IPL: ఐపీఎల్‌లో LSG ఫ్రాంచైజీకి బిగ్ షాక్.. మొదటి కొన్ని మ్యాచ్‌లకు ఈ ప్లేయర్ దూరం

IPL:
ఐపీఎల్ 18వ సీజన్ మార్చి 22వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కి బిగ్ షాక్ తగిలింది. ఐపీఎల్ నిర్వహించిన మెగా వేలంలో ఈ ఫ్రాంచైజీ మయాంక్ యాదవ్‌ను రూ.11 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ స్టార్ పేసర్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. గతేడాది మొత్తం నాలుగు మ్యాచ్‌లలో ఏడు వికెట్లు తీశాడు. దీంతో ఈ సారి మయాంక్ యాదవ్ బరోర్డ్ గవాస్కర్ ట్రోఫీలో పక్కా అని భావించారు. అయితే గతేడాది మయాంక్ గాయపడ్డాడు. ఇప్పటి వరకు మయాంక్ ఒక్క ప్రొఫెషనల్ మ్యాచ్ కూడా ఆడలేదు. ఇంకా గాయం తగ్గలేదు. ఐపీఎల్ ఇంకో పది రోజుల్లో ప్రారంభం కానుంది. గాయం ఇలానే ఉంటే.. మయాంక్ మొదట కొన్ని మ్యాచ్‌లకు దూరం కావచ్చనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్‌లోని మూడు మ్యాచ్‌లకు మయాంక్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఇంతలో ఫిట్ అయితే ముందుగానే వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మయాంక్ చికిత్స తీసుకుంటూ.. ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టాడట. మయాంక్‌కి బంగ్లాదేశ్ టీ20 సిరీస్‌లో అవకాశం వచ్చింది. కానీ గాయం కారణంగా ఈ టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
ఇదిలా ఉండగా మార్చి 22వ తేదీ నుంచి మే 25 వరకు ఐపీఎల్ టోర్నీ జరగనుంది. ప్రారంభ మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challangers Banglore) జట్ల మధ్య జరుగుతుంది. అయితే హైదరాబాద్‌లో క్వాలిఫయర్, ఒక ఎలిమేనటర్ మ్యాచ్ జరగనుంది. ఈ ఏడాది ఐపీఎల్ 2025 మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్‌లో జరగనున్నట్లు సమాచారం. ప్లేఆఫ్ మ్యాచ్‌లు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, కోల్‌కతాలో జరగనున్నాయి. అయితే ఈ సీజన్‌లో మొత్తం 74 మ్యాచ్‌లు 10 జట్లు ఆడనున్నాయి. మొత్తం 65 రోజుల పాటు ఐపీఎల్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌ల కోసం మొత్తం 11 వేదికల్లో జరగనుంది. తెలుగు రాష్ట్రాల్లో మ్యాచ్ జరగనుండటంతో క్రికెట్ ప్రేమికులకు పండగ అని చెప్పవచ్చు. ఫైనల్ మ్యాచ్ మే 25న ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతుంది. అలాగే రాజస్థాన్ జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఐదు మ్యాచ్‌లు, అస్సాంలోని బర్సాపరా క్రికెట్ స్టేడియంలో రెండు మ్యాచ్‌లు ఆడనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ వైజాగ్ స్టేడియంలో రెండు హోమ్ మ్యాచ్‌లు ఆడనున్నట్లు తెలుస్తోంది. మిగతా మ్యాచ్‌లు ఢిల్లీలో జరుగుతాయి.
-
Laptop : లాప్ టాప్ ముందు కూర్చొని కూర్చొని భుజం నొప్పి వస్తుందా?
-
Fridge: వామ్మో ఫ్రిజ్ లోని ఆహారం తింటున్నారా?
-
Salt : ఉప్పు తక్కువ అయితే ఫుడ్ తినరా? కాస్త ఎక్కువ అయినా డైరెక్ట్ అటేనట..
-
Weight Gain Tips: వీక్ గా ఉంటున్నారా? గుర్రంలా పరుగెత్తించేలా చేస్తాయి ఇవి.
-
LSG vs SRH: సన్‌రైజర్స్‌ను లక్నో సూపర్ జెయింట్స్ తట్టుకోగలదా?
-
Rashid Khan: బుమ్రా రికార్డ్ బ్రేక్ చేసిన రషీద్ ఖాన్