపోతుంది. పటికను ఎలా చర్మానికి అప్లై చేస్తే ముఖం మెరిసిపోతుందో ఈ స్టోరీలో చూద్దాం.
పటికను బాగా పొడి చేసి అందులో వాటర్ కలిపి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను రాత్రి సమయాల్లో ముఖానికి అప్లై చేసి.. ప్యాక్ వేసుకోవాలి. ఆ తర్వాత ఒక గంట ఉంచి.. ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇలా చేస్తే మొటిమలు తగ్గిపోతాయి. మీరు రాత్రంతా ముఖానికి పటికను ఉంచినా కూడా పర్లేదు. కొందరి చర్మం ఎక్కువ ట్యాన్‌కి గురి అవుతుంది. అలాంటి వారు ఈ పటికను ముఖానికి అప్లై చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా జిడ్డు చర్మం వారికి బాగా ఉపయోగపడుతుంది. నల్లగా ఉన్నవారికి కూడా ఈ పటిక బాగా ఉపయోగపడుతుంది. పటికలోని పోషకాలు ముఖాన్ని తెల్లగా చేస్తాయి. అలాగే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్‌ను క్లియర్ చేయడంలో కూడా పటిక బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వేసవిలో ట్యాన్ ఎక్కువగా ఉంటుంది. అదే మీరు ఈ పటికను చర్మానికి అప్లై చేయడం వల్ల ట్యాన్ తగ్గుతుంది. మీ ముఖం ఇంకా ఎక్కువ కాంతివంతంగా ఉంటుంది. చర్మంపై ఉండే ముడతలు అన్ని కూడా క్లియర్ అవుతాయి. కొందరు సరిగ్గా నిద్రపోక వారికి కళ్ల కింద డార్క్ సర్కిల్స్ వస్తాయి. ఇలాంటి వారు పటిక పొడిని రాసి కళ్ల కింద అప్లై చేయాలి. ఇలా చేస్తే డార్క్ సర్కిల్స్ ఈజీగా తగ్గిపోతాయి.
ఒక్కోక్కరి చర్మం ఒక్కోలా ఉంటుంది. కాబట్టి ఈ ప్యాక్ డైరెక్ట్‌గా వేసుకోకుండా ముందు కాళ్లకు వేయండి. దీనివల్ల మీ చర్మం పరిస్థితి తెలుస్తుంది. అప్పుడు ముఖానికి వేయండి. లేదా నిపుణులను సంప్రదించి మీ చర్మానికి సెట్ అవుతుందని అనుకుంటే వేయండి. లేకపోతే చర్మ సమస్యలు, అలెర్జీ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. కొందరికి చర్మంపై ఎర్రటి దద్దుర్లు, దురద వంటివి కూడా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి నిపుణులు సలహా తీసుకున్న తర్వాతే ఈ పటికను చర్మానికి అప్లై చేయడం మంచిది.