Viral Video : బలికి ముందు యజమానిని పట్టుకొని ఏడ్చిన మేక.. హృదయాన్ని హత్తుకునే దృశ్యం
Viral Video : ప్రస్తుతం ఇంటర్నెట్లో ఇటీవల ఓ వీడియో చాలా వేగంగా వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసి నెటిజన్లు కంటి వెంట నీళ్లు పెట్టుకుంటున్నారు. అందరూ దీని మీద రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. బక్రీద్ (Bakrid) పండుగ సందర్భంగా బలి ఇవ్వడానికి సరిగ్గా ముందు ఒక మేక (Goat) తన యజమానిని (Owner) పట్టుకుని ఏడ్చింది. ఆ దృశ్యం చూసిన వారి గుండెలు కూడా కరిగిపోయాయి.
యజమానిని పట్టుకుని ఏడ్చిన మేక
వైరల్ అవుతున్న ఈ వీడియోలో బలి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ఆ జంతువుకు తన చివరి గడియలు దగ్గరపడ్డాయని బహుశా తెలిసిపోయిందనిపిస్తుంది. అది తన యజమానిని గట్టిగా పట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది. పక్కనే ఒక చిన్న పిల్లాడు కూడా ఉన్నాడు. ఆ మేకను చూసి అతను కూడా ఏడుస్తున్నాడు. ఇక యజమాని కూడా కళ్ళల్లో నీళ్లతో, మేకను ప్రేమగా నిమురుతూ దాని వీపును తడుముతున్నాడు. మొత్తం మీద ఈ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అయిపోయారు.
Read Also:Cricket rule for highest runs: క్రికెట్లో అత్యధికంగా ఎన్ని పరుగులు పరుగెత్తవచ్చో మీకు తెలుసా?
View this post on Instagram
మాటల్లో చెప్పలేని అనుబంధం!
ఈ వీడియో ఒక మూగజీవికి, మనిషికి మధ్య ఉన్న బంధాన్ని మాత్రమే కాదు. మాటల్లో చెప్పలేని ఆ ఎమోషనల్ అనుబంధాన్ని కూడా చూపిస్తుంది. షెహ్రోజ్ రంజాన్ అనే యూజర్ సోషల్ సైట్ ‘థ్రెడ్’లో ఈ వీడియోను షేర్ చేస్తూ ఒక క్యాప్షన్ ఇచ్చారు: “బలికి ముందు మేక ఆలింగనం చేసుకోవడం జంతువులు కూడా ప్రేమించగలవని రుజువు చేస్తుంది.” అంటూ రాసుకొచ్చారు.
Read Also:Vitamin B12 : విటమిన్ బి12 కేవలం నాన్ వెజ్ లోనే ఉంటుందా..ఎక్స్ పర్ట్స్ ఏం చెబుతున్నారంటే ?
నెటిజన్ల స్పందన
కొద్ది సెకన్ల ఈ వీడియో క్లిప్ చాలా వేగంగా వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమ అభిప్రాయాలను భారీగా పంచుకుంటున్నారు. కొందరు యజమాని, మేక మధ్య ఉన్న బంధాన్ని చూసి ఆశ్చర్యపోయారు. చాలా మంది యూజర్లు మాత్రం “ఈ వీడియో గుండె కరిగిపోయేలా ఉంది” అని అంటున్నారు. ఒక నెటిజన్ “నేను ఆ పరిస్థితిలో ఉంటే బహుశా మేకను బలి ఇవ్వాలనే నా ఆలోచనను మార్చుకునేవాడిని, ఇంకొకటి లేకపోయినా సరే” అని కామెంట్ చేశారు. ఈ వీడియో మనిషికి, జంతువులకు మధ్య ఉండే విడదీయరాని బంధాన్ని, ప్రేమను మరోసారి గుర్తు చేసింది.
-
Scooty Accident Viral Video: కోడి కారణంగా స్కూటీ ప్రమాదం.. వీడియో వైరల్
-
Ravindra Jadeja : సచిన్ కూతురును చూసిన గిల్.. తల్లి అంజలి రియాక్షన్.. ఆట పట్టించిన జడేజా.. వైరల్ వీడియో
-
Sonu Sood : విమర్శకులకు చెప్పుతో కొట్టేలా జవాబిచ్చిన సోనూసూద్
-
Viral Video : ఎవడు మమ్మీ వీడు ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు.. కుక్క నుంచి తమ్ముడిని భలే కాపాడాడు
-
MS Dhoni Birthday: సింప్లిసిటీకి కేరాఫ్ ధోని.. క్రికెట్ చరిత్రలో ఓ పేజీ ఆయన సొంతం
-
Viral Video : పాకిస్తాన్ లో అంతే.. 18మంది ప్రవాహం కొట్టుకుపోతున్నా సినిమా చూసినట్లు చూశారు



