IPL: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. ఫస్ట్ ఫేజ్ నుంచి కీలక ప్లేయర్ ఔట్?

IPL: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్IPL:
క్రికెట్ ప్రియులు ఎంతగానో ఎదురుచూసే ఐపీఎల్ ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఐదుసార్లు ఛాంపియన్స్ అయిన ముంబై ఇండియన్స్‌ను ఈ సీజన్‌లో బిగ్ షాక్ తగలనుంది. జట్టులోని స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫస్ట్ ఫేజ్‌కి హాజరు కాకపోవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే బుమ్రా ఇంకా గాయం నుంచి కోలుకోలేదు. దీంతో ఐపీఎల్‌లో బుమ్రా ఆడటం కష్టమే అన్నట్లుగా ఉంది. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో జస్ప్రీత్ బుమ్రా గాయపడ్డాడు. వెన్నునొప్పితో చివరి టెస్ట్ మధ్యలోనే వెళ్లిపోయాడు. ఇప్పటికీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఐపీఎల్‌కి కూడా దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం బుమ్రా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. బెంగళూరులోని ఎన్సీఏలో చికిత్స తీసుకుంటున్నాడు. చికిత్స తీసుకుంటూనే బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. కానీ ఐపీఎల్‌లో ఏప్రిల్ మొదటి వారం వరకు బౌలింగ్ చేసే అవకాశం లేనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బుమ్రాకి వర్క్ లోడ్ పెంచుతున్నారు. దీనివల్ల అతను తొందరగా ఫిట్ అయ్యే అవకాశం ఉంది. అయితే బుమ్రా గాయం ఇంకా తగ్గకపోవడంతో ముంబై ఇండియన్స్ టీంతో పాటు ఫ్యాన్స్ కూడా ఆందోళన చెందుతున్నారు. ఐపీఎల్ ఫస్ట్ ఫేజ్‌కి బుమ్రా దూరం అయితే మాత్రం తప్పకుండా ముంబై జట్టు ఇబ్బందుల్లో పడినట్లే. బుమ్రా పూర్తిగా ఫిట్ అయిన తర్వాతే ఐపీఎల్‌లోకి వస్తాడు.
ఇదిలా ఉండగా ఐపీఎల్ మ్యాచ్‌లు మార్చి 22వ తేదీ నుంచి మే 27 వరకు టోర్నీ జరగనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ప్రారంభ మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challangers Banglore) జట్ల మధ్య జరగనున్నట్లు తెలిపింది. అయితే హైదరాబాద్‌లో క్వాలిఫయర్, ఒక ఎలిమేనటర్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ ఏడాది ఐపీఎల్ 2025 మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్‌లో జరగనున్నట్లు సమాచారం. ప్లేఆఫ్ మ్యాచ్‌లు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, కోల్‌కతాలో జరగనున్నాయి. అయితే ఈ సీజన్‌లో మొత్తం 74 మ్యాచ్‌లు 10 జట్లు ఆడనున్నాయి. మొత్తం 65 రోజుల పాటు ఐపీఎల్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌ల కోసం మొత్తం 11 వేదికల్లో జరగనుంది. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ న్యూట్రల్ వెన్యూలో రెండు హోమ్ మ్యాచ్‌లు ఆడనుంది. అయితే మార్చి 23న ఉప్పల్ వేదికగా రాజస్థాన్, హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఫైనల్ మ్యాచ్ మే 25న ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతుంది.
-
IPL 2025: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. బుమ్రా ఎంట్రీ కష్టమే
-
Rashid Khan: బుమ్రా రికార్డ్ బ్రేక్ చేసిన రషీద్ ఖాన్
-
Rohit Sharma : రోహిత్ శర్మ ఖాతాలో మరో చెత్త రికార్డు
-
Vignesh Putur: చెన్నైకి చెమటలు పట్టించిన పుతుర్.. ఇంతకీ ఎవరు?
-
IPL: ఐపీఎల్‌లో చీర్లీడర్లు ఒక్కో మ్యాచ్‌కు ఎంత సంపాదిస్తారంటే?
-
IPL: ఐపీఎల్ సీజన్‌లో ఈ స్టాక్స్ కొంటే.. లాభమంతా మీదే!