Rajamouli and Mahesh babu : SSMB 29 మూవీ నటీనటులను భయపెడుతున్న రాజమౌళి కొత్త రూల్…

Rajamouli and Mahesh babu :
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో గొప్ప గుర్తింపును సంపాదించుకున్న దర్శకులు చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. అందులో రాజమౌళి మొదటి స్థానంలో ఉంటాడు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళికి ఎనలేని గుర్తింపైతే ఉంది. ప్రస్తుతం బాలీవుడ్ హీరోలు సైతం రాజమౌళితో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్న రాజమౌళి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తన స్థాయిని విస్తరించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న రాజమౌళి ఇకమీదట చేయబోయే సినిమాలతో భారీ విజయాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు.
ఇక ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసిన రాజమౌళి శరవేగంగా ఈ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసి అనుకున్న టైమ్ కి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని రహస్యంగా ఉంచుతూ ఎవరికీ ఎక్కడ లీక్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఒక వీడియో అయితే బయటికి రావడంతో రాజమౌళి కొంతవరకు డిసప్పాయింట్ అయినట్టుగా తెలుస్తోంది. ఇక దాంతో ఇప్పుడు షూటింగ్ సమయంలో సెట్ లో కట్టుదిట్టమైన భద్రత చర్యలను చేపడుతూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.
రాజమౌళి దీని కోసమే ఒక కొత్త రూల్ ని కూడా పాస్ చేశాడు. అదేంటి అంటే సినిమాలో నటించే నటీనటులతో పాటు వాళ్ల స్టాఫ్ ని లోపలికి రాణించే ప్రసక్తే లేదు అంటూ ఆయన చాలా స్ట్రాంగ్ గా వాదిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇంతకు ముందు వరకైతే సినిమా సెట్ లో ఉన్న ప్రతి ఒక్కరి ఫోన్లను తీసుకొని స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేసి మళ్లీ షూటింగ్ కి ప్యాకప్ చెప్పిన తర్వాత మాత్రమే ఆ సెల్ ఫోన్ లను తీసుకోమని చెబుతూ ఉండేవాడు.
Also Read: Rajamouli : రాజమౌళి మాతో ఒక్క సినిమా చేయి అంటూ బతిమిలాడుకున్న స్టార్ హీరోలు వీళ్లేనా..?
కానీ ఇప్పుడు మాత్రం సినిమాలో నటించే నటీనటుల తాలూకు అసిస్టెంట్లను మేకప్ మెన్ లను కూడా ఎవర్ని లోపలికి అలో చేసే ప్రసక్తే లేదు అంటూ ఒక కొత్త రూల్ అయితే పాస్ చేస్తున్నాడు. ఇక ఒక్కో నటి నటుల చుట్టూ పదిమంది వాళ్ల స్టాఫ్ అయితే ఉంటారు. మరి ఇలాంటి సందర్భంలో వాళ్లందర్నీ లోపలికి రానివ్వకపోవడం వల్ల నటి నటులు కొంతవరకు ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి అయితే రావచ్చు.
ఇక లక్షల్లో వాళ్లకు జీతాలను చెల్లించి ఆ నటీనటులు వారిని పనిలో పెట్టుకుంటారు. కాబట్టి వాళ్లకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఎదురవ్వచ్చు అనే విధంగా సినిమా మేధావులు ఆలోచిస్తున్నారు. అయినప్పటికి నటీనటులు మాత్రం ఈ సినిమా కోసం ఏది చేయడానికైనా వాళ్ళు సిద్ధంగా ఉండటం విశేషం…
-
Mahesh And Rajamouli: మహేష్ ఫ్యాన్స్ కు షాక్.. జక్కన్న ఏం చేశాడంటే..
-
SSMB 29 Update: ఎస్ఎస్ఎంబీ 29 అప్డేట్.. రాజమౌళి ఏం చేస్తున్నారంటే..
-
SSMB29 Update: ఆర్ఆర్ఆర్ టీంను పక్కనపెట్టిన రాజమౌళి.. మహేష్ మూవీ కోసం కొత్త టీం..
-
Baahubali the Epic: వామ్మో.. బాహుబలి: ఎపిక్ రన్‌టైమ్ ఇన్ని గంటలా.. ఎంత ఫ్యాన్స్ అయినా ఇంత సమయం ఉంటారా?
-
Baahubali the Epic: రీరిలీజ్‌కి సిద్ధమవుతున్న బాహుబలి ది ఎపిక్.. టూ పార్ట్స్ కలిపి ఒకేసారి.. ఎప్పుడంటే?
-
SSMB29 : మహేష్ బాబు సినిమాకు కొత్త చిక్కులు.. షూటింగ్ క్యాన్సిల్ చేసుకున్న రాజమౌళి