Rinku Singh-Priya Saroj Engagement: ఎంపీతో గ్రాండ్‌గా క్రికెటర్ రింకూ సింగ్ ఎంగేజ్మెంట్.. ఫొటోలు చూశారా?

Rinku Singh-Priya Saroj Engagement: ఐపీఎల్ పూర్తి కావడంతో వరుసగా ఇండియన్ క్రికెటర్లు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇటీవల కుల్దీప్ యాదవ్ ఎంగేజ్మెంట్ చేసుకోగా నేడు రింకూ సింగ్, ప్రియా సరోజ్ చేసుకున్నారు. అయితే సమాజ్ వాది పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యురాలు ప్రియా సరోజ్‌తో రింకూ సింగ్ నిశ్చితార్థం చేసుకున్నాడు. లక్నోలని ఒక ఫైవ్ స్టార్ హోటల్లో వీరి ఎంగేజ్మెంట్ నేడు అంగరంగ వైభవంగా జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుకకు దాదాపుగా 300 మంది అతిథులు హాజరయ్యారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, రాజకీయ ప్రముఖులు, క్రికెట్‌కి సంబంధించిన ప్రముఖులు హాజరయ్యారు. నిశ్చితార్థ వేడుక కోసం రింకూ సింగ్, ప్రియా సరోజ్ ఇద్దరూ సంప్రదాయ దుస్తుల్లో ముస్తాబయ్యారు. రింకు సింగ్ చూడముచ్చటైన సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకోగా, ప్రియా సరోజ్ కూడా సంప్రదాయ దుస్తుల్లో చాలా అందంగా కనిపించారు. వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అభిమానులు, నెటిజన్లు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు. రింకూ సింగ్, ప్రియా సరోజ్ పెళ్లి నవంబర్ 18న వారణాసిలో జరగనుంది. ఇప్పటికే ఈ పెళ్లి కోసం ఇరు కుటుంబాలు అన్ని ఏర్పాట్లను ప్రారంభించినట్లు తెలుస్తోంది.
क्रिकेटर रिंकू सिंह और सांसद प्रिया सरोज की सगाई की पहली झलक सामने आई है!
दो अलग-अलग दुनियाओं के चमकते सितारे, अब एक साथ… इस नई और खूबसूरत शुरुआत के लिए ढेरों शुभकामनाएं ! #Rinkusingh ❤️ #priyasaroj pic.twitter.com/RgP1KnNblI
— Manish लालू (Journalist) (@ManishMedia9) June 8, 2025
ప్రియా సరోజ్ యూపీలోని మచ్లిషహర్ స్థానం నుంచి లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. ఈమె మొదటిసారి 2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచారు. అయితే సరోజ్ తండ్రి తూఫానీ సరోజ్ సమాజ్‌వాదీ పార్టీలో ముఖ్య నాయకుడు. అయితే ఈ నుంచి ఆయన మూడుసార్లు లోక్‌సభ ఎంపీగా గెలిచారు. గతకొంత కాలంగా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇరు కుటుంబాలు పెళ్లికి ఒప్పుకోవడంతో వీరి పెళ్లిని నిశ్చయించారు. అయితే.. రింకూ సింగ్, ప్రియ సరోజ్ మధ్య ఏడాది కాలంగా పరిచయం ఉందని ప్రియ తండ్రి, ఎమ్మెల్యే అయిన తుపాని సరోజ్ గతంలోనే వెల్లడించిన విషయం తెలిసిందే. లక్నోలోని ఒక విలాసవంతమైన హోటల్‌ను వేదికగా ఎంచుకున్నారు. కొంత మంది బంధువులు, స్నేహితుల మధ్య వీరి ఎంగెజ్మెంట్ జరగనున్నట్లు తెలుస్తోంది. 25 ఏళ్ల చిన్న ప్రాయంలోనే ప్రియ సరోజ్ యూపీ మచిలీషహర్ నియోజకవర్గం ఎంపీగా గెలిచింది. ఆమెకు యూపీలో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. రాజకీయాల్లోకి రాకముందు ఆమె సుప్రీంకోర్టులో న్యాయవాదిగా కూడా పనిచేసింది. రింకూ సింగ్ భారత క్రికెట్ జట్టులో మంచి ఆటకాడిగా దూసుకుపోతున్నాడు.
Read Also:World Brain Tumor Day : ప్రాణాంతక బ్రెయిన్ ట్యూమర్‌ను ఎలా గుర్తించాలి? – నిపుణుల సలహాలు!
-
Samantha-Shobitha: రివర్స్ అయిన సమంత ఫ్యాన్స్.. శోభిత ఏంజిల్, సమంత జోకర్ అంటూ పోస్ట్‌లు
-
Fake Wedding trend: తినంత తిండి.. తాగేంత మందు.. ఫేక్ వెడ్డింగ్ ట్రెండ్. తో ఎంజాయ్ చేయండి
-
Turmeric Health Benefits: టర్మరిక్ ట్రెండ్ కాదు.. ఇలా పసుపు కలిపి తాగితే?
-
Tamannaah Bhatia-Vijay Varma: తమన్నాకి బ్రేకప్.. ఆ హీరోయిన్‌తో విజయ్ వర్మ రొమాన్స్.. ప్రైవేట్ వీడియో లీక్
-
Avika Gor Getting Married: పెళ్లి చేసుకోబోతున్న చిన్నారి పెళ్లి కూతురు.. కాబోయే భర్త ఫొటోలు చూశారా?
-
Money: రూ.5 నోట్‌తో రూ.6 లక్షలు.. ఎలా సంపాదించవచ్చు అంటే?