India vs Pakistan ODI: రివెంజ్ తీసుకున్న భారత్.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి పాక్ ఔట్?

India vs Pakistan ODI:
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఫిబ్రవరి 23వ తేదీన భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ హోరాహోరీగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు 241 పరుగులకు ఆలౌటైంది. 242 పరుగులు లక్ష్యాన్ని టీమిండియా 42.3 ఓవర్లలో ఛేదించింది. ఈ మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ సెంచరీతో (100*) చెలరేగాడు. శ్రేయస్ అయ్యర్(56) అర్ద శతకంతో అదర గొట్టాడు. రోహిత్(20), గిల్(46), హార్దిక్(8), అక్షర్(3*) పరుగులు చేశారు.
టీమిండియా ఆరు వికెట్ల తేడాతో పాక్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ 49.4 ఓవర్లలో 241 పరుగులు చేసి ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో భారత్ బౌలర్లు చాలా కట్టుదిట్టంగా బంతులు వేశారు. చాలా జాగ్రత్తగా ఆడినా పాకిస్థాన్ చివరికి ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో సౌద్ షకీల్ 62 పరుగులు, మహ్మద్ రిజ్వాన్ 46 పరుగుల చేశారు. కుల్‌దీప్ యాదవ్ 3 వికెట్లు తీయగా హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణాకు ఒక్కోరు ఒక్కో వికెట్ తీశారు. భారత్ బౌలర్ల దెబ్బకి పాకిస్థాన్ బాటర్లు 241 పరుగులకే ఆలౌట్ అయ్యారు. అయితే పాకిస్థాన్ చేతిలో భారత్ ఇది వరకు ఓడిపోయింది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో పాక్ చేతిలో భారత్ ఘోర ఓటమి పాలైంది. దీనికి ప్రతీకారంగా భారత్ పగ తీర్చుకుంది.
ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ ఏలో భాగంగా ఫస్ట్ పాకిస్థాన్ న్యూజిలాండ్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓటమి పాలైంది. ఆ తర్వాత ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోవడంతో పాకిస్థాన్ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఔట్ అయ్యినట్లే. అయితే టీమిండియా మొదటి మ్యాచ్ బంగ్లాదేశ్‌తో జరిగింది. ఇందులో టీమిండియా గెలిచింది. గ్రూప్ ఏలో భాగంగా రెండు మ్యాచ్‌లు టీమిండియా గెలవడంతో.. పాకిస్థాన్ ఇక సెమీస్‌కు వెళ్లే అవకాశాన్ని దాదాపుగా కోల్పోయినట్లే. బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలిస్తే తప్పకుండా పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఇంటికి వెళ్తాయి. అదే బంగ్లాదేశ్ గెలిస్తే మాత్రం పాకిస్థాన్ సెమీస్‌కి వెళ్లే అవకాశాలు కాస్త ఉంటాయి. అయితే బంగ్లాదేశ్ న్యూజిలాండ్‌ను ఓడించడం చాలా కష్టం. ఈ జట్టులో బౌలర్లు, బ్యాటర్లు కూడా ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే బంగ్లాదేశ్ గెలవడం కాస్త కష్టమే. మరి ఏ జట్టు గెలుస్తుందో చూడాలి.
-
ICC Champions Trophy: టీమిండియా విన్నింగ్ చూసి.. చిన్నపిల్లాడిలా సునీల్ గవాస్కర్ డ్యాన్స్.. వైరలవుతున్న వీడియో!
-
ICC Champions Trophy: కివీస్‌పై ఇండియా గ్రాండ్ విక్టరీ
-
Champions Trophy Final Match: టీమిండియాకి బిగ్ షాక్.. షమీకి గాయం.. మ్యాచ్‌పై తీవ్ర ప్రభావం పడుతుందా?
-
Champions Trophy: పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఔట్
-
IND vs PAK: దుబాయ్‌లో పాక్‌ను చితక్కొట్టిన భారత్.. విరాట్ వీరోచిత పోరాటం