Sri rama navami: శ్రీరామ నవమి రోజు ఈ పనులు చేస్తే అదృష్టమే

Sri rama navami: చైత్రమాసంలో తొమ్మిదవ రోజు నవమి రోజున శ్రీరాముడు పుట్టాడని ఆ రోజున ప్రతీ ఏడాది శ్రీరామ నవమి ఉత్సవాలను జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 6వ తేదీన శ్రీరామ నవమిని జరుపుకుంటారు. చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీరాముడి జననం, వివాహ మహోత్సవం, పట్టాభిషేకము జరిగాయని చెబుతుంటారు. శ్రీరామ నవమి పూజను ఎంతో భక్తితో పూజిస్తే తప్పకుండా ఇంట్లో ఉన్న సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి. ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. అయితే శ్రీరామ నవమి రోజు తప్పకుండా కొన్ని నియమాలు పాటించి పూజలు చేస్తేనే మంచిది. శ్రీరామ నవమి రోజు ఆలస్యంగా కాకుండా బ్రహ్మముహుర్తంలోనే నిద్ర లేచి పూజలు నిర్వహిస్తారు. కొత్త దుస్తులు ధరించి శ్రీరాముడికి వస్త్రాలు సమర్పించి కళ్యాణం చేస్తారు. ఇంటిని పువ్వులు, మామిడి ఆకులతో ఎంతో బాగా అలంకరిస్తారు. అయితే ఎంత భక్తితో మీరు శ్రీరాముడిని పూజిస్తే అంత మంచి జరుగుతుంది. అయితే శ్రీరామ నవమి రోజు కేవలం పూజ మాత్రమే కాకుండా కొన్ని పనులు చేస్తే అదృష్టం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. మరి అవేంటో తెలియాలంటే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే.
శ్రీరామ నవమి రోజు ఎలాంటి సమస్యలు లేకుండా ఆర్థికంగా స్ట్రాంగ్‌గా ఉండాలంటే కొన్ని వస్తువులు దానం చేయాలి. వస్త్ర దానం, అన్నదానం వంటివి చేయాలి. వీటితో పాటు డబ్బులు కూడా దానం చేయాలని పండితులు చెబుతున్నారు. వీటిని దానం చేయడం వల్ల ఇంట్లో సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి. పేదవారికి అన్నం, వస్త్రాలు దానం చేస్తే మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఇంట్లో ఉన్న సమస్యలు అన్ని కూడా క్లియర్ అవుతాయని పండితులు అంటున్నారు. అయితే శ్రీరామ నవమి రోజున దేవుడికి పప్పు, పానకం వంటివి నైవేద్యంగా పెట్టాలి. వీటిని అందరికీ కూడా పంచి పెడితే అంతా మంచే జరుగుతుందని పండితులు అంటున్నారు. ఇంట్లో ఉన్న సమస్యలు పోయి సంతోషం వస్తుంది. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండదు. అనారోగ్య సమస్యలన్నీ కూడా పరార్ అవుతాయి. ఆర్థికంగా ఉన్న ఇబ్బందుల తొలగి ఇంట్లో సంపద వృద్ధి చెందుతుంది. సమస్యలన్నీ కూడా తీరి మీకు అదృష్టం వస్తుందని పండితులు చెబుతున్నారు.
ఇవే కాకుండా శ్రీరామ నవమి రోజు రాముడికి పట్టు వస్త్రాలు ఇవ్వాలి. వాటి మీద శ్రీరాముని విగ్రహాలు పెట్టి పూజలు చేయాలి. దేవుడికి ధూప, దీప, నైవేద్యాలు సమర్పించాలి. అలాగే పూల దండలు సమర్పించి.. కల్యాణం చేయాలి. శ్రీరాముడికి నైవేద్యంగా వడపప్పు, పానకం వంటివి సమర్పించాలి. వీటితో పాటు పండ్లు, విసనకర్ర, తాంబూలం, నూతన వస్త్రాలు ఇవ్వాలి. ఇవన్నీ చేసిన తర్వాత రామాయణం లేదా హనుమాన్ చాలీషా, రామచరిత్ర మానస్ వంటివి చదవాలి. వీటిని భక్తితో చదవడం వల్ల మీకు మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Sri Rama Navami 2025: నవమి నైవేద్యాలతో ఆరోగ్యం మీ సొంతం
-
Sri Rama Navami: నవమి రోజు వీటిని నైవేద్యంగా పెడితే.. అదృష్టమే
-
Sri rama navami: శ్రీరామ నవమి రోజు ఎలా పూజిస్తే.. సమస్యలు తొలగిపోతాయంటే?
-
Ugadi: కొత్త ఏడాదికి వేటిని దానం చేస్తే మంచిదంటే?
-
IPl 2025:క్రికెట్ ఫ్యాన్స్ షాకింగ్ న్యూస్.. ఆ మ్యాచ్ రీ షెడ్యూల్?
-
Bald Head: చిన్న వయస్సులోనే వేధిస్తున్న బట్టతల.. దీనికి గల కారణం ఏంటి?