IPL 2025: మ్యాచ్‌కి వరుణుడు ఆటంకం.. మ్యాచ్ రద్దు అయితే పరిస్థితి ఏంటి?
ఐపీఎల్ 2025 సీజన్ చివరి దశకు వచ్చేసింది. అయితే నేడు ముంబై ఇండియన్స్ (Mumbai Indians), ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)కి మధ్య మ్యాచ్ జరగనుంది.

IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్ చివరి దశకు వచ్చేసింది. అయితే నేడు ముంబై ఇండియన్స్ (Mumbai Indians), ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)కి మధ్య మ్యాచ్ జరగనుంది. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే మ్యాచ్‌కు వరుణు ఆటంకం పెట్టనున్నట్లు తెలుస్తోంది. నేడు కనుక మ్యాచ్ సమయంలో వర్షం పడి.. రద్దు అయితే ప్లేఆఫ్స్ ఢిల్లీ చేరుకోవడం కష్టమే. ఎందుకంటే ఢిల్లీ జట్టు ప్రస్తుతం ఎలిమినేషన్‌కు దగ్గరలో ఉంది. టాప్ 4లో ఢిల్లీ జట్టు ఉండాలంటే మాత్రం మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తేనే ఆ అవుతుంది. ఒకవేళ ఈ మ్యాచ్ రద్దు అయినా లేకపోతే ఒక్క మ్యాచ్‌లో అయినా ఓడినా ప్లేఆఫ్స్‌కు ఢిల్లీ చేరుకోవడం కష్టం. రానున్న నాలుగు రోజులు ముంబైలో భారీగా వర్షాలు కురవనున్నాయి.
Read Also: అమెరికా నుంచి పిలుపు.. వెళ్లడానికి మొగ్గు చూపని విద్యార్థులు
ముంబైకి వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. అయితే ముంబై ఇండియన్స్ జట్టు ఒక పాయింట్‌తో ఢిల్లీ కంటే ముందే ఉంది. ఈ రోజు మ్యాచ్ రద్దు అయితే రెండు టీమ్‌లకు చెరో పాయింట్లు వస్తాయి. అప్పుడు ముంబై జట్టు 15, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 14 పాయింట్లతో ఉంటుంది. అయితే ముంబై, ఢిల్లీ జట్ల లీగ్ దశలో పంజాబ్ కింగ్స్‌తో (Punjab Kings) చివరి మ్యాచ్‌లను ఆడనున్నాయి. ఇప్పటికే పంజాబ్ 17 పాయింట్లు సాధించి ప్లేఆఫ్స్‌కు చేరింది. నేడు ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే మాత్రం పంజాబ్ కింగ్స్ చేతిలో మంబై ఓడిపోవాలి. అప్పుడే ఢిల్లీ జట్టు ప్లే ఆఫ్స్‌కి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది.
Also Read: Small AC: రూ.2వేల లోపే ఏసీ లాంటి గాలి.. దీంతో ఈ వేసవికి గుడ్ బై చెప్పేయండి
వర్షాన్ని దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ నిబంధనలలో మార్పులు చేసింది. ఐపీఎల్ గ్రూప్ రౌండ్ మ్యాచ్‌లలో వర్షం పడితే ఒక గంట తర్వాత ఓవర్లు కుదించడం ప్రారంభమవుతుంది. ఇప్పుడు దానిని రెండు గంటలకు పెంచారు. అయితే మ్యాచ్ 9.30 కి ముందు కానీ ప్రారంభం అయితే ఓవర్లలో ఎలాంటి తగ్గింపు కూడా ఉండదు. అయితే ముంబైలో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫానులు కూడా వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముంబై, కొంకణ్ ప్రాంతంలో వచ్చే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు వస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. అయితే మంగళవారం రాత్రి ముంబైలో భారీ వర్షం కురవడంతో ఢిల్లీ జట్టు ప్రాక్టీస్ సెషన్ పూర్తి చేయలేకపోయింది.
-
IPL 2025 : రాజస్థాన్ రాయల్స్‌ను వీడి CSKలోకి సంజు శాంసన్? నిజమెంత?
-
Mitchell Marsh: ఏం కొట్టుడు అదీ.. మిచెల్ మార్ష్ సెంచరీ తడాఖా చూపించాడు
-
IPL 2025: రికార్డు సృష్టించిన సూర్య కుమార్ యాదవ్
-
IPL 2025 : ముగిసిన ప్లే ఆఫ్ రేస్.. ముంబై పైకి.. ఢిల్లీ ఇంటికి.. ఇక మ్యాచ్లన్నీ నామమాత్రం!
-
IPL 2025: ప్లే ఆఫ్స్‌కు చేరిన ఆర్సీబీకి తప్పని భయం.. ఆందోళనలో ఫ్యాన్స్
-
Shreyas Iyer: ఐపీఎల్ చరిత్రలోనే రికార్డులు అయ్యర్ సొంతం