IPL క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. Airtel, VI సూపర్ ప్లాన్స్..!

IPL: క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2025 సీజన్ నేటి నుంచి ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరగనుంది. దీంతో క్రికెట్ ప్రియులు ఇప్పటికే ఈ మ్యాచ్‌లు చూసేందుకు ప్లాన్లు చేసుకుంటున్నారు. అయితే గతంలో ఐపీఎల్ ను ఫ్రీగా చూసేవారు. కానీ ఇప్పుడు అది డబ్బులతో కూడుకున్నది. ఓటిటీ సబ్స్క్రిప్షన్ పొందిన వారు మాత్రమే ఈ సీజన్ ఐపీఎల్ మ్యాచ్‌లు చూడగలరు. ఇందులో భాగంగానే ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా కంపెనీలు తమ యూజర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ అందించాయి. తక్కువ ధరలో ఓటీటీ ప్లాన్లను ప్రకటించాయి. వీటి ద్వారా ఐపీఎల్ మ్యాచ్‌ను వీక్షించ వచ్చని తెలిపాయి. అతి తక్కువ ధరకే జియో హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ పొందొచ్చు. ఎయిర్టెల్ రెండు క్రికెట్ ప్యాక్‌లను ప్రకటించింది. అందులో ఒకటి 100 రూపాయలు, మరొకటి 195 రూపాయల యాడాని డేటా ప్లాన్ తో పాటు జియో హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ పొందవచ్చు.
రూ.100 రీఛార్జ్ ప్లాన్
ఈ ధరతో రీఛార్జ్ చేసుకుంటే 30 రోజులు వాలిడిటీ వస్తుంది. 5జిబి డేటా పొందొచ్చు. అలాగే మొబైల్/టీవీ జియో హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ లభిస్తుంది. వీటి ద్వారా ఐపీఎల్ మ్యాచ్‌లు, మూవీస్, షోలు చూసుకోవచ్చు.
రూ.195 రీఛార్జ్ ప్లాన్
వినియోగదారులు ఈ ప్లాన్ లో భాగంగా 90 రోజుల వాలిడిటీని పొందుతారు. ఈ ప్లాన్ లో 15 జిబి డేటా లభిస్తుంది. ఈ డేటా వాలిడిటీ 90 రోజుల వరకు ఉంటుంది. వీటి ద్వారా క్రికెట్, మూవీస్, వెబ్ సిరీస్ వంటివి చూసుకోవచ్చు.
వోడాఫోన్ ఐడియా రీఛార్జ్ ప్లాన్లు
రూ. 101 ప్లాన్
వోడాఫోన్ ఐడియా వినియోగదారులు 101 రూపాయిలతో రీఛార్జ్ చేసుకుంటే 5gb డేటా లభిస్తుంది. ఈ డేటా వాలిడిటీ కేవలం 30 రోజులు మాత్రమే ఉంటుంది. అదే సమయంలో జియో హాట్ స్టార్ మొబైల్ సబ్ స్క్రిప్షన్ 90 రోజుల వరకు పొందవచ్చు.
రూ. 239 ప్రీపెయిడ్ ప్లాన్
వినియోగదారులు రూ.239 ప్రీపెయిడ్ ప్లాన్ లో 28 రోజులు వ్యాలిడిటీని కలిగి ఉంది. ఇది అన్లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్ తో వస్తుంది. 300 sms లను ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. డైలీ 2gb డేటా లభిస్తుంది. దీంతోపాటు జియో హాట్‌స్టార్ మొబైల్ సబ్ స్క్రిప్షన్ పొందవచ్చు. ఇది కూడా కేవలం 28 రోజుల వరకే ఉంటుంది.
రూ. 399 ప్లాన్
ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే వినియోగదారులు 28 రోజులు వ్యాలిడిటీ కలిగి ఉంటారు. అన్లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్ పొందుతారు. డైలీ 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. ప్రతిరోజు టు జిబి డేటా పొందుతారు. అంతేకాకుండా ఈ ప్లాన్ లో భాగంగా రోజులో 12 గంటలు పాటు అన్ లిమిటెడ్ డేటా ఉపయోగించుకోవచ్చు. ఇవి మాత్రమే కాకుండా వీకెండ్ డేటా రోల్ ఓవర్ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వీటితోపాటు జియో హాట్ స్టార్ మొబైల్ సబ్ స్క్రిప్షన్ లభిస్తుంది. అందువల్ల ఐపిఎల్ క్రికెట్ ప్రియులకు ఇది బెస్ట్ అవకాశమని చెప్పుకోవచ్చు.
-
BSNL: బీఎస్ఎన్ఎల్ బెస్ట్ ప్లాన్.. బెనిఫిట్స్ తెలిస్తే రీఛార్జ్ చేయకుండా ఉండలేరు
-
MS Dhoni : ఐపీఎల్లో సీఎస్కేకి ఫ్యూచర్ ఉందా? ధోని ఏమైనా ప్లాన్ చేశాడా?
-
Jasprit Bumrah: ముంబై ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. వచ్చేస్తున్న బుమ్రా
-
Hardik Pandya: ఐపీఎల్ హిస్టరీలోనే కెప్టెన్‌గా హార్దిక్ రికార్డు
-
IPL 2025: ఐపీఎల్లో రిటైర్డ్ ఔట్ ప్లేయర్స్ లిస్ట్ ఇదే
-
Tilak Varma: తిలక్ వర్మ రిటైర్డ్ ఔట్.. తెలుగు కుర్రాడికి ఘోర అవమానం