Virat Kohli: కోహ్లీ నా మజాకా.. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ముందు అరుదైన ఘనత..!

Virat Kohli:
గత కొన్ని నెలలుగా పేవలమైన ఫామ్ కనబరుస్తూ ఎన్నో విమర్శలు, ట్రొలింగ్స్ కు గురయ్యాడు రన్ మిషన్ విరాట్ కోహ్లీ. గత ఏడాది బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా తో జరిగిన మ్యాచ్ లో అతడు అతి తక్కువ సమయంలోనే పెవిలియన్ కు చేరాడు. ప్రతి మ్యాచ్ లోనూ అతడు తక్కువ పరుగులకే అవుట్ అయ్యాడు. దీంతో అభిమానులే కాకుండా, క్రికెట్ దిగ్గజాలు సైతం అతడి ఆట తీరుపై మండిపడ్డారు. అంతేకాకుండా విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాలని ఇంకొందరు విమర్శలు చేశారు. ఎంతోమంది చేత తిట్లు తిన్నాడు. కానీ ఈ ఏడాది ప్రారంభమైన ఛాంపియన్స్ ట్రోఫీలో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. తనపై విమర్శలు చేసిన వారికి తన బ్యాట్ తోనే సమాధానం చెప్పాడు. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో సెంచరీ చేసి దుమ్ము దులిపేశాడు. ఆ తర్వాత న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్లో ఆఫ్ సెంచరీ కి పైగా పరుగులు చేసి టీమిండియా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా అందరూ గర్వించే విధంగా అతడు తాజాగా నిలిచాడు. కింగ్ కోహ్లీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు ముందు అరుదైన ఘనత తన పేరిట లిఖించుకున్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా వికీపీడియాలో అత్యధిక సార్లు సెర్చ్ చేసిన ప్లేయర్గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఈ జాబితాలో ఉన్న రోహిత్ శర్మ, శుభమన్ గిల్ లను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచాడు. దాదాపు 6.61 లక్షల మంది కోహ్లీ గురించి సెర్చ్ చేశారు. 2వ స్థానంలో న్యూజిలాండ్ కు చెందిన రచిన్ రవీంద్ర 2.42 లక్షలతో ఉన్నాడు. శుభమనగిల్ 2.38 లక్షల సెర్చింగ్ లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత స్థానంలో పాకిస్తాన్ ప్లేయర్ బాబర్ అజాం 21.2 లక్షలతో నాలుగు స్థానంలో ఉండగా.. రోహిత్ శర్మ 20 లక్షల 1 వెయ్యితో ఐదు స్థానంలో నిలిచాడు.
ఇదిలా ఉంటే త్వరలో జరగబోతున్న ఫైనల్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ మరో రికార్డ్ సాధించడానికి సిద్ధంగా ఉన్నాడు. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేరిట ఉన్న వారి రికార్డును కోహ్లీ బద్దలు కొట్టబోతున్నాడు. ఈ రికార్డును బద్దలు కొట్టడానికి కేవలం ఐదు పరుగులు చేస్తే చాలు. గంగోలి రికార్డ్ బద్దలు కొట్టిన ప్లేయర్గా విరాట్ కోహ్లీ నిలుస్తాడు.
-
Viral Video: విన్నింగ్ మూమెంట్‌ను ఎంజాయ్ చేస్తూ.. దాండియా, హోలీ ఆడిన రోహిత్, విరాట్.. వీడియో వైరల్
-
ICC Champions Trophy: ఇండియా విన్.. కానీ షమీ ఖాతాలో చెత్త రికార్డు
-
ICC Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్‌లో గెలిచిన జట్టుకు భారీ ప్రైజ్ మనీ.. ఎంతంటే?
-
Champions Trophy Final Match: కుల్దీప్.. రచిన్, విలియమ్సన్ వికెట్లు తీసి ఇండియాకు వైపు మ్యాచ్
-
Rohit Sharma : రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఫిక్స్.. ఆ రోజే అనౌన్స్మెంట్!
-
IND vs NZ: నేడే ఇండియా, న్యూజిలాండ్ మ్యాచ్.. ఈ కీలక పోరులో గెలిచేదెవరు?