IPL 2025: ఐపీఎల్ ప్రేమికులకు బిగ్ షాక్.. సబ్స్క్రిప్షన్ తీసుకుంటేనే ఇకపై మ్యాచ్ చూసే ఛాన్స్
IPL 2025:

IPL 2025: క్రికెట్ ప్రేమికులు అందరూ కూడా ఎంతగానో ఎదురు చూసే ఐపీఎల్ (IPL) వచ్చేస్తుంది. మార్చి నెల నుంచి ఐపీఎల్ (IPL) ప్రారంభం కానుంది. అయితే క్రికెట్ ప్రేమికులు ఎక్కువగా జియో (Jio) సినిమాలో మ్యాచ్‌లు చూస్తుంటారు. అలాంటివారికి బిగ్ షాక్ ఇచ్చింది. ఎందుకంటే రిలయన్స్ (Reliance) సంస్థకు చెందిన జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్ విలీనమయ్యాయి. ఈ రెండింటిని కలిపి జియో హాట్‌స్టార్ (Jio Hotstar)గా తీసుకొచ్చారు. అప్పుడు డిస్నీ + హాట్‌స్టార్ కోసం సపరేట్ సబ్స్క్రిప్షన్, జియో సినిమా కోసం వేర్వేరుగా సబ్‌స్క్రైబ్ (SubScribe) చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిలో చూడాల్సినవి ఒకే చోట చూడవచ్చు. వీటి సేవలు కూడా ప్రారంభమయ్యాయి. రూ.149 నుంచి వీటి ప్లాన్ సేవలు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు క్రికెట్ ప్రేమికులు ఐపీఎల్‌ను (IPL) ఉచితంగా జియో సినిమాలో చూసేవారు. కానీ ఇకపై ఉచితంగా చూడలేరు. జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్ రెండు విలీనం కావంతో సబ్స్క్రిప్షన్ తీసుకుంటేనే మ్యాచ్ చూడగలరు. లేకపోతే మ్యాచ్ చూడలేరు. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
జియో హాట్‌స్టార్‌లో తక్కువ ధరకే సబ్స్క్రిప్షన్ ప్లాన్ ప్రారంభం అవుతుంది. దీని ధర రూ149. అలాగే వ్యాలిడిటీ 3 నెలలు మాత్రమే ఉంటుంది. అదే ఏడాది వేసుకుంటే రూ.499 అవుతుంది. ఇవే కాకుండా మరి కొన్ని ప్లాన్స్ కూడా ఉన్నాయి. ఈ ప్లాన్ అయితే కేవలం మొబైల్లో మాత్రమే చూడగలరు. అదే మరో 2 సూపర్ ప్లాన్లు అయితే రెండు డివైజ్‌లో కూడా చూడవచ్చు. మూడు నెలల వ్యాలిడిటీ ప్లాన్‌తో వస్తుంది. రూ.299 మూడు నెలలు, రూ.899గా ఏడాది వ్యాలిడిటీ ఉంటుంది. ఈ ప్లాన్స్ కనుక సబ్‌స్క్రైబ్ చేసుకుంటే మీ మొబైల్, డెస్క్ టాప్, టీవీ కూడా చూసుకోవచ్చు. కానీ ఏదైనా రెండు డివైజ్‌లకు మాత్రమే అనుమతి ఉంటుంది. అయితే యాడ్స్ లేకుండా కూడా కంటెంట్ చూడాలంటే ప్రీమియం ప్లాన్స్ తీసుకోవాలి. రూ.299 తో సబ్‌స్క్రైబ్ చేసుకుంటే నెల రోజుల పాటు కూడా యాడ్స్ లేకుండా కంటెంట్ చూడవచ్చు. రూ.499 ప్లాన్ తీసుకుంటే 3 నెలల వ్యాలిడిటీ ఉంటుంది. అదే యాన్యువల్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే మాత్రం ధర రూ.1499 ప్రీమియం ప్లాన్ తీసుకోవాలి. వీటితో ఏడాది పాటు ఎలాంటి యాడ్స్ కూడా రావు. ఈ ప్రీమియం ప్లా్న్లతో ఒకేసారి 4 డివైజ్‌లలో కూడా కంటెంట్ చూడవచ్చు.
-
Rashid Khan: బుమ్రా రికార్డ్ బ్రేక్ చేసిన రషీద్ ఖాన్
-
Vignesh Putur: చెన్నైకి చెమటలు పట్టించిన పుతుర్.. ఇంతకీ ఎవరు?
-
IPL: ఐపీఎల్లో చీర్లీడర్లు ఒక్కో మ్యాచ్‌కు ఎంత సంపాదిస్తారంటే?
-
IPL: ఐపీఎల్ సీజన్లో ఈ స్టాక్స్ కొంటే.. లాభమంతా మీదే!
-
IPL క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. Airtel, VI సూపర్ ప్లాన్స్..!
-
IPl 2025:క్రికెట్ ఫ్యాన్స్ షాకింగ్ న్యూస్.. ఆ మ్యాచ్ రీ షెడ్యూల్?