Champions Trophy: దుబాయ్‌లో ఫైనల్ మ్యాచ్.. పాకిస్థాన్‌పై నెట్టంట విమర్శలు

Champions Trophy:
ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీ ఫైనల్‌లో ఆసీస్‌ను భారత్ చిత్తుగా ఓడించి ఫైనల్‌కి చేరింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 264 పరుగుల వద్ద ఆలౌటైంది. 265 పరుగులతో బరిలోకి దిగిన భారత్ జట్టు 48.1 ఓవర్లలో 265 పరుగులు చేసి 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు గెలవడంతో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరుకుంది. ఈ క్రమంలో పాకిస్థాన్‌పై నెట్టింట తీవ్రంగా మీమ్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. కొన్ని భద్రతా కారణాల వల్ల టీమిండియా అక్కడికి వెళ్లడానికి నిరాకరించడంతో హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించారు. భారత్‌తో జరిగే మ్యాచ్‌లు అన్ని కూడా దుబాయ్ వేదికగానే జరుగుతాయి.
So it's official:
23 Feb: Pakistan Champions Trophy Se bahar
4 March : Champions Trophy Pakistan Se baharThis Shot show how champion trophy is going far away from Pakistan 😎 pic.twitter.com/WtjEwT5evk
— Adiii (@adiibhauu) March 4, 2025
ఇప్పుడు టీమిండియా ఫైనల్‌కి చేరడంతో ఈ మ్యాచ్ కూడా దుబాయ్‌లోనే జరుగుతుంది. హైబ్రిడ్ మోడల్ ప్రకారం అయితే టీమిండియా ఫైనల్‌కి అర్హత సాధిస్తే మ్యాచ్ దుబాయ్‌లోనే ఉంటుందని ముందే ఐసీసీ ప్రకటించింది. దీంతో నెటిజన్లు పాకిస్థాన్‌పై మీమ్స్ చేస్తున్నారు. పాక్ జట్టు కనీసం సెమీస్‌కు కూడా అర్హత సాధించలేదు. టోర్నీ ప్రారంభమైన ఐదు రోజులకే ఔట్ అయ్యింది. వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో సెమీస్‌కు అర్హత సాధించలేదు, ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ కూడా పోయిందని కామెంట్లు చేస్తున్నారు. భారత్ కాకుండా ఇంకా ఏ జట్టు అయినా సెమీస్‌కి వెళ్లి ఉంటే లాహోర్‌లోని గడాఫీ మైదానం వేదికయ్యేది. కానీ భారత్ సెమీస్‌కు చేరడంతో అంతా మారిపోయింది. అయితే నేడు గడాఫీ స్టేడియంలో రెండో సెమీస్ జరగనుంది.
పాకిస్థాన్‌ను మొన్న టోర్నీ నుంచి బయటకు పంపాం.. ఇప్పుడు ఏకంగా ఫైనల్‌ను కూడా పాక్ నుంచి బయటకు పంపామని కామెంట్లు చేస్తున్నారు. మ్యాచ్ కారణంగా ఒక్క సెమీస్ కూడా నిర్వహించలేదు. ఇప్పుడు ఫైనల్ కూడా దుబాయ్‌లో జరుగుతుందని, ఫైనల్ మ్యాచ్ పాకిస్థాన్ నుంచి పారిపోయిందని కామెంట్లు చేస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీకి పాక్ ఆతిథ్యమిస్తోంది.. కానీ పాక్ మాత్రం ఫైనల్‌లో లేదని అంటున్నారు. టైటిల్ పోరులో భారత్ సిద్ధమైందని అంటున్నారు. ఆతిథ్యం ఇచ్చిన పాకిస్థాన్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. సొంత గడ్డపైనే కివీస్ చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోయింది. ఏ విధంగా అయినా కూడా పాక్ టోర్నీ నుంచి తప్పుకుందని నెటిజన్లు పాకిస్థాన్‌పై సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ సూపర్ సిక్సర్‌తో భారత్‌కు విజయాన్ని అందించాడు. ఇండియా గెలవడంలో విరాట్ కోహ్లీ ముఖ్య పాత్ర పోషించాడు. ఐదోసారి టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కి చేరింది. అయితే 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్ కంగారుల చేతిలో ఓడిపోయింది. దీనికి ప్రతీకారంగా భారత్ సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియను చిత్తుగా ఓడించింది.
-
ChatGPT: చాట్‌జీపీటీలో కొత్త ఫీచర్.. అన్ని ఫొటోలు ఈజీగా సేవ్ చేసుకోవచ్చు
-
Hero Nithin : గూబ పగులుద్ది..హీరో నితిన్ కి సోషల్ మీడియా స్ట్రాంగ్ వార్నింగ్!
-
Subhman Gil: మరో అమ్మాయితో ప్రేమలో పడిన శుభమన్ గిల్.. ఇక సారా లేనట్టేనా?
-
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీలో ఒక్కో ఆటగాడికి ఎంత వచ్చిందంటే?
-
Champions Trophy 2025: గెలిచిన జట్టు వైట్ బ్లేజర్స్ ఎందుకు ధరిస్తారో మీకు తెలుసా?
-
Rohit Sharma: తప్పుడు ప్రచారాలు చేయవద్దు.. రిటైర్మెంట్పై హిట్ మ్యాన్ కీలక ప్రకటన