Jobs: డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. నెలకు జీతం లక్షా
Jobs ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) నియామకం కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సైన్స్ లేదా ఇంజనీరింగ్ చదివి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

Jobs: మిగతా ఉద్యోగాలతో పోలిస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని చాలా మంది ఇష్టపడుతుంటారు. ఎందుకంటే వీటిలో ఉన్న బెనిఫిట్స్ అన్ని కూడా బాగా ఉపయోగపడతాయని భావిస్తారు. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో అన్ని కాకుండా కొన్ని రకాల ఉద్యోగాలకు అభ్యర్థులు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ముఖ్యంగా ఎయిర్ పోర్టు ఉద్యోగాలు అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇండియన్ సర్వీస్, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం, బెనిఫిట్స్ ఉంటాయని వీటిలో జాయిన్ కావాలని అనుకుంటారు. అయితే ఈ ఉద్యోగాలకు మంచిగా ప్రిపేర్ అయితే బెస్ట్ అని చెప్పవచ్చు. ఎయిర్‌పోర్టు అథారిటీలో ఉద్యోగాలు ఉంటాయి. అమ్మాయిలకు అయినా, అబ్బాయిలకు అయినా కూడా బాగుంటాయి. అయితే ఎయిర్‌పోర్టు అథారిటీ ఇండియా ఎన్ని పోస్టులను రిలీజ్ చేసింది? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) నియామకం కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సైన్స్ లేదా ఇంజనీరింగ్ చదివి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఎయిర్‌పోర్టులో ఉద్యోగం చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ నోటిఫికేషన్ అని చెప్పవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అర్హతతో పాటు ఆసక్తి ఉన్న అభ్యర్థులకు వీటికి దరఖాస్తులు చేసుకోవాలి. అయితే ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్ పరీక్ష, వాయిస్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మొత్తం 309 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగాలకు సెలక్ట్ అయితే నెలకు రూ.40,000 నుంచి రూ.140,000 వరకు జీతం ఉంటుంది.
ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 25వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. ఆసక్తి, అర్హత ఉన్నవారు అధికార వెబ్‌సైట్ www.aai.aero లోకి వెళ్లి అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు రుసుము కూడా ఉంటుంది. జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.1000 ఉంటుంది. ఏప్రిల్ 25న ప్రారంభమైన ధరఖాస్తులు.. మే 24 వరకు ఉంటాయి. ఈ తేదీలోగా ఎప్పుడైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే వీటికి అప్లై చేసుకోవడానికి వయస్సు 27 ఏళ్లు కంటే మించకూడదు. ఈ ఉద్యోగాలకు ఆర్థమెటిక్, రీజనింగ్ వంటి వాటిపై పరీక్ష ఉంటుంది. వీటికి క్వాలిఫై అయితేనే తర్వాత వాటికి అర్హత ఉంటుంది. మీరు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నట్లయితే వెంటనే వీటికి ప్రిపేర్ కావండి. మీకు తప్పకుండా మంచి ఉద్యోగం వస్తుంది.