Negative Energy: ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఇన్ని సమస్యలా?

Negative Energy: మనం ఏం కోరుకుంటే అది వస్తుందని మన పెద్దలు చెబుతుంటారు. ఎక్కువగా పాజిటివ్ కోరుకుంటే పాజిటివ్, నెగిటివ్ కోరుకుంటే నెగిటివ్ వస్తుందని అంటుంటారు. అయితే నెగిటివ్ ఎనర్జీ మంచిది కాదు. మనస్సులో, ఇంట్లో అసలు నెగిటివ్ ఎనర్జీ ఉండకూడదు. పొరపాటున ఉన్నా కూడా చాలా అనర్థాలు జరుగుతాయని పండితులు అంటున్నారు. సాధారణంగా ఒక్కోక్క వ్యక్తి ఆలోచనలు వేర్వేరుగా ఉంటాయి. ఒక ఇంట్లో పది మంది పాజిటివ్‌గా ఆలోచిస్తే.. మరికొందరు నెగిటివ్‌గా ఆలోచిస్తారు. ఇలా నెగిటివ్ ఆలోచనలు వ్యక్తిగత జీవితంపై ప్రభావం చేస్తాయని నిపుణులు అంటున్నారు. ఎవరైతే ఎక్కువగా ప్రతికూల ఆలోచనలు కలిగి ఉంటారో వారి ఇంట్లో ప్రశాంతత ఉండదు. గందరగోళంగా ఉంటుంది. చిన్న విషయాలకు కూడా గొడవలు జరుగుతుంటాయి. ఎక్కువ మనస్పర్థలు వచ్చి గొడవలు పడతారని నిపుణులు అంటున్నారు. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం, ఆధ్యాత్మిక చింతన ఉంటేనే పాజిటివిటీ ఉంటుందని మన పెద్దలు చెప్పేవారు. పూర్వం ఇలా ఎన్నో సంప్రదాయాలు పాటించేవారు. అయితే ఇవి ఇంటిలో సానుకూల శక్తిని పెంచి ప్రతికూల శక్తిని దూరం చేస్తాయి.
ఇంట్లో పాజిటివిటీ ఉండాలంటే తెల్లవారు జామునే నిద్ర లేచి స్నానం చేయాలి. అలాగే రోజును ఉత్సాహంగా దేవుడి పూజతో ప్రారంభించండి. ఇంట్లో పూజ చేయడం వల్ల పవిత్రమైన వాతావరణం ఏర్పడుతుంది. మనసు భక్తితో నిండి, పాజిటివ్ ఆలోచనలు కలుగుతాయి. దేవుడిని పువ్వులతో అలంకరించండి. వాటి సువాసనలకు ఇంట్లో పాజిటివ్ వాతావరణం నెలకొంటుంది. దీపం, అగరబత్తులు, హారతి కర్పూరం వెలిగించడం వంటివి చేయాలి. వీటి సువాసనలకు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. వీటితో పాటు ఇంట్లో మొక్కలు పెంచడం, పరిమళాలను ఉపయోగించడం వల్ల వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. దీంతో ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఇంట్లో తేలికపాటి సంగీతాన్ని ప్లే చేయడం వల్ల వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో ఉన్న ఒక్కరు సంతోషంగా ఉంటేనే కుటుంబమంతా కూడా హ్యాపీగా పాజిటివ్‌గా ఉంటారని నిపుణులు అంటున్నారు.
మీ ఇంట్లో ప్రతికూల శక్తి పోవాలంటే ఒక చిన్న వాటర్ ఫౌంటెయిన్‌ను ఏర్పాటు చేసుకోండి. అది నిరంతరం పనిచేసేలా చూసుకోవాలి. వాస్తు నిపుణులు చెప్పిన దాని ప్రకారం, ఆ వాటర్ ఫౌంటెయిన్ నుంచి వచ్చే గలగల నీటి శబ్దం మీ ఇంట్లో ఉండే నెగెటివ్ ఎనర్జీని బయటకు పంపేస్తుందని అంటున్నారు. ఈ శబ్దం వింటున్న వారి ఆలోచనలు కూడా పాజిటివ్‌గా మారతాయని, తద్వారా వారు తీసుకునే నిర్ణయాలు కూడా మంచి ఫలితాలనిస్తాయని నిపుణులు చెబుతున్నారు. వాటర్ ఫౌంటెయిన్ ఏర్పాటు చేయడం వల్ల ఇల్లు ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా మారుతుంది. నీటి ప్రవాహం నిరంతరం సానుకూల శక్తిని ఇంట్లోకి తీసుకువస్తుందని వాస్తు శాస్త్రం చెబుతుంది.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
ఇది కూడా చూడండి: Early Morning Anjeer: ఉదయాన్నే నానబెట్టిన అంజీర్ తీసుకుంటే.. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా!
-
Holy Bath: కొత్త జంటలు పుణ్య స్నానం ఆచరిస్తే.. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?
-
Astrology: శుక్రుడి మార్పు.. ఈ రాశుల వారికి గోల్డెన్ డేస్
-
Vastu Tips: ఇంటి మెట్ల కింద టాయిలెట్ అస్సలు కట్టకూడదు.. ఎందుకో తెలుసా ?
-
Zodiac signs: నవ పంచమి ప్రభావం.. ఈ రాశుల వారు నక్క తోక తొక్కినట్లే
-
Pournami: వెరీ పవర్‌ఫుల్ పౌర్ణమి.. ఈ నియమాలు పాటిస్తే విజయం తథ్యం
-
Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారిని చేసుకుంటే.. అదృష్టమంతా ఇక మీదే