Champions Trophy: రూట్ సెంచరీ వృథా.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఇంగ్లాండ్ ఔట్

Champions Trophy:
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఇంగ్లాండ్ నిష్క్రమించింది. ఆఫ్గానిస్థాన్ చేతిలో 8 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ పరాజయం పాలైంది. లాహోర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆఫ్గానిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 50 ఓవర్లలో 7 వికెట్‌లకు 325 పరుగులు చేసింది. ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ 146 బంతుల్లో 177 కొట్టాడు. ఈ మెగాటోర్నీలో అత్యధిక స్కోర్‌తో రికార్డులోకి ఎక్కాడు. అయితే ఇంగ్లాండ్ జట్టు 49.5 ఓవర్లలో 317 పరుగులకు ఆలౌటైంది. మాజీ కెప్టెన్ జో రూట్ సెంచరీ చేసినా కూడా ఫలితం లేకపోయింది. మొత్తం 111 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. ఇప్పటికే పాకిస్థాన్, బంగ్లాదేశ్ టోర్నీ నుంచి ఔట్ కాగా.. తాజాగా ఇంగ్లాండ్ కూడా ఈ లిస్ట్‌లో చేరింది. అయితే ఇప్పటి వరకు గ్రూప్ ఏ లోని జట్లుకు మ్యాచ్ జరిగాయి.
ప్రస్తుతం గ్రూప్ బిలోని జట్లు మ్యాచ్‌లు మరింత ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. ఎందుకంటే రెండు మ్యాచ్‌లు వరుసగా ఓడిపోయి ఇంగ్లాండ్ సెమీస్ అవకాశాలను కోల్పోయింది. అయితే ఆఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా మూడు జట్లు కూడా ఒక్కో మ్యాచ్ గెలిచాయి. అయితే వీటిలో రెండు జట్లు మాత్రమే సెమీస్‌కు వెళ్తాయి. అయితే గ్రూప్ బిలో ఇప్పుడు సెమీస్ ఫైనల్ అవకాశాలు ఎక్కువగా సౌతాఫ్రికాకు ఉన్నాయి. ఆస్ట్రేలియా ఇది సరి సమానంగా ఉన్నా కూడా సౌతాఫ్రికా రన్ రేటు ఎక్కువగా ఉండటంతో టాప్‌లో ఉంది. సౌత్ ఆఫ్రికా మార్చి 1న ఇంగ్లాండ్‌తో ఆడనుంది. అయితే ఆస్ట్రేలియా చివరిగా ఆఫ్గానిస్థాన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓడిపోతే సౌతాఫ్రికా సెమీస్‌కు వెళ్తుంది. ఆస్ట్రేలియా సెమీస్‌కు వెళ్లాలంటే ఈ మ్యాచ్ గెలవాల్సిందే. అయితే ఆస్ట్రేలియా, ఆఫ్గానిస్థాన్ మ్యాచ్‌లో ఆఫ్గానిస్తాన్ గెలవాలి. ఈ మ్యాచ్ గెలిస్తేనే సెమీస్‌కు వెళ్తుంది. లేకపోతే పూర్తిగా టోర్నీ నుంచి తప్పుకుంటుంది.
ఇదిలా ఉండగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19వ తేదీన ప్రారంభమైంది. ఇప్పటికే ఈ ట్రోఫీ నుంచి పాకిస్థాన్ ఔట్ కాగా ఇటీవల బంగ్లాదేశ్ కూడా ఔట్ అయ్యింది. ఈ ట్రోఫీలో పాకిస్థాన్ మొదటి మ్యాచ్ న్యూజిలాండ్‌తో ఆడింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓటమి పాలైంది. ఆ తర్వాత భారత్‌తో పాక్ మ్యాచ్ ఆడగా ఇందులో కూడా ఘోర పరాజయం పాలైంది. ఆ తర్వాత బంగ్లాదేశ్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో బంగ్లాదేశ్ గెలిచి ఉంటే పాకిస్థాన్‌కు సెమీస్ ఆశలు ఉండేవి. కానీ బంగ్లాదేశ్ ఓడిపోవడంతో పాకిస్థాన్ సెమీస్ నుంచి నిష్క్రమించింది. ఇలా పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్ మూడు కూడా ఈ ఛాంపియన్స్ టోర్నీ నుంచి తప్పుకున్నాయి.