Fancy Number: వెహికల్‌కి ఫ్యాన్సీ నంబర్ కావాలంటే.. ఇలా చేయాల్సిందే!

Fancy Number: ప్రస్తుతం రోజుల్లో అందరి దగ్గర మొబైల్, కారు, బైక్ వంటి వాహనాలు ఉండే ఉంటున్నాయి. నిజం చెప్పాలంటే ఇవి లేకుండా అయితే అసలు ఉండలేరు. ఎందుకంటే అంతా కూడా టెక్నాలజీ మహిమ అయిపోయింది. దీంతో కష్టం లేకుండా పనులు చూసుకుంటున్నారు. చాలా మందికి ప్రస్తుతం సొంత వాహనాలు ఎక్కువగా ఉంటున్నాయి. కారు, బైక్ ఇలా ఏదో ఒకటి ఎవరి స్తోమతను బట్టి ఉంటాయి. అయితే వీటిని ఎవరైనా ఈజీగా గుర్తుపట్టే విధంగా ఉండాలని ఫ్యాన్స్ నంబర్లు పెడుతుంటారు. మొబైల్ నంబర్ కూడా ఫ్యా్న్సీ కావాలని చాలా కోరుకుంటారు. కానీ ఫ్యాన్సీవి దొరకడం కష్టం. ఎక్కువ మంది కారు లేదా మొబైల్‌కి తప్పకుండా ఫ్యాన్సీ నంబర్ తీసుకోవాలని భావిస్తారు. వీటికోసం డబ్బులు కూడా భారీగా ఖర్చు చేస్తారు. కానీ కొందరికి ఎంత ప్రయత్నించినా కూడా దొరకదు. అయితే ఫ్యాన్సీ నంబర్లు దొరకాలంటే డబ్బులు వెచ్చించడం మాత్రమే కాదు.. ఇలా కూడా చేయాలి. అప్పుడే మీరు అనుకున్న ఫ్యాన్సీ నంబర్ మీ సొంతం అవుతుంది. అదెలాగో ఈ స్టోరీలో చూద్దాం.
Read Also: కొత్త రేషన్ కార్డులకు అప్లై చేస్తున్నారా.. ఈ విషయాలు తప్పనిసరి
బైక్, కారు వంటివి కొనుగోలు చేసేటప్పుడు ఫ్యాన్సీ నంబర్ కావాలని ప్రయత్నిస్తారు. ఎక్కువగా యూత్ ఫ్యాన్సీ నంబర్ల కోసం ఎక్కువగా ఖర్చు పెడుతుంటారు. మొబైల్ నంబర్‌లోని డిజిట్స్ రావాలని, లేకపోతే లక్కీ నంబర్ రావాలని కోరుకుంటారు. అయితే ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది. నచ్చిన ఫ్యాన్సీ నంబర్ కావాలంటే మాత్రం తప్పకుండా డబ్బులు ఖర్చు చేయాలి. లేకపోతే ఫ్యాన్సీ నంబర్ రాదు. అయితే మీ వెహికల్‌కి ఫ్యాన్సీ నంబర్ కావాలంటే ముందుగా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. రవాణా మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత రిజస్ట్రేషన్ జరుగుతుంది. అయితే ఇది అంతా కూడా సక్సెస్ అయితేనే మీరు ఒక ఫ్యాన్సీ నంబర్‌ను సెలక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ ఫ్యాన్సీ నంబర్ కోసం రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ఇలా చేస్తేనే మీరు కోరుకున్న ఫ్యాన్సీ నంబర్ దక్కుతుంది. అయితే వెంటనే మీకు కావాల్సిన ఫ్యాన్సీ నంబర్ ఇవ్వరు. దీన్ని అధికారులు వేలం వేస్తారు. మీరు ఆ వేలంలో పాల్గొని పాడుకోవాలి. ఎవరైతే ఎక్కువ ధరకు పాడుకుంటారో వారికే ఆ ఫ్యాన్సీ నంబర్ దక్కుతుంది.
ఫ్యాన్సీ నంబర్‌కు అప్లై చేయాలంటే రవాణా మంత్రిత్వ శాఖ అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. http://morth.nic.inకి వెళ్లి కొత్త అకౌంట్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత మీకు దగ్గరలో ఉన్న ఆర్టీవో ఆఫీసును సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో ఫ్యాన్సీ నంబర్స్ లిస్ట్ చెక్ చేసి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. దీని తర్వాత వేలం జరుగుతుంది. మీరు తప్పకుండా వేలానికి వెళ్లి పాడుకోవాలి. లేకపోతే మీకు ఫ్యాన్సీ నంబర్ లభించదు. అయితే మీరు ఈ వేలంలో గెలవకపోతే మీ డబ్బులు వృథా అనుకోవద్దు. మీ రిజిస్ట్రేషన్ డబ్బులు తిరిగి ఇచ్చేస్తారు.
-
Viral News: రూ.84 లక్షల లగ్జరీ కారు.. కేవలం రూ. 2.5 లక్షలు మాత్రమే.. ఎక్కడో తెలిస్తే మీరు కొనేస్తారు
-
Phone Farming: ఫోన్ ఫార్మింగ్ అంటే ఏంటో మీకు తెలుసా?
-
Dmart: డీ-మార్ట్ భారీ డిస్కౌంట్లు ఎందుకు ఇస్తుందో మీకు తెలుసా?
-
Auto Driver: నెలకు రూ.8 లక్షలు.. ఇది ఒక ఆటో డ్రైవర్ జీతం.. వైరల్ న్యూస్
-
Viral News: మరీ ఇంత దారుణమా.. స్నానం చేసిన నీరు విక్రయించడం.. వైరల్ న్యూస్
-
TVs with Dolby Sound: డాల్బీ సౌండ్‌తో టీవీలు.. ఇక థియేటర్‌కు వెళ్లక్కర్లేదు