Virus: చైనాలో పుట్టిన కరోనాలాంటి మరో వైరస్.. వామ్మో ఇది ఇంత ప్రమాదమా?

Virus:
చైనాలో పుట్టిన కరోనా ప్రపంచాన్ని వణికించిన విషయం తెలిసిందే. కోవిడ్ వల్ల ఎందరో కుటుంబాలను కోల్పోయారు. అలాగే వ్యాపారాలు కూడా కొందరు నష్టపోయారు. మొదట్లో అందరూ లైట్ తీసుకున్నా ఆ తర్వాత ప్రాణాలు కోల్పోవడంతో జాగ్రత్తలు పాటించారు. ఈ ప్రమాదకరమైన వైరస్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఇబ్బంది పడ్డారు. అయితే కరోనా వంటి వైరస్ చైనాలో ఇంకోటి పుట్టినట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ వైరస్ జంతువుల నుంచి మానవులకు సంక్రమిస్తున్నట్లు గుర్తించారు. ఈ వైరస్‌ను గబ్బిలాల్లో పరిశోధకులు గుర్తించారు. ఈ వైరస్‌కి హెచ్‌కెయూ5- కోవ్-2 అని పేరు కూడా పెట్టారు. అయితే కొవిడ్ 19కి కారణమైన లక్షణాలు కూడా ఈ వైరస్‌లో ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. బ్యాట్ ఉమెన్‌గా పేరు పొందిన వైరాలజిస్టు షీ ఝెంగ్‌లీ బృందం పరిశోధనలు చేశారు. అయితే ఈ వైరస్ ప్రమాకరమని పరిశోధకులు చెబుతున్నారు. ఇది మెర్బెకో వైరస్‌తో పాటు ప్రాణాంతక మెర్స్-కోవ్ (మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) కి చెందినట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ వైరస్ హెచ్‌కేయూ 5 కరోనా వైరస్ సంతతికి చెందినది. దీన్ని మొదట గబ్బిల్లాల్లో గుర్తించారు. అయితే ఇది మానవులకు కూడా సోకుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే కొవిడ్‌తో పోలిస్తే దీని ప్రమాదం కాస్త తక్కువేనని పరిశోధకులు అంటున్నారు.
జంతువుల నుంచి మానవులకు ఈజీగా ఈ వైరస్ సోకుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ వైరస్ కూడా కొవిడ్ రకానికి చెందినదే. అయితే అంత ఈజీగా అయితే మానవులకు సోకదని అంటున్నారు. మానవుల్లో వ్యాప్తి చెందే అవకాశం కూడా తక్కువని పరిశోధకులు చెబుతున్నారు. అయితే ప్రమాదకర వైరస్‌ల బారిన పడకుండా ఉండాలంటే ఇమ్యునిటీ పవర్ బాగా ఉండాలి. రోగనిరోధక శక్తిని పెంచే పదార్థాలు ఎక్కువగా తినాలి. వాటర్ తాగాలి. అలాగే వ్యాయామం చేయడం, పోషకాలు ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవడం వంటివి చేయాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే కొవిడ్ సమయంలో ఎలాంటి శుభ్రత పాటించారో.. మిగతా సమయాల్లో కూడా అంతే శుభ్రత పాటించాలి. భోజనం చేసే ముందు చేతులు కడుక్కోవాలి. అలాగే ఎక్కడికైనా వెళ్లి వచ్చిన వెంటన కూడా చేతులు, కాళ్లను శుభ్రం చేసుకోవాలి. వీటితో పాటు వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవడం, పండ్లు, తాజా కూరగాయలు, ఫైబర్, ప్రొటీన్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే వాటిని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.