Champions Trophy 2025: ఆదాయం రూపాయల్లో.. వ్యయం వందల్లో ఇది పాకిస్థాన్ పరిస్థితి.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

Champions Trophy 2025:
ఫిబ్రవరి 19వ తేదీన ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్ వేదికగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా హైబ్రిడ్ మోడ్‌లో మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో ఆడుతుంది. అయితే ఇప్పటి ఈ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్ టోర్నీ నుంచి ఔట్ అయ్యాయి. అయితే పాకిస్థాన్ ఈ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ కోసం భారీగానే ఖర్చు పెట్టింది. పాకిస్థాన్‌లో ట్రోఫీకి ఇండియా వెళ్లదు. కొన్ని భద్రతా కారణాల వల్ల వెళ్లడానికి తిరస్కరించడంతో ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో దుబాయ్‌లో నిర్వహించారు. దీనికి పాకిస్థాన్ ముందుగా అనుమతి ఇవ్వలేదు. దీంతో అతిథ్య దేశాన్ని మారుస్తారనగా.. ఒప్పుకుంది. ఎందుకంటే ఆతిథ్య దేశం మారిస్తే.. పాక్‌కి ఐసీసీ నుంచి డబ్బులు రావు.
ఈ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్ భారీగానే ఖర్చు పెట్టింది. కరాచీ, లాహోర్, రావల్పిండి స్టేడియం పునరుద్ధరణకు దాదాపుగా 12.3 బిలియన్ పాకిస్తాన్ రూపాయలు అవుతుందని అంచనా వేసింది. అంటే ఇండియన్ కరెన్సీలో సుమారుగా రూ.383 కోట్లు అన్నమాట. అయితే ఈ ఖర్చులు ఇక్కడితే ఆగకుండా పెరిగాయి. ఇప్పుడు ఈ టోర్నీ కోసం పాకిస్థాన్ ఏకంగా రూ.591 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. కానీ పాకిస్థాన్ సెమీస్‌కు వెళ్లకుండా వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోయింది. దీంతో పాకిస్థాన్ జట్టుకు కేవలం రూ.2.3 కోట్లు మాత్రమే ఐసీసీ ఇవ్వనుంది. దీనిపై నెటిజన్లు పాకిస్థాన్ జట్టును ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు. ఆదాయం 6 రూపాయిలు అయితే ఖర్చు రూ.60 లు అని ఎగతాళి చేస్తున్నారు. ఇకనైనా పాకిస్థాన్ తన తీరును మార్చుకోవాలని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
పాకిస్థాన్ జట్టు గ్రూప్ దశలోనే ఇంటి బాట పట్టింది. న్యూజిలాండ్, భారత్ చేతిలో పాకిస్థాన్ వరుసగా ఓడిపోయింది. దీంతో సెమీస్‌కు వెళ్లకుండా గ్రూప్ దశలోనే పాకిస్థాన్ ఓడిపోయింది. సొంత గడ్డపై జరుగుతున్న టోర్నీలో పాకిస్థాన్ జట్టు కనీసం సెమీస్‌కు కూడా చేరలేదు. దీంతో నెటిజన్లు బాగా ట్రోల్ చేస్తున్నారు. ఇటీవల న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌తో తలపడింది. ఇందులో బంగ్లాదేశ్ ఓడిపోయింది. ఒకవేళ గెలిచి ఉంటే మాత్రం పాకిస్థాన్ సెమీస్ ఆశలు కాస్త ఉండేవి. కానీ బంగ్లాదేశ్ ఓడిపోవడంతో పాకిస్థాన్ సెమీస్ ఆశలు అన్ని కూడా గాల్లో కలిసి పోయాయి. టోర్నీ ప్రారంభమైన 5 రోజుల్లోనే పాకిస్థాన్ నిష్క్రమించడంపై ఎక్కువగా విమర్శలు వచ్చాయి. న్యూజిలాండ్‌పై మొదటి మ్యాచ్ ఓడిపోయిన పాక్ ఇండియాపై గెలవాలని అనుకుంది. కానీ భారత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో పాకిస్థాన్ ఓడిపోయింది. మొదటిలో బాగానే ఆడినా ఆ తర్వాత వరుసగా వికెట్లు పడిపోవడంతో 241 పరుగులకే పాకిస్థాన్ జట్టు ఆలౌట్ అయ్యింది. తమ గడ్డ మీద జరుగుతున్న టోర్నీలో మొదటి 5 రోజులకే ఔట్ కావడంతో పాక్ క్రికెట్ కూడా నిరాశ పడ్డారు. అందులోనూ భారత్‌పై కూడా ఓడిపోవడంతో నిరాశపడ్డారు.
-
ChatGPT: చాట్‌జీపీటీలో కొత్త ఫీచర్.. అన్ని ఫొటోలు ఈజీగా సేవ్ చేసుకోవచ్చు
-
Hero Nithin : గూబ పగులుద్ది..హీరో నితిన్ కి సోషల్ మీడియా స్ట్రాంగ్ వార్నింగ్!
-
Subhman Gil: మరో అమ్మాయితో ప్రేమలో పడిన శుభమన్ గిల్.. ఇక సారా లేనట్టేనా?
-
Champions Trophy 2025: గెలిచిన జట్టు వైట్ బ్లేజర్స్ ఎందుకు ధరిస్తారో మీకు తెలుసా?
-
Yuzvendra Chahal: స్టేడియంలో మరో అమ్మాయితో చాహల్.. ఇంతకీ ఎవరీ మిస్టరీ గర్ల్?
-
ICC Champions Trophy: టీమిండియా విన్నింగ్ చూసి.. చిన్నపిల్లాడిలా సునీల్ గవాస్కర్ డ్యాన్స్.. వైరలవుతున్న వీడియో!