Champions Trophy Final Match: టీమిండియాకి బిగ్ షాక్.. షమీకి గాయం.. మ్యాచ్‌పై తీవ్ర ప్రభావం పడుతుందా?

Champions Trophy Final Match:
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ (Champions Trophy Final Match) జరుగుతోంది. దుబాయ్ వేదికగా టీమిండియా (Team India), న్యూజిలాండ్ (New Zealand) మధ్య మ్యాచ్ జరుగుతోంది. అయితే న్యూజిలాండ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో మొదట న్యూజిలాండ్ బ్యాటింగ్ చేస్తోంది. కివీస్ ఆటగాళ్లు నిలకడగా ఆడుతున్నారు. ఇలాంటి సమయంలో భారత్‌కు (India) బిగ్ షాక్ తగిలింది. భారత స్టార్ బౌలర్ షమీ చేతికి మైదానంలో గాయం తగిలింది. ఏడో ఓవర్ వేస్తుండగా రచిన్ కొట్టిన బంతిని క్యాచ్ పట్టుకోవడానికి ప్రయత్నించగా షమీ ఎడమ చేతికి గాయం తగిలింది. వెంటనే చికిత్స చేశారు. అయితే ఓవర్ సగంలో ఉండటంతో షమీ ఓవర్‌ను పూర్తి చేసి మైదానం నుంచి వీడాడు. మళ్లీ మైదానంలోకి షమీ వచ్చాడు.
Wtf Mohammed Shami brother. That was tough but should have taken the catch man. pic.twitter.com/fZP86ElZL0
— R A T N I S H (@LoyalSachinFan) March 9, 2025
టీమిండియా జట్టులో ఇద్దరు పేసర్లు మాత్రమే ఉన్నారు. ఈ ఛాంపియన్స్ ఫైనల్ మ్యాచ్‌లో షమీ తప్పకుండా బౌలింగ్ చేయాలి. లేకపోతే అది మ్యాచ్‌పై ప్రభావం పడుతుంది. గాయం చిన్నది అయితే షమీ బౌలింగ్ చేస్తాడు. అదే పెద్ది అయితే టీమిండియాకి పెద్ద దెబ్బే అని చెప్పవచ్చు. న్యూజిలాండ్ మీద గెలవాలి అంటే తప్పకుండా బౌలర్లు ఉండాలి. లేకపోతే మ్యాచ్ గెలవడంలో కష్టమవుతుంది. ఇదిలా ఉండగా దుబాయ్ వేదికగా ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతోంది. కివీస్ బ్యాటర్లు ముగ్గురు ఔట్ అయ్యారు. 12 ఓవర్లలోనే మొత్తం ముగ్గురుని టీమిండియా ఔట్ చేసింది. ప్రస్తుతం మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. హోరాహోరీగా సాగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవాలని భారత్ ఫ్యాన్స్ అందరూ కూడా కోరుకుంటున్నారు. మరి ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధిస్తుందో లేదో చూడాలి.
భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఉన్నారు.
న్యూజిలాండ్ జట్టు
విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), కైల్ జేమిసన్, విలియం ఓరూర్కే, నాథన్ స్మిత్ ఆడుతున్నారు.
-
BCCI: టీమిండియా ఆటగాళ్లు నక్క తోక తొక్కారు పో
-
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీలో ఒక్కో ఆటగాడికి ఎంత వచ్చిందంటే?
-
Champions Trophy 2025: గెలిచిన జట్టు వైట్ బ్లేజర్స్ ఎందుకు ధరిస్తారో మీకు తెలుసా?
-
Rohit Sharma: తప్పుడు ప్రచారాలు చేయవద్దు.. రిటైర్మెంట్పై హిట్ మ్యాన్ కీలక ప్రకటన
-
Yuzvendra Chahal: స్టేడియంలో మరో అమ్మాయితో చాహల్.. ఇంతకీ ఎవరీ మిస్టరీ గర్ల్?
-
ICC Champions Trophy: టీమిండియా విన్నింగ్ చూసి.. చిన్నపిల్లాడిలా సునీల్ గవాస్కర్ డ్యాన్స్.. వైరలవుతున్న వీడియో!