Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Spiritual News »
  • Bindi In Hindu People Is Good Benefits

Bindi: నుదుటిన బొట్టు పెట్టుకుంటే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

Bindi: నుదుటిన బొట్టు పెట్టుకుంటే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?
  • Edited By: kusuma,
  • Updated on June 17, 2025 / 03:41 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Bindi: బొట్టు నుదుటిపై పెట్టుకోవడం భారతీయ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం. ఇది కేవలం అలంకరణ వస్తువు మాత్రమే కాదు.. దీని వెనుక ఎన్నో ఆధ్యాత్మిక, సాంప్రదాయ, ఆరోగ్యపరమైన కారణాలు ఉన్నాయి. చాలా మందికి ఇది కేవలం ఒక ఆచారం అని మాత్రమే తెలుసు. కానీ నుదుటిన బొట్టు ఎందుకు పెట్టుకోవాలి అనే విషయం మాత్రం సరిగ్గా తెలియదు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు ఈ రోజు తెలుసుకుందాం.

హిందూ మతంలో నుదుటి మధ్య భాగాన్ని ఆజ్ఞా చక్రం లేదా మూడో కన్ను అని పిలుస్తారు. ఇది మన ఆలోచనలు, అంతర్దృష్టి, జ్ఞానం, ఏకాగ్రతకు కేంద్రం. బొట్టును ఈ ప్రదేశంలో పెట్టుకోవడం వల్ల ఆజ్ఞా చక్రం ఉత్తేజితం అయి, ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుందని నమ్ముతారు. బొట్టు పెట్టుకోవడం ద్వారా ధ్యానం చేసేటప్పుడు ఏకాగ్రత కుదురుతుందని, మనసు ప్రశాంతంగా ఉంటుందని చాలా మంది భావిస్తారు. వివాహిత స్త్రీలు నుదుటిన ఎరుపు రంగు బొట్టు పెట్టుకోవడం ఒక ముఖ్యమైన ఆచారం. ఈ ఎరుపు రంగు బొట్టు శక్తికి, శుభానికి, శ్రేయస్సుకి చిహ్నం. ఇది స్త్రీకి వివాహ బంధంలోకి ప్రవేశించినట్లు సూచిస్తుంది. భర్త దీర్ఘాయువు కోసం, కుటుంబ శ్రేయస్సు కోసం మహిళలు తప్పకుండా పెట్టుకోవాలి. బొట్టును శుభకార్యాలకు, పండుగలకు, గుడికి వెళ్లినప్పుడు తప్పనిసరిగా పెట్టుకుంటారు. మంచి జరగాలని, అదృష్టం కలగాలని కోరుకునే వారు తప్పకుండా బొట్టు పెట్టుకుంటారు. ఇంటికి అతిథులు వచ్చినప్పుడు వారికి బొట్టు పెట్టడం అనేది చేస్తుంటారు. అయితే ఇది గౌరవంగా, ఆశీస్సులను అందించే విధంగా వారికి పెడతారు. కొందరు బొట్టును చెడు దృష్టి నుంచి లేదా నెగెటివ్ ఎనర్జీ నుంచి రక్షణగా భావిస్తారు. ఇది ఒక రకమైన కవచంలా పనిచేస్తుందని నమ్ముతారు. అలాగే బొట్టు పెట్టుకోవడం వల్ల ఆ ప్రదేశంలో ఒత్తిడి ఏర్పడి, శరీరంలో శక్తి ప్రసరణ సరిగా జరుగుతుందని నమ్ముతారు.

నుదుటి మధ్య భాగంలో బొట్టు పెట్టుకోవడం వల్ల మెదడులో కొన్ని కీలక నాడులు ఉత్తేజితమై, ఏకాగ్రత పెరుగుతుందని, ఒత్తిడి తగ్గుతుందని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఇది మనసుకు ప్రశాంతతను అందిస్తుంది. కొంతమందికి ఈ ప్రదేశంలో బొట్టు పెట్టుకోవడం వల్ల నిద్ర సమస్యలు తగ్గుతాయని, మంచి నిద్ర పడుతుందని నమ్మకం ఉంది. ఈ ప్రదేశంలో చందనం లేదా కుంకుమ పెట్టుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. అలాగే తలనొప్పి వంటి సమస్యలు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. అయితే ఎరుపు రంగు బొట్టు శక్తి, ప్రేమ, ధైర్యం, వివాహిత స్థితిని తెలియజేస్తుంది. పసుపు రంగు బొట్టు జ్ఞానం, శాంతి, శ్రేయస్సు కోసం ఉపయోగిస్తారు. నలుపు రంగు బొట్టు చెడు దృష్టి నుంచి రక్షణ ఇస్తుంది. ఎక్కువగా పిల్లలకు ఈ బొట్టు పెడతారు. తెలుపు బొట్టు ప్రశాంతత కోసం పెడతారు.

Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.

ఇది కూడా చూడండి: WhatsApp’s new changes: వాట్సప్ ఇకపై అలా కనిపిస్తుంది.. కొత్తగా వచ్చే మార్పులు ఏంటంటే..

Tag

  • Benefits
  • Bindi
  • Head
  • hindu
Related News
  • Stress Relief: ఒత్తిడి నుంచి విముక్తి పొందాలంటే.. ఈ టైప్ ధ్యానం తప్పనిసరి

  • Home loan refinancing: గృహ రుణ రీఫైనాన్సింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలేంటి?

  • Rain water: వర్షపు నీటితో స్నానం చేస్తే.. ఇన్ని ప్రయోజనాలా!

  • International Yoga day: డైలీ 20 నిమిషాలు యోగా చేస్తే.. మీ లైఫ్‌కి మీరే రాజు ఇక!

  • Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్‌లో ఇలా ఇన్వెస్ట్ చేస్తే.. కొన్నేళ్లలో కోటీశ్వరులు మీరే

  • Jamun Vinegar: ఈ వెనిగర్‌తో బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు.. ఒక్కసారి తింటే చాలు

Latest Photo Gallery
  • Priyanka Jawalkar: ప్రియాంక జవాల్కర్ లెటెస్ట్ ఫొటోలు వైరల్

  • Divi Vadthya: గ్లామర్ తో కవ్విస్తున్న దివి

  • Shreya Chaudhry: శ్రేయా చౌదరి గ్లామరస్ లుక్ వైరల్

  • Disha Patani: సోగసుల వల వేస్తూ రెచ్చగొడుతున్న దిశా పటాని

  • Ruhani Sharma: చీరకట్టులో వినయంగా రుహాణి

  • Vaishnavi Chaitanya: చీరలో బేబీ హీరోయిన్ ఫొటోలు అదుర్స్

  • Sreeleela: శ్రీలీల లెటెస్ట్ పొటోలు వైరల్

  • Ananya Nagalla: అనన్య నీ అందాలు కేక

  • Anasuya Bharadwaj: అనసూయ అందాలు తట్టుకోలేం బాబోయ్

  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us