IND vs PAK: దుబాయ్‌లో పాక్‌ను చితక్కొట్టిన భారత్.. విరాట్ వీరోచిత పోరాటం

IND vs PAK:
దాయాది దేశంపై టీమిండియా విజయం సాధించింది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాక్ మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా సునయాసంగా ఘన విజయం సాధించింది. 42.3 ఓవర్లలో టీమిండియా 242 పరుగులు లక్ష్యా్న్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ 111 బంతుల్లో సెంచరీ చేశాడు. శ్రేయస్ అయ్యర్(56) అర్దశతకంతో అదర గొట్టగా.. రోహిత్(20), గిల్(46), హార్దిక్(8), అక్షర్(3*) పరుగులు చేశారు. పాకిస్థాన్ జట్టులో అఫ్రిది 2 వికెట్లు, అహ్మద్, ఖుష్‌దిల్ చెరో వికెట్ తీశారు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో పాక్ చేతిలో భారత్ ఓడిపోయింది. దీనికి ప్రతీకారంగా భారత్ పగ తీర్చుకుంది.
భారత్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ పాకిస్థాన్ ఓడిపోవడంతో ఇంటికి వెళ్లిపోయింది. ఈ మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ ఒక్కడే పోరాటం చేశాడు. సెంచరీ చేసి విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. వన్డేల్లో విరాట్ కోహ్లీకి ఇది 51వ సెంచరీ. అలాగే 14 వేల పరుగులు కూడా పూర్తి చేసి కోహ్లీ రికార్డు సృష్టించాడు. అలాగే విరాట్ కోహ్లీ మరో రికార్డు కూడా సృష్టించాడు. టీమిండియా తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్‌గా కింగ్ కోహ్లీ నిలిచాడు. ఈ రికార్డు ఇంతకు ముందు మహ్మద్ అజారుద్దీన్‌పైన ఉండేది. ఇప్పుడు విరాట్ కోహ్లీ 158 క్యాచ్‌లతో టాప్‌లో ఉండగా.. రెండో స్థానంలో 156 క్యాచ్‌లతో మహ్మద్ అజారుద్దీన్, 140 క్యాచ్‌లతో మూడో స్థానంలో సచిన్ టెండుల్కర్ ఉన్నారు.
ఇదిలా ఉండగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ 49.4 ఓవర్లలో 241 పరుగులు చేసి ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో భారత్ బౌలర్లు చాలా కట్టుదిట్టంగా బంతులు వేశారు. చాలా జాగ్రత్తగా ఆడినా పాకిస్థాన్ చివరికి ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో సౌద్ షకీల్ 62 పరుగులు, మహ్మద్ రిజ్వాన్ 46 పరుగుల చేశారు. భారత్ బౌలర్లు ఈ మ్యాచ్‌లో ఇరగదీశారు. కుల్‌దీప్ యాదవ్ 3 వికెట్లు తీయగా హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణాకు ఒక్కోరు ఒక్కో వికెట్ తీశారు. భారత్ బౌలర్ల దెబ్బకి పాకిస్థాన్ బాటర్లు షాక్ అయ్యారు. బౌలింగ్‌ను టీమిండియా కట్టడి చేయడంతో పాకిస్థాన్ జట్టు 241 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
-
Subhman Gil: మరో అమ్మాయితో ప్రేమలో పడిన శుభమన్ గిల్.. ఇక సారా లేనట్టేనా?
-
Champions Trophy 2025: గెలిచిన జట్టు వైట్ బ్లేజర్స్ ఎందుకు ధరిస్తారో మీకు తెలుసా?
-
Rohit Sharma: తప్పుడు ప్రచారాలు చేయవద్దు.. రిటైర్మెంట్పై హిట్ మ్యాన్ కీలక ప్రకటన
-
Yuzvendra Chahal: స్టేడియంలో మరో అమ్మాయితో చాహల్.. ఇంతకీ ఎవరీ మిస్టరీ గర్ల్?
-
ICC Champions Trophy: టీమిండియా విన్నింగ్ చూసి.. చిన్నపిల్లాడిలా సునీల్ గవాస్కర్ డ్యాన్స్.. వైరలవుతున్న వీడియో!
-
Viral Video: విన్నింగ్ మూమెంట్‌ను ఎంజాయ్ చేస్తూ.. దాండియా, హోలీ ఆడిన రోహిత్, విరాట్.. వీడియో వైరల్