Curd : వీరికి పెరుగు విషం లాంటిది.. ఎవరు తినవద్దు అంటే?

Curd :
అన్ని రకాల కూరలు ప్లేట్లో ఉంచి తిను అంటే కొంచెం కొంచెం తిని ఆ తర్వాత కచ్చితంగా పెరుగు అడుగుతారు కదా. అంతే మరి ఎన్ని ఉన్నా సరే పెరుగు మాత్రం చివర్లో కావాల్సిందే. కానీ ఇది అందరికీ ఆరోగ్యం కాదు. కొందరికి సమస్యలను పెంచుతుంది. సైనస్ ఉన్న వారు పెరుగుకు పూర్తిగా దూరం ఉండాలి అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఎవరికి పెరుగు హానీ చేస్తుంది. అనే వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
చాలా మంది సైనస్ తో బాధ పడుతుంటారు. ఇలాంటి వారికి ఇన్ఫెక్షన్ వల్ల ముక్కు మూసుకుపోవడం, తలనొప్పి, ఒత్తిడి, శ్లేష్మం పేరుకుపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్య ఉన్నవారు పెరుగుకు దూరంగా ఉండాలి. వాస్తవానికి పెరుగు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీన్ని తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఎముకలు బలపడతాయి. రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. అయితే పెరుగు కొన్ని వ్యాధులకు కూడా హానికరం. అలాంటి ఒక వ్యాధి సైనస్. ఈ రోజుల్లో సైనస్ సమస్య సర్వసాధారణమే. దానిని నిర్లక్ష్యం చేస్తే అది తీవ్రమైన రూపాన్ని సంతరించుకుంటుంది.
కఫం పెరుగుతుంది: పెరుగు చల్లని ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది శరీరంలో కఫాన్ని పెంచుతుంది. సైనస్ తో బాధ పడేవారికి శ్లేష్మం అధికంగా ఉత్పత్తి అవుతుంది. అలాంటిది పెరుగు తీసుకోవడం వల్ల పరిస్థితి మరింత ఎక్కువ అవుతుంది. ఇది ముక్కు దిబ్బడ, శ్వాస సమస్యలను పెంచుతుంది.
ఇన్ఫెక్షన్ పెరగవచ్చు: సైనస్ సమస్యలు సాధారణంగా బాక్టీరియల్ లేదా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కలుగుతాయి. కొన్ని సందర్భాల్లో, పెరుగులో ఉండే బ్యాక్టీరియా సైనస్ ఇన్ఫెక్షన్‌ను మరింత తీవ్రతరం చేస్తుంది. దీనివల్ల సమస్య చాలా కాలం పాటు ఉంటుంది.
వాపు, నొప్పి పెరుగుతుంది: సైనసైటిస్‌లో, ముఖం పై భాగంలో వాపు, నొప్పి ఉంటుంది. పెరుగులో ఉండే ప్రోటీన్లు, దాని చల్లని ప్రభావం వాపును పెంచుతాయి. ఇది నొప్పి, అసౌకర్యాన్ని పెంచుతుంది. అందుకే వీరు పెరుగుకు దూరంగా ఉండాలి.
సైనస్, అలెర్జీల కారణంగా సైనస్ ఇన్ఫెక్షన్ వచ్చే వ్యక్తులు, మారుతున్న వాతావరణంలో త్వరగా అనారోగ్యానికి గురయ్యే వ్యక్తులు, రోగనిరోధక శక్తి బలహీనంగా ఉండి సులభంగా ఇన్ఫెక్షన్ బారిన పడేవారు పెరుగుకు దూరంగా ఉండాలి అంటున్నారు నిపుణులు.
పాలు, జున్ను, పెరుగు వంటి పాల ఉత్పత్తులు కఫాన్ని పెంచుతాయి. దీనివల్ల సైనస్ మరింత ఎక్కువ అవుతుంది. ఐస్ క్రీం, శీతల పానీయాలు, చల్లటి నీరు వంటి చల్లని పదార్థాలు, వేయించిన పదార్థాలు జీర్ణక్రియను నెమ్మదిస్తాయి. ఇలాంటి వారు వేడి నీరు, హెర్బల్ టీ తాగాలి. ఇది ముక్కు, గొంతులో చిక్కుకున్న శ్లేష్మాన్ని క్లియర్ చేస్తుంది. పసుపు కలిపిన పాలు తాగాలి. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి సైనస్ వాపును తగ్గించడంలో సహాయపడతాయి. తులసి, అల్లం, తేనె వంటి పదార్థాలు రోగనిరోధక శక్తి పెంచుతాయి. సైనస్ నుంచి ఉపశమనం కలిగేలా చేస్తాయి.
Disclaimer : అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం అందిస్తున్నాము. దీన్ని ట్రెండింగ్ తెలుగు నిర్ధారించదు. దయచేసి గమనించగలరు.