Lenovo: ప్రపంచంలో మొట్టమొదటి సోలార్ ల్యాపీ.. 20 నిమిషాలు సూర్యరశ్మిలో ఉంటే చాలు

Lenovo:
ప్రస్తుతం టెక్నాలజీ అంతా కూడా మారిపోయింది. ఎలాంటి ఖర్చు లేకుండా సులువుగా ఉండే పరికరాలు వస్తున్నాయి. ముఖ్యంగా గ్యాడ్జెట్ల విషయంలో అయితే సరికొత్తవి మార్కెట్‌లోకి వస్తున్నాయి. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బెస్ట్ ఫీచర్లతో మార్కెట్‌లో కొత్త కొత్త ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ వస్తున్నాయి. అయితే ఎలక్ట్రానిక్స్ దిగ్గజం లెనోవో ఎప్పటికప్పుడు మార్కెట్‌లోకి బెస్ట్ ఫీచర్లతో ఉన్న వాటిని తీసుకొస్తుంది. ఈ క్రమంలోనే సరికొత్త ల్యాప్‌టాప్‌ను లెనోవో ఆవిష్కరించింది. ఇప్పటి వరకు సోలార్ టార్చిలైట్, సోలార్‌తో పనిచేసే బల్బులు వంటివి చూసే ఉంటారు. కానీ ఇప్పుడు మార్కెట్‌లోకి సోలార్ ల్యాపీ కూడా వస్తోంది. ప్రపంచంలోనే మొట్ట మొదటి సోలార్ ల్యాప్‌టాప్‌ను లెనోవో కంపెనీ తీసుకురాబోతుంది. అల్ట్రాస్లిమ్ సోలార్ పవర్ ల్యాప్‌టాస్‌ను లెనోవో మార్కెట్‌లోకి ఆవిష్కరించబోతుంది. అయితే ఈ విషయాన్ని లెనోవో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఈవెంట్‌తో తెలిపింది. ఈ సోలార్ ల్యాప్‌టాప్‌ను ఆవిష్కరించింది. బార్సిలోనాలోని ఫిరాగ్రాన్ వియాలో ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా లెనోవో ఈ ల్యాపీని ప్రదర్శించింది. లెనోవో ఎప్పటికప్పుడూ కొత్త కొత్త ప్రొడక్ట్స్‌ను మార్కెట్‌లోకి తీసుకొస్తుంటుంది. వినియోగదారులకు అన్ని విధాలుగా ఈజీగా ఉండే విధంగా ఈ లాప్‌టాప్‌ను తీసుకొస్తోంది.
లెనోవో ఈ ఏడాది విడుదల చేసిన గ్యాడ్జెట్లు అన్ని కూడా చాలా స్పెషల్. ఎందుకంటే సోలార్‌తో పనిచేసే ఈ ల్యాపీని కేవలం మీరు 20 నిమిషాలు సూర్యరశ్మిలో పెడితే చాలు.. దాదాపుగా గంట పాటు ఎలాంటి అంతరాయం లేకుండా వినియోగించుకోవచ్చట. అయితే ఇది ఇండోర్‌లో వర్క్ చేసే వారి కంటే బయట వర్క్ చేసే వారికి బాగా ఉపయోగపడుతుంది. అంటే మీరు ట్రావెలింగ్‌కి వెళ్లినప్పుుడు ఈ సోలార్ ల్యాప్‌టాప్ బాగా ఉపయోగపడుతుంది. ఈ ల్యాప్‌టాప్ ప్రపంచంలోనే మొదటి అల్ట్రాస్లిమ్ సోలార్. అయితే ఇది భవిష్యత్తులో బాగా ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది. ఈ ల్యాప్ టాప్ చూడటానికి సాధారణంగానే ఉంటుంది. కానీ ఇందులో ఈ ల్యాప్‌టాప్ లోపల రిమూవబుల్ కవర్‌లో సోలార్ ప్యానెల్ అమర్చి ఉంటుంది. దీనిలో మొత్తం 84 బ్యాక్ కాంటాక్ట్ సోలార్ సెల్స్ ఉంటాయి. దీనికి సూర్యరశ్మి పడేలా డిజైన్ చేశారు. ఇది సూర్య రశ్మి నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని కన్వర్షన్ రేటు కూడా 24 శాతం ఉంటుంది. అయితే ఈ ల్యాప్‌టాప్ సిలికాన్ ఆధారిత సంప్రదాయ ప్యానెల్ కంటే ఎక్కువ ఉంటుంది. అయితే ఈ ల్యాప్‌టాప్ ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. అయితే ఈ ల్యాప్‌టాప్‌ను ఈ ఏడాదే ఆవిష్కరించే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. ఈ ల్యాప్‌టాప్ 15mm మందం, 1.22 కిలోల బరువు ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచమంతా కూడా సోలార్ వైపు అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే లెనోవో ఈ నిర్ణయం తీసుకుంది.
-
TVS Jupiter: చీపెస్ట్ స్కూటీ.. ప్రారంభ ధర రూ.53వేలు.. 226కి.మీ గరిష్ట మైలేజ్.. !
-
Motorola: 8జీబీ ర్యామ్ ఫోన్ వెరీ చీప్.. రూ.10వేల లోపే!
-
Bikes: బెస్ట్ మైలేజ్ బైక్స్.. ఒకసారి ట్యాంక్ నింపితే 10సార్లు తిరొగొచ్చు!
-
Iphone: ఐఫోన్ 16పై భారీ డిస్కౌంట్.. వదిలారో మళ్లీరాదు!
-
Motorola: మోటారోలా నుంచి కొత్త ఫోన్.. ఫీచర్లు చూస్తే కొనకుండా ఉండలేరు