IPL 2025: పంజాబ్ జట్టు సరికొత్త రికార్డు

IPL 2025: ఐపీఎల్ సీజన్ 2025లో నేడు రెండు మ్యాచ్‌లు జరుగుతున్నాయి. అయితే జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ ప్రస్తుతం తలపడుతున్నాయి. పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే పంజాబ్ కింగ్స్ మొదటి నుంచి నిలకడగా ఆడారు. పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్‌కు 220 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే పంజాబ్ కింగ్స్ బ్యాటర్లలో నేహల్ వధేరా 70, శశాంక్ సింగ్ 59* రాణించారు. శ్రేయస్ అయ్యర్ 30, ప్రభుసిమ్రన్ సింగ్ 21, అజ్మతుల్లా ఒమర్జాయ్ 21* ఫర్వాలేదనిపించారు. ప్రియాంశ్ ఆర్య 9, మిచెల్ ఓవెన్ 0 విఫలమయ్యారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో తుశార్ దేశ్‌పాండే 2, క్వెనా మపాకా, రియాన్ పరాగ్, ఆకాశ్ మద్వాల్ తలో వికెట్ తీసుకున్నారు. అయితే ఈ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు సరికొత్త రికార్డును సృష్టించింది. మిడిలార్డర్ నం.4 బ్యాటర్ నుంచి నంబర్ 7 బ్యాటర్ వరకు మొత్తం కలిపి అత్యధికంగా 180 పరుగులు చేసింది. గతంలో ఈ రికార్డు ముంబై ఇండియన్స్ జట్టు పేరు మీద ఉంది. ఈ మిడిలార్డర్‌లో 174 పరుగులు చేసింది.
Read Also:Photo Story: ఒకప్పటి స్టార్ హీరోయిన్.. చిన్నప్పుడు ఎంత బొద్దుగా ఉందో చూశారా?
పంజాబ్ కింగ్స్: ప్రియాంశ్ ఆర్య, ప్రభుసిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), శశాంక్ సింగ్, నేహాల్ వధేరా, మిచెల్ ఓవెన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో యాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ (వికెట్ కీపర్, కెప్టెన్), రియాన్ పరాగ్, షిమ్రోన్ హెట్‌మెయర్, ధ్రువ్ జురేల్, వనిందు హసరంగ, క్వెనా మపాక, తుశార్ దేశ్‌పాండే, ఆకాశ్ మద్వాల్, ఫజల్ హక్ ఫరూఖీ.
Read Also:Viral Video : కోతిని దాని భాషలోనే ఆటపట్టించాడు.. ఆ తర్వాత సీన్ చూస్తే షాక్!
ఇదిలా ఉండగా ప్లే ఆఫ్ రేస్‌కు వెళ్లాలంటే పంజాబ్ ఈ మ్యాచ్ గెలవాలి. పంజాబ్ ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మూడు మ్యాచ్‌లలో రెండు గెలిస్తే ప్లే ఆఫ్స్‌కు వెళ్తుంది. గుజరాత్ మూడు మ్యాచ్‌లలో ఒకటి, ఆర్సీబీ జట్టు 3 మ్యాచులలో ఒకటి, ముంబై ఇండియన్ రెండు మ్యాచ్‌లలో 2, ఢిల్లీ క్యాపిటల్స్ మూడు మ్యాచ్‌లలో 2 గెలవాల్సి ఉంది. అయితే వీటితో పాటు కేకేఆర్, లక్నోకి కూడా అవకాశం ఉంది. అయితే ఇది మిగతా జట్లు గెలుపు, ఓటమి బట్టి ఉంటుంది. ఐపీఎల్ 2025 సీజన్‌లో క్వాలిఫయర్ 1 మ్యాచ్ మే 29 న నిర్వహించనుంది. ఇక 30న ఎలిమినేటర్ మ్యాచ్, జూన్ 1న క్వాలిఫయర్ 2, జూన్ 3న ఫైనల్ నిర్వహించనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. అయితే ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు ఎక్కడ జరుగుతాయనే విషయాన్ని అయితే బీసీసీఐ వెల్లడించలేదు.
-
IPL 2025: ఆ జట్టు ఈ మ్యాచ్ గెలిస్తే.. డైరెక్ట్ ప్లేఆఫ్స్
-
IPL 2025 : బీసీసీఐ నిర్ణయం పై మండిపడుతున్న అభిమానులు..కోల్‌కతా ఫ్యాన్స్ ఆగ్రహావేశాలు!
-
IPL 2025: ప్లేఆఫ్ రేస్‌కు వెళ్లాలంటే.. ఏయే జట్టు ఎన్ని మ్యాచ్‌లు గెలవాలంటే?
-
IPL new schedule: ఐపీఎల్ న్యూ షెడ్యూల్ రిలీజ్.. ఫైనల్ మ్యాచ్ ఎప్పుడంటే?
-
Riyan Parag: వరుసగా ఆరు సిక్స్‌లు.. ఐపీఎల్ చరిత్రలోనే రియాగ్ పరాగ్ రికార్డు
-
MS Dhoni : ఐపీఎల్‌లో సీఎస్కేకి ఫ్యూచర్ ఉందా? ధోని ఏమైనా ప్లాన్ చేశాడా?