Maha nandi: ప్రముఖ శివ క్షేత్రం మహానందిలో విషాదం.. ఇద్దరు మృతి

Mahanandi:
ప్రముఖ శివ క్షేత్రమైన మహా నంది గురించి అందరికీ తెలిసిందే. ఇక్కడ ఇద్దరు వసతి గృహ పనులు చేస్తుండగా ఇద్దరు కూలీలు మృతి చెందారు. మహా నందిలో 25 ఏళ్ల క్రితం వసతి గదులు నిర్మించారు. వీటి బాగా పాత బడిపోవడంతో వీటి స్థానంలో కొత్త వాటిని నిర్మించారు. ఈ క్రమంలో పాత వాటిని కూల్చేసే క్రమంలో ఇద్దరు కూలీలు మృతి చెందారు. కందికాయపల్లెకు చెందిన రాముడు(65), వెంకటేశ్వర్లు(50) మృతి చెందారు. ఆలయంలో అభివృద్ధిలో భాగంగా రూ.10 కోట్లతో నూతన వసతి గృహం నిర్మించారు. దీనికోసం పాత వసతి గృహాలను కూల్చి వేయడానికి రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ అనుమతితో రూ.4.20 లక్షలకు టెండర్ ప్రక్రియ వేశారు.
Vantalakka Daughter: వంటలక్క కూతురిని చూశారా.. ఎంత అందంగా ఉందో.. లేటెస్ట్ ఫోటోలు వైరల్..
ఇందులో భాగంగా కూల్చివేత పనులను కర్నూలుకు చెందిన కాంట్రాక్టర్ నారాయణరెడ్డి తీసకున్నారు. ఈ క్రమంలో గత పది రోజుల నుంచి కాంట్రాక్టర్ కూల్చివేతలు ప్రారంభించారు. ఈ క్రమంలో నంద్యాల నుంచి కూలీలు వస్తున్నారు. అయితే మంగళవారం సాయంత్రం ఎక్స్‌కవేటర్‌తో పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పై కొప్పు నుంచి పెద్ద శబ్దంతో శిధిలాలు కింద పడ్డాయి. దీంతో ఇద్దరు కూలీలు రాముడు, వెంకటేశ్వర్లు మృతి చెందారు. ఒక్కసారిగా ఎక్స్‌కవేటర్ కూలిపోవడంతో రాముడు అక్కడిక్కడే మృతి చెందాడు. ఇక వెంకటేశ్వర్లు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. చికిత్స తీసుకుంటూ వెంకటేశ్వర్లు మృతి చెందాడు. వీరు చనిపోవడంతో కుటుంభాలు రోధిస్తున్నారు. రాముడికి ఇద్దరు ఆడపిల్లలు, వెంకటేశ్వరుడికి ముగ్గురు కుమారులు ఉన్నారు. వెంకటేశ్వరుని భార్య ఇటీవల మృతి చెందింది. అయితే ఈ ఘటనపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి కూడా స్పందించారు. మృతులను తప్పకుండా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మృతులు కుటుంబాలను కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని తెలిపారు.
-
Puja: అబ్బాయిలు పూజలు చేస్తే ఏమవుతుందో తెలిస్తే.. డైలీ ఇంట్లో మీరే ఇక పంతులు
-
Luck by Helping Items: వీటిని దానం చేశారనుకోండి.. ఇక మీ దశ తిరిగినట్లే!
-
Salt Tips: ఉప్పుతో ఇలా చేశారో.. కుభేర యోగం పట్టడం ఖాయం
-
Temple Prasadam: వామ్మో.. ప్రసాదం ఎడమ చేతితో తీసుకోవడం ఇంత పాపమా!
-
Sri rama navami: శ్రీరామ నవమి రోజు ఎలా పూజిస్తే.. సమస్యలు తొలగిపోతాయంటే?
-
Lord shiva: సోమవారం ఈ మంత్రం జపిస్తే కష్టాలన్నీ మాయం