Operation Sindoor: భారత్ మెరుపు దాడి నిర్వహించిన మిస్సైల్స్ ఏంటో మీకు తెలుసా?
Operation Sindoor: భారత్ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ ఈ వైమానిక దాడులను చేపట్టిన కొన్ని నిమిషాల్లోనే పూర్తి చేశాయి. ఈ దాడుల్లో మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలను కూల్చివేసింది. అయితే భారత్ ప్రతీకారంగా అర్థరాత్రి సమయంలో దాడి చేసింది. అంత చీకటిలో ఇండియన్ ఆర్మీ సరిగ్గా ఎలా దాడి చేసింది?

Operation Sindoor: జమ్మూకశ్మీర్ పహల్గంలో జరిగిన ఉగ్రదాడుల్లో 28 మంది టూరిస్ట్‌లు మృతి చెందారు. ఈ ఉగ్రదాడుల్లో కేవలం హిందువులనే టార్గెట్ చేసి హతం చేశారు. ఉగ్రవాదులు పక్కా ప్లానింగ్‌తో మతం ఏదని అడిగి మరి చంపారు. దీనికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్‌పై వైమానిక దాడులు చేసింది. బుధవారం అర్థరాత్రి సమయంలో పాకిస్థాన్, పాక అక్రమిత కాశ్మీర్‌లోని మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో మొత్తం 90 మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలుస్తోంది. భారత్ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ ఈ వైమానిక దాడులను చేపట్టిన కొన్ని నిమిషాల్లోనే పూర్తి చేశాయి. ఈ దాడుల్లో మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలను కూల్చివేసింది. అయితే భారత్ ప్రతీకారంగా అర్థరాత్రి సమయంలో దాడి చేసింది. అంత చీకటిలో ఇండియన్ ఆర్మీ సరిగ్గా ఎలా దాడి చేసింది? పాక్‌లోకి ప్రవేశించి ఎలా దాడులు నిర్వహించిందని చాలా మందికి సందేహాలు ఉన్నాయి. అయితే భారత్ పాక్‌లోకి వెళ్లకుండా రాఫిల్ యుద్ధ విమానాలతో దాడికి పాల్పడింది. అయితే భారత్ ఉపయోగించిన ఆ మిస్సైల్స్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
SCALP క్రూయిజ్ మిస్సైల్
ఇండియన్ ఆర్మీ ఉగ్రవాదుల స్థావరాలపై SCALP క్రూయిజ్ మిస్సైల్‌ను ఉపయోగించారు. ఇది ఎక్కువ దూరం వెళ్లే క్షిపణి. ఎక్కువ సామర్థ్యం ఉన్న క్షిపణి కూడా. అయితే దీన్ని రాడార్లు, ఇన్ఫారెడ్, సోనార్ వంటి పరికరాలు కూడా గుర్తించలేవు. అయితే ఇది వస్తుందని, దాడులు నిర్వహిస్తుందనే విషయం కూడా ఎవరికీ తెలియదు. లేటెస్ట్ టెక్నాలజీ కావడంతో పాక్ దీన్ని గుర్తించలేకపోయింది. ఈ క్షిపణి గాలిలోనే ప్రయోగించారు. ఇది దాదాపుగా 300 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. దీన్ని ఉపయోగించే ఇండియన్ ఆర్మీ జైషే-మొహమ్మద్, లష్కరే-తోయిబా వంటి ఉగ్రవాద సంస్థల స్థావరాలను ధ్వంసం చేసింది.
HAMMER ప్రెసిషన్ బాంబ్
ఇది కేవలం 70 కిలో మీటర్ల వరకు వెళ్తుంది. అయితే ఇది గాలి, భూమి మీద కూడా వెళ్లగలదు. ఇది డైరెక్ట్‌గా ఉగ్రవాదులపై దాడి చేసింది. ఈ బాంబ్ ద్వారా పాక్‌లోకి వెళ్లకుండా కేవలం ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసి హతం చేశారు. అత్యాధునికమైన రాఫెల్ యుద్ధ విమానాలు ఉపయోగించి ఇండియన్ ఆర్మీ ప్రతీకారం తీర్చుకుంది.
లాయిటరింగ్ మ్యూనిషన్స్
లాయిటరింగ్ మ్యూనిషన్స్‌ను కామికేజ్ డ్రోన్లు అని కూడా అంటారు. ఇవి లక్ష్యాన్ని టార్గెట్ చేసి దాడి చేస్తాయి. వీటిని ఉపయోగించి బహవల్పూర్, మురిద్కే, ముజఫరాబాద్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడి చేసింది. అయితే ఈ ఉగ్రవాద స్థావరాలపై దాడిలో రాఫెల్ యుద్ధ విమానాలు కీలక పాత్ర పోషించాయి. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో అత్యాధునిక టెక్నాలజీ ఉన్నాయి. వీటిని ఉపయోగించి.. పాక్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి చేసింది. బియాండ్-విజువల్-రేంజ్, స్టాండ్ఆఫ్ ఆయుధాలను ఉపయోగించి.. జైషే-మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన స్థావాలను నేలమట్టం చేసింది.
-
Zodiac signs: బుధుడు మార్పులతో దశ తిరగబోతున్న రాశులివే
-
Operation Sindoor: ఇట్స్ అఫిషియల్.. ఆపరేషన్ సిందూర్ మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే?
-
Dry Coconut: ఎండు కొబ్బరితో ఆరోగ్యం.. చిన్న ముక్క తింటే చాలు
-
Pakistan: అంతర్జాతీయ మీడియా పరువు తీసుకున్న పాక్.. వీడియో వైరల్
-
Operation Sindoor: ఇప్పటి వరకు పాక్‌పై భారత్ చేపట్టిన మిలిటరీ ఆపరేషన్స్ ఇవే
-
Operation Sindoor: పాకిస్తాన్, పీఓకేలో కీలక ఉగ్రవాద స్థావరాలు ఎన్ని ఉన్నాయో తెలుసా?