Temple Prasadam: వామ్మో.. ప్రసాదం ఎడమ చేతితో తీసుకోవడం ఇంత పాపమా!

Temple Prasadam: హిందూ సంప్రదాయంలో ఎన్నో నియమాలు ఉన్నాయి. హిందూ ధర్మాన్ని పాటించే ప్రతీ ఒక్కరూ కూడా వీటిని తప్పకుండా పాటిస్తారు. కేవలం ఇప్పుడున్న జనరేషన్‌లోనే కాకుండా పూర్వ కాలం నుంచి వీటిని పాటిస్తున్నారు. కొందరు వీటిని నమ్మి పాటిస్తారు. మరికొందరు వీటిని అసలు పట్టించుకోరు. అయితే సాధారణంగా హిందువులు ఆలయాలకు వెళ్తుంటారు. ఇలా వెళ్లినప్పుడు పూజ అంతా అయిపోయిన తర్వాత ప్రసాదం ఇస్తారు. పొరపాటున ప్రసాదాన్ని ఎడమ చేతితో తీసుకుంటే.. కేవలం కుడి చేతితో మాత్రమే తీసుకోవాలని పెద్దలు చెబుతుంటారు. అయితే ప్రసాదం కుడి చేతితోనే ఎందుకు తీసుకోవాలి? ఎడమ చేతితో తీసుకుంటే ఏం జరుగుతుంది? దీని వెనుక ఉన్న కారణాలు ఏంటి? పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో చూద్దాం.
ప్రసాదాన్ని ఎప్పుడూ కూడా కేవలం కుడి చేతితో మాత్రమే తీసుకోవాలని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే కుడి చెయ్యి అనేది మంగళకరమైన శక్తి. ఇది సూర్యుడికి చిహ్నం కూడా. అయితే ఎడమ చెయ్యి అనేది చంద్రునితో సంబంధం ఉంటుంది. అందుకే ప్రసాదం తీసుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా తప్పకుండా కుడిచేతితోనే తీసుకోవాలని పండితులు అంటున్నారు. ఏదైనా మంచి పని, శుభకార్యం చేపట్టేటప్పుడు తప్పకుండా కుడి చేతిని వినియోగిస్తారు. ఉదాహరణకు దేవునికి పూజ చేయాలి అనుకున్నా, భగవంతుడికి హారతి ఇచ్చినా, నైవేద్యాన్ని పెట్టినా, లేకపోతే ఇతరులకు దానం చేసినా ఇలా ప్రతీ విషయానికి కూడా కుడి చేతినే ఉపయోగిస్తారు. ఇలా కుడి చేతిని ఉపయోగించడం వల్ల అంతా మంచి జరుగుతుందని, ప్రతీ పని కూడా తలచినట్లు అవుతుందని నమ్ముతారు. ఇలా కుడిచేతితో మంచి జరుగుతుందని భావించి ప్రతీ పనికి కూడా కుడి చేతిని ఉపయోగిస్తారు.
దేవుని ప్రసాదం కూడా కేవలం కుడిచేతితోనే తీసుకోవాలని పండితులు అంటుంటారు. అదే ఎడమ చేతితో ప్రసాదం తీసుకోవడం వల్ల పనుల్లో ఆటంకం ఏర్పడుతుందని అంటున్నారు. దీనివల్ల సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి పొరపాటున కూడా ఎడమచేతితో ప్రసాదం అసలు తీసుకోవద్దు. అయితే ప్రసాదాన్ని తీసుకునేటప్పుడు తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి. ప్రసాదం తీసుకునే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత ఎడమ చేతిపై కుడి చేయి పెట్టి మాత్రమే ప్రసాదాన్ని స్వీకరించాలని పండితులు చెబుతున్నారు. అయితే ప్రసాదం తీసుకున్న తర్వాత కళ్లకు అద్దుకోవాలి. దీనివల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుందని పండితులు అంటున్నారు. కాబట్టి ఎక్కడికైనా ఆలయానికి వెళ్లినా లేకపోతే ఎవరైనా ప్రసాదం ఇస్తే మాత్రం తప్పకుండా మీరు కుడి చేతితోనే తీసుకోండి. ఎడమ చేతితో తీసుకోవడం వల్ల సమస్యలు రావడంతో పాటు అన్ని పనుల్లో కూడా ఆటంకం ఏర్పడుతుందని పండితులు చెబుతున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.