Plane: గాల్లో విమానం ఉండగానే వడగళ్ల వర్షం.. విమానం ఎలా మారిందో చూశారా?
ప్రస్తుతం ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటిగా పడుతున్న వర్షాలకు ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం 6E2142 ముందు భాగంలో భారీగా ధ్వంసమైంది

Plane: ప్రస్తుతం ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటిగా పడుతున్న వర్షాలకు ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం 6E2142 ముందు భాగంలో భారీగా ధ్వంసమైంది. 227 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తు్న్న విమానం గాల్లో ఉండగానే వడగళ్ల వర్షం కురిసింది. ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో విమానం వడగళ్ల వానలో చిక్కుకుంది. అయితే పైలట్ చాకచక్యంగా విమానాన్ని శ్రీనగర్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఢిల్లీలో భారీ వర్షం, ఈదురు గాలులు వీచాయి. అయితే విమానంలో ఉన్నప్పుడు తీవ్రమైన గాలులు రావడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. విమానంలో ఉన్న ప్రయాణికులు తమని కాపాడాలని కోరారు. కొన్ని క్షణాల్లోనే మొత్తం అల్లకల్లోలంగా మారిపోయింది. దీంతో ప్రయాణికులు వారి ప్రాణాలను గుప్పిట్లో పట్టుకుని ప్రయాణించారు. అయితే సాధారణ వర్షం కాకుండా వడగళ్ల వర్షం కురవడంతో విమానంలోని ప్రయాణికులు చాలా ఇబ్బంది పడ్డారు.
Read Also: ఆ ఏనుగుల బాధ్యత నాదే.. హామీ ఇచ్చిన డిప్యూటీ సీఎం
దాదాపుగా 20 నిమిషాల పాటు..
సాధారణంగా వడగళ్ల వర్షం వస్తే శబ్ధం వస్తుంది. ఇంట్లో ఉన్నప్పుడు ఆ పైకొప్పును పగలగొట్టి వచ్చేస్తాయి ఏమో అన్నట్లుగా ఉంటుంది. అయితే ఎక్కువగా వడగళ్లు పడటంతో విమానం ముందు భాగంలో అంతా కూడా దెబ్బతిన్నది. దాదాపుగా 20 నిమిషాల పాటు వడగళ్ల వర్షం కురవడంతో విమానం ముక్కు భాగం మొత్తం కూడా ముక్కలు అయిపోయింది. గాల్లో విమానం ఉన్నప్పుడే ఈ విమానం ముక్కు భాగం అంతా కూడా విరిగిపోయింది. భారీ వర్షం, వడగళ్ల వానకి ప్రయాణికులు వారి ప్రాణాలను గాల్లోకి వదిలేశారు. ఆ తర్వాత సేఫ్‌గా ల్యాండ్ కావడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
Read Also: విడాకులు కావాలంటే నెలకి 40 లక్షలు కావాలి.. స్టార్ హీరోకు అల్టిమేటం జారీ చేసిన భార్య
ముందుగానే అడ్వైజరీ జారీ ముందుగానే..
ఢిల్లీలోని అనేక ప్రాంతాలలో బుధవార సాయంత్రం భారీ వర్షం, ఈదురు గాలులు, దుమ్ము తుపాను వంటి తీవ్రమైన వాతావరణ పరిస్థితులు కనిపించాయి. ఈ క్రమంలో ఢిల్లీ విమానాశ్రయ అధికారులు ప్రయాణీకులకు అడ్వైజరీ జారీ చేశారు. విమాన కార్యకలాపాలు ప్రభావితం అవుతాయని ముందుగానే ప్రయాణికులను హెచ్చరించారు. ఎప్పటికప్పుడూ ప్రయాణికులకు తెలిపారు. ఈ క్రమంలోనే విమానం గాల్లో ఉండగానే ఈ ఘటన జరిగింది. ఏది ఏమైనా ప్రయాణికులను సురక్షితంగా ల్యాండ్ చేశారు.