Harry Brook: ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి హ్యారీ బ్రూక్ ఔట్.. ఇతని స్థానంలోకి వచ్చేదెవరు?

Harry Brook:
ఐపీఎల్ సీజన్ 2025 మార్చి 22వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. సీజన్ ప్రారంభం కావడానికి ఇంకా పది రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ప్లేయర్ హ్యారీ బ్రూక్ ఔట్ అయ్యాడు. ఈ ఐపీఎల్ 18వ సీజన్‌లో ఆడటం లేదని ఇటీవల హ్యారీ బ్రూక్ వెల్లడించాడు. జాతీయంగా ఎక్కువ ఆటలు ఆడాలని ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు హ్యారీ బ్రూక్ తెలిపాడు. అలాగే ఇదే విషయాన్ని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకి కూడా తెలిపాడు. అయితే హ్యారీ బ్రూక్‌ను ఐపీఎల్ మెగా వేలంలో ఢీల్లీ జట్టు రూ.6.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఇతను ఇప్పుడు తప్పుకోవడంతో బ్రూక్‌పై బీసీసీఐ నిషేధం విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ మార్చిన రూల్స్ ప్రకారం వేలంలో అమ్ముడుపోయిన ఆటగాడు కరెక్ట్ అయిన రీజన్ లేకుండా ఐపీఎల్ నుంచి తప్పుకుంటే.. రెండేళ్ల పాటు నిషేధిస్తారు. బ్రూక్ గతేడాది కూడా ఐపీఎల్ నుంచి తప్పకున్నాడు. అయితే ఈ సారి బ్రూక్ తప్పుకోవడంతో.. బీసీసీఐ మరి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. గత సీజన్‌లో తక్కువ వేలానికి పలకడం వల్ల వైదొలిగాడు. కానీ వ్యక్తిగత కారణాలు అన్ని చెప్పి సీజన్ నుంచి తప్పుకున్నాడు. అయితే బ్రూక్ ఈ సీజన్‌లో ఆడకపోవడానికి కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో జోస్ బట్లర్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఇతని స్థానంలో బ్రూక్ కెప్టెన్ అయ్యే అవకాశం ఉందని అందుకే ఐపీఎల్‌లో ఆడకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ వేలంలో డేవిడ్ వార్నర్ అమ్ముడు పోలేదు. దీనికి ముందు డేవిడ్ ఢిల్లీ క్యాపిటల్స్‌లో మొత్తం మూడు సీజన్లలో ఆడాడు. గతేడాది టీ20 ప్రపంచ కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ క్రమంలో ఏ జట్టు కూడా అతన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. డేవిడ్ వార్నర్ బ్యాటింగ్‌లో దిట్ట. దూకుడుగా ఆడగలడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఇతన్ని జట్టులోకి తీసుకోవాలని భావిస్తుంది. అలాగే డెవాల్డ్ బ్రెవిస్‌ను కూడా తీసుకోవాలని ఢిల్లీ జట్టు భావిస్తుంది. వేలంలో ఇతన్ని ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేయలేదు. గతంలో ఇతను ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు. బ్రెవిస్ కూడా దాటిగా ఆడగలడు. ఓపెనర్‌గా వ బౌలర్లకు చుక్కలు చూపించిన రోజులు కూడా ఉన్నాయి. ఇలా దూకుడుగా ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంటే బాగుంటుందని ఢిల్లీ క్యాపిటల్స్ భావిస్తోంది. స్కాటిష్ బ్యాటర్ బ్రాండన్ మెక్‌ముల్లెన్ హ్యారీ బ్రూక్ ప్లేస్‌లో తీసుకునే అవకాశం ఉంది. ఇతన్ని ఏ ఫాంఛైజీ కూడా తీసుకోలేదు. ఇతను కూడా బెస్ట్ ఇన్నింగ్స్ ఆడతాడు. టీ20ల్లో ఇతనికి మంచి రికార్డు ఉంది. గతంలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్‌లో ఆడిన డారిల్ మిచెల్ ఈ ఐపీఎల్‌లో అమ్ముడుపోలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ ఫాంఛైజీ ఇతన్ని జట్టులోకి తీసుకోవడానికి ప్లాన్ చేస్తుంది. మరి వీరిలో ఎవరు హ్యారీ బ్రూక్ స్థానంలో వస్తారో చూడాలి.
-
IPL: ఐపీఎల్‌లో ఆ ఒక్క టీమ్‌కి తప్పా.. అన్నింటికి ఇండియన్ క్రికెటర్లే కెప్టెన్
-
Delhi Capitals : ఢిల్టీ జట్టుకు కెప్టెన్‌గా అక్షర్ పటేల్.. కేఎల్ రాహుల్‌ని కాదని ఈ యువ ప్లేయర్‌ని ఎందుకు?
-
Jos Butler: ఇంగ్లాండ్ క్రికెటర్ బట్లర్ కెప్టెన్సీకి గుడ్ బై.. కారణమేంటి? తర్వాత కెప్టెన్ ఎవరు
-
Champions Trophy: రూట్ సెంచరీ వృథా.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఇంగ్లాండ్ ఔట్