Weight Gain Tips: వీక్ గా ఉంటున్నారా? గుర్రంలా పరుగెత్తించేలా చేస్తాయి ఇవి.

Health Tips: ప్రస్తుతం చాలా మంది బలహీనంగా ఉంటారు. బలహీనత వల్ల ఎలాంటి పని కూడా చేయలేరు. బలం కోసం కొందరు కొన్ని టాబ్లెట్స్ కూడా వేసుకుంటారు. డాక్టర్ వద్దకు వెళ్లినప్పుడు సారు.. బలం లేదే రెండు బలం గోలీలు రాయవా అంటారుకూడా. మీరు కూడా ఇలాగే చేస్తారా? అయితే కొన్ని సార్లు ఈ టాబ్లెట్స్ వల్ల కూడా ఎలాంటి లాభం ఉండదు. కానీ కొన్ని ఆహారాలు మాత్రం మీకు బలాన్ని చేకూరుస్తాయి. పాలు, గుడ్లు, పండ్లు వంటివి రోజు మీ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఇక పాలు రోజూ తీసుకుంటే, ఈ బలహీనతను పోగొట్టవచ్చు. అయితే, పాలలో మరికొన్ని పదార్థాలు కలిపితే, పాలు మరింత శక్తివంతంగా మారుతాయి అంటున్నారు నిపుణులు. ఈ 3 వస్తువులను రాత్రిపూట పాలలో కలిపి తాగడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బలహీనత కూడా 24 గంటల్లో తగ్గిపోతుంది. ఇంతకీ అవేంటంటే?
పాలు-కుంకుమపువ్వు: కుంకుమ పువ్వు సహజ శక్తిని పెంచే పదార్థం. ఇది బలహీనతను తొలగించడంలో సహాయపడుతుంది. రాత్రిపూట కుంకుమపువ్వు కలిపిన పాలు తాగడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. బలహీనత తొలగిపోతుంది. మీరు పాలు మరిగేటప్పుడు, దానికి కుంకుమపువ్వును యాడ్ చేయండి. కుంకుమ పువ్వు బలహీనతను చాలా త్వరగా తొలగిస్తుంది. పాలు మరిగేటప్పుడు, అందులో ఒకటి లేదా రెండు కుంకుమపువ్వు ముక్కలు వేసి ఎక్కువసేపు మరిగించాలి. ఎక్కువసేపు మరిగించిన తర్వాత, పాలలో కుంకుమపువ్వు రంగు కలిసినప్పుడు, ఈ పాలను చల్లబరిచి తాగవచ్చు. దీనివల్ల బలహీనత తొలగిపోతుంది.
పాలు-బాదంబాదం పప్పులు విటమిన్లు, ఖనిజాల సహజ వనరు. ఇవి బలహీనతను తొలగించడంలో సహాయపడతాయి. రాత్రిపూట బాదం పప్పుతో కలిపిన పాలు తాగడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. బలహీనత తొలగిపోతుంది. మీరు బాదంపప్పును పాలలో ఎక్కువసేపు ఉడకబెట్టవచ్చు. పాలలో బాదం పప్పు కలిపి రోజూ తాగితే బలహీనత దూరమవుతుంది.
పాలు -ఏలకులు
యాలకులు జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడే సహజ జీర్ణక్రియ. రాత్రిపూట ఏలకులు కలిపిన పాలు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడి బలహీనత తొలగిపోతుంది. ఈ మూడు పదార్థాలను పాలలో కలిపి రాత్రిపూట తాగడం వల్ల బలహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. మీకు తీవ్రమైన ఆరోగ్య సమస్య ఉంటే, మీరు వైద్యుడిని సంప్రదించాలని గుర్తుంచుకోండి.
Disclaimer : అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం అందిస్తున్నాము. దీన్ని ట్రెండింగ్ తెలుగు నిర్ధారించదు. దయచేసి గమనించగలరు.
-
Health Tips: రోజంతా ఏం తినకపోయినా సరే ఆకలి అనిపించడం లేదా?
-
Laptop : లాప్ టాప్ ముందు కూర్చొని కూర్చొని భుజం నొప్పి వస్తుందా?
-
Fridge: వామ్మో ఫ్రిజ్ లోని ఆహారం తింటున్నారా?
-
Health Tips: ఈ ఫ్రూట్ జూస్ లను మాత్రం అసలు కలిపి తీసుకోవద్దు..
-
Salt : ఉప్పు తక్కువ అయితే ఫుడ్ తినరా? కాస్త ఎక్కువ అయినా డైరెక్ట్ అటేనట..
-
Exercises: ఆఫీస్ లో కూర్చొనే ఈ వ్యాయామాలు చేయండి.