WhatsApp: అన్ని సేవలను కూడా ఒక్క వాట్సాప్ నెంబర్ తోనే.. ప్రభుత్వ ప్రైవేటు సేవలు.. ఫిర్యాదులు కూడా… ఇంతకీ ఎలా అంటే?

WhatsApp: ఎక్కడికి అయినా వెళ్లాలంటే బస్ టికెట్ బుకింగ్, టెంపుల్ టికెట్ బుకింగ్ కష్టం కదా. కానీ అన్ని రాష్ట్రాల్లో అలాంటి పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా ప్రజలకు ఈ సేవలను అందుబాటులోకి తేవడానికి మార్గం సుగమం చేసింది. ఈ సేవలను సులువుగా అందించాలనే నెపంతో వాట్పాప్ ఆధారిత సేవలను అందుబాటులోకి తెచ్చారు అధికారులు. అందుకే ఇప్పుడు ఆర్టీసీ బస్ టికెట్లను వాట్సప్ ద్వారా బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. అయితే దూర ప్రాంత బస్ సర్వీసులు అన్నింటికి కూడా వాట్సప్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు.
మరి బుకింగ్ ఎలా చేసుకోవాలంటే?
వాట్సప్ ద్వారా ప్రభుత్వ సేవలను పొందాలి అనుకుంటే 9552300009 అనే నెంబర్ కు హాయ్ అని మెసేజ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏ సేవలు అందుబాటులో ఉన్నాయో చూసుకోవచ్చు. మీకు బస్ బుకింగ్ తో పాటు టెంపుల్ టికెట్స్ కూడా అందుబాటులో ఉంటాయి. రద్దు కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక బుకింగ్, రద్దు లో ఏదో ఒకటి ఎంచుకోవాలి. ఆ తర్వాత ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? వంటి ప్రయాణ డిటైల్స్ ఎంట్రీ చేయాలి. తేదీని కూడా ఎంచుకోవాలి.
ఇక ఆ తర్వాత ఏయే సర్వీసులు ఉన్నాయి? ఎన్ని సీట్లు ఉన్నాయి వంటి డిటైల్స్ చూసుకోవచ్చు. సీట్లు ఎంపిక చేసుకొని ఆన్ లైన్ లో క్యాష్ చెల్లించాల్సి ఉంటుంది. ఇక మీ పేమెంట్ అవగానే మీ సీట్లు కన్ఫర్మ్ అయినట్టు టికెట్ కూడా వస్తుంది. సో మీకు ప్రాసెస్ సులభం అన్నమాట. అంటే వాట్సాప్ ద్వారానే బుకింగ్ చేసుకోవచ్చు.
దేశంలో మొట్టమొదటి సారి ఏపీ మాత్రమే ఈ సేవలను అందుబాటులోకి తీసుకొని వచ్చిందట. నారా లోకేష్ 161 ద్వారా ప్రభుత్వ సేవలను ప్రారంభించారు. ఇలా మీరు కూడా వాట్సప్ కు ఒక మెసేజ్ చేస్తే చాలు. గవర్నమెంట్ ఆఫీస్ ల చుట్టూ తిరగకుండానే అన్ని సేవలను పొందవచ్చు అన్నమాట. మొదట విడతలో రెవెన్యూ, దేవాదాయ, ఎనర్జీ, అన్న క్యాంటీన్, మున్సిపల్, ఏపీఎస్ ఆర్టీసీ, సీఎంఆర్ఎఫ్ వంటి సేవలను ఈ నెంబర్ ద్వారా పొందవచ్చట. ఇక బుకింగ్ మాత్రమే కాదు మీరు ఈ నెంబర్ ద్వారా ఫిర్యాదు కూడా ఇచ్చే అవకాశం ఉంది. అడ్రస్, ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి సబ్‌మిట్ చేస్తే రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. ఆ తర్వాత లేటెస్ట్ అప్డేట్ ను కూడా తెలుసుకోవచ్చు. అంతే కాదు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పథకాల ద్వారా అందే లబ్ధి వంటి ఎన్నో అంశాలను జస్ట్ వాట్సప్ లోనే తెలుసుకోవచ్చు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని trendingtelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.