Stress: ఒత్తిడిని తగ్గించే ఆహారాలు ఇవే.. కచ్చితంగా మీ డైట్ లో యాడ్ చేసుకోండి. చిరాకు, కోపం నుంచి దూరంగా ఉండండి..

Stress: జీవనశైలి సరిగ్గా లేకపోవడం వల్ల ప్రజలలో ఒత్తిడి, ఆందోళన పెరుగుతుంది. అందుకే చాలా మంది ఒత్తిడితో బాధ పడుతున్నారు. కంటిన్యూ అయితే ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. ఒత్తిడి సమస్య ఎక్కువ కాలం కొనసాగితే, అది మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటున్నారు నిపుణులు. గంటల తరబడి ఒకే చోట కూర్చుని పని చేస్తున్నారు. ఆహారం, వ్యాయామం గురించి పట్టించుకోవడం లేదు. దీంతో ప్రజలలో ఒత్తిడి, ఆందోళన పెరుగుతోంది. అయితే కొన్ని ఆహారాలు మీ ఒత్తిడిని తగ్గిస్తాయి. మరి అవేంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
మీ డైలీ డైట్ లో కొన్ని ఆహారాలను చేర్చుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. అయితే ఆరోగ్యకరమైన, చురుకైన జీవనశైలితో పాటు ఈ ఆహార పదార్థాలను తీసుకోవాలి అంటున్నారు నిపుణులు. దీని వల్లనే ఈ ప్రయోజనాలు లభిస్తాయట. నిద్ర, మేల్కొనే సమయాల్లో చాలా జాగ్రత్త వహించాలి. ప్రతి రోజూ తగినంత నిద్ర ఉండాలి. అంతేకాదు ప్రతి రోజూ 30 నిమిషాలు యోగా, వ్యాయామం కూడా అవసరం.
1. ప్రోబయోటిక్ రిచ్ ఫుడ్
ప్రోబయోటిక్ ఆహారాలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ ఆహార పదార్థాన్ని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా, ఒత్తిడి సమస్యను కూడా తగ్గించవచ్చు. నిజానికి, ప్రోబయోటిక్స్ అధికంగా ఉండే ఆహారం కడుపులో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగుదలకు సహాయపడుతుంది. ఇది ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. పెరుగు, మజ్జిగ, జున్ను వంటి ఆహారాలలో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వేసవి కాలంలో, రోజువారీ ఆహారంలో ప్రోబయోటిక్ ఆహారాలు తప్పకుండా యాడ్ చేసుకోవాలి అంటున్నారు నిపుణులు.
2. విటమిన్ బి12 : శరీరంలో విటమిన్ బి12 లోపం వల్ల ప్రజలు చిరాకు, ఒత్తిడి, ఆందోళనకు గురవుతారు. దీని లోపం ప్రజల మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. మీరు కూడా ఒత్తిడి సమస్యతో బాధపడుతుంటే ఈ విటమిన్ బి12 అధికంగా ఉండే ఆహారాన్ని ఆహారంలో చేర్చుకోవాల్సిందే. విటమిన్ బి12 అధికంగా ఉండే ఆహార పదార్థాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. దీని కోసం మీరు ట్యూనా, సాల్మన్ వంటి చేపలను తినవచ్చు. దీనితో పాటు, పాలు, దాని ఉత్పత్తులు, గుడ్లు, కొన్ని కూరగాయలలో కూడా విటమిన్ బి12 ఉంటుంది. ఈ ఆహారాలు తీసుకోవడం వల్ల మీరు బాగా నిద్రపోతారు. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
3. విటమిన్ సి: విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు శరీర రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా, అందులో లభించే యాంటీఆక్సిడెంట్లు ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తాయి. ఆమ్లా, నిమ్మ, నారింజ, బొప్పాయి, టమోటా, ద్రాక్ష, స్ట్రాబెర్రీ, కివి వంటి విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు కూడా శరీర శక్తిని పెంచడంలో సహాయపడతాయి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని trendingtelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.
-
Depression : డిప్రెషన్ మెదడుకే కాదు కాలేయానికి కూడా హాని అని మీకు తెలుసా? ఎలాగంటే?
-
AI : AI కి కూడా ఒత్తిడి, ఆందోళన ఉంటాయా? షాకింగ్ విషయాలు వెల్లడి.
-
Stress : ఇది మరీ దారుణమైన ఒత్తిడి? మీకు ఇలా జరుగుతుందా? ఎలా నివారించాలి?
-
Kharbuja seeds: వచ్చేసిన సమ్మర్.. ఈ గింజలు తీసుకుంటే ట్రిపుల్ ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం