Vignesh Putur: చెన్నైకి చెమటలు పట్టించిన పుతుర్.. ఇంతకీ ఎవరు?

Vignesh putur:ఐపీఎల్ 18వ సీజన్ ప్రస్తుతం జరుగుతోంది. మార్చి 22వ తేదీన ప్రారంభమైన ఐపీఎల్‌లో ఆదివారం రెండు మ్యాచ్‌లు జరిగాయి. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తలపడగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో రాయల్స్ రాజస్థాన్ తలపడ్డాయి. అయితే వీటిలో హైదరాబాద్ సన్‌రైజర్స్ గెలవగా.. ముంబై మీద చెన్నై సూపర్ కింగ్స్ గెలిచింది. ముంబై జట్టు ఈ మ్యాచ్‌లో కాస్త తడబడ్డారు. మొదటి రోహిత్ శర్మ డెకౌట్ కావడంతో కాస్త తడబడ్డారు. దీంతో వరుస వికెట్లు పడ్డాయి. ముంబై 155 పరుగులు మాత్రమే చేసింది. ముంబై మీద చెన్నై ఈజీగా గెలుస్తుందని అందరూ భావించారు. కానీ చెన్నై సూపర్ కింగ్స్‌కి ఓ కుర్రాడు చెమటలు పట్టించాడు. 15 ఓవర్లలో చెన్నై సూపర్ కింగ్స్ గెలవాల్సిన మ్యాచ్‌ను ఆ కుర్రాడు చివరి వరకు తీసుకెళ్లాడు. ముంబై ఓడిపోయినా కూడా ఈ జట్టులోని ఓ యువ కుర్రాడు గురించి అందరూ చర్చించుకుంటున్నారు. బౌలింగ్‌లో ఇరగదీశాడు. అతనే విఘ్నేశ్ పుతుర్. ఇతని బౌలింగ్‌లో చెన్నైకి చెమటలు పట్టించాడు. కేవలం నాలుగు ఓవర్లలో 32 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. పుతుర్ దెబ్బతో ఎప్పుడో 15 ఓవర్లలో చెన్నై గెలవాల్సిన మ్యాచ్ చివరి వరకు వెళ్లింది. అయితే ఇంతకీ ఎవరీ ఈ పుతుర్ అని సోషల్ మీడియాలో అందరూ కూడా తెగ వెతికేస్తున్నారు. ఇంతకీ ఆ విఘ్నేష్ పుతుర్ ఎవరో ఈ స్టోరీలో చూద్దాం.
విఘ్నేశ్ పుతుర్ కేరళకి చెందినవాడు. 24 ఏళ్ల విఘ్నేశ్ పుతుర్ తండ్రి ఒక ఆటో డ్రైవర్ కొడుకు. చిన్నప్పటి నుంచి పుతుర్‌కు క్రికెట్ అంటే పిచ్చి. దీంతో క్రికెట్ వైపు వచ్చాడు. అయితే పుతుర్ కేరళ లెవెల్‌లో క్రికెట్ ఎప్పుడూ కూడా ఆడలేదు. అండర్ 14, అండర్ 19 క్రికెట్‌లో ఆడాడు. అయితే కేరళ క్రికెట్ లీగ్‌లో అలెప్పీ తరఫున పుతుర్ ఆడుతున్నాడు ఈ సమయంలోనే ఈ యువ ఆటగాడిని వేలంలో ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. రూ.30 లక్షలకు ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. అయితే పుతుర్ తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో కూడా ఆడాడు. అయితే ఇంతకు ముందు ఇతను ఒక మీడియం పేస్ బౌలింగ్ వేసేవాడు. ఆ తర్వాత సూచనలు తీసుకుని ఇప్పుడు లెగ్ స్పిన్ వేయడం స్టార్ట్ చేశాడు. ఇదే అతని కెరీర్‌ను మార్చింది. లెగ్ స్పిన్నర్‌గా మారిన తర్వాత పుతుర్ కేరళ కాలేజ్ ప్రీమియర్ టీ20లో ఆడాడు. దీంతో ఒక్కసారిగా పుతుర్ లైఫ్ మారిపోయింది. ఐపీఎల్‌లో కూడా అవకాశం వచ్చింది. మొదటి మ్యాచ్‌తోనే తాను ఏంటో నిరూపించుకున్నాడు. ముంబై ఫ్రాంచైజీ నమ్మకాన్ని నిలబెట్టాడు. చెన్నై సూపర్ కింగ్స్‌కి చుక్కలు చూపించాడు. ఇప్పుడు పుతుర్ పేరు మారుమోగిపోతుంది. మొదటి మ్యాచ్‌కే ఇలా ఆడాడంటే.. ఇంకా మున్ముందు ఈ యువ ఆటగాడు ఎలాంటి ప్రదర్శన చేస్తాడని ఫ్యాన్స్ అంటున్నారు.
-
IPL 2025: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. బుమ్రా ఎంట్రీ కష్టమే
-
Rashid Khan: బుమ్రా రికార్డ్ బ్రేక్ చేసిన రషీద్ ఖాన్
-
Rohit Sharma : రోహిత్ శర్మ ఖాతాలో మరో చెత్త రికార్డు
-
IPL: ఐపీఎల్‌లో చీర్లీడర్లు ఒక్కో మ్యాచ్‌కు ఎంత సంపాదిస్తారంటే?
-
IPL: ఐపీఎల్ సీజన్లో ఈ స్టాక్స్ కొంటే.. లాభమంతా మీదే!
-
IPL క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. Airtel, VI సూపర్ ప్లాన్స్..!