Operation Sindoor: పాక్‌లో మొదలైన యుద్ధ భయం.. ఆపరేషన్ సిందూర్ ఎఫెక్టేనా?
Operation Sindoor: భారత్ చేపట్టిన ఈ ఆపరేషన్ సిందూర్‌తో పాక్‌లో యుద్ధ భయం మొదలైంది. ఉగ్ర స్థావరాలపై భారత్ చేసిన మెరుపు దాడులతో పాక్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఎలా యుద్ధం మొదలవుతుందని భయపడుతున్నారు.

Operation Sindoor: పాకిస్థాన్‌పై భారత్ ఆపరేషన్ సింధూర్‌తో విరుచుకుపడింది. బుధవారం అర్థరాత్రి పాక్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడికి పాల్పడింది. ఈ దాడుల్లో 90 మందికి పైగా ఉగ్రవాదులు మృతి చెందారు. అయితే భారత్ చేపట్టిన ఈ ఆపరేషన్ సిందూర్‌తో పాక్‌లో యుద్ధ భయం మొదలైంది. ఉగ్ర స్థావరాలపై భారత్ చేసిన మెరుపు దాడులతో పాక్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఎలా యుద్ధం మొదలవుతుందని భయపడుతున్నారు. కొందరు ఇంటి నుంచి బయటకు రావడానికి కూడా భయపడుతున్నారు. మరికొందరు ఈ దాడులు జరుగుతాయని భయపడి సురక్షితమైన ప్రాంతాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో పెట్రోల్ బంక్‌లు, ఏటీఎంలు, ఆసుపత్రులు ఇలా అన్నింటి దగ్గర కూడా జనం ఉంటున్నారు. ఇప్పటికే పాక్ ఆర్థిక సమస్యలో ఇబ్బంది పడుతుంది. పహల్గాం దాడి తర్వాత అన్నింటిని కూడా భారత్ ఆపేసింది. సింధూ జలాల నీరు, ఎగుమతులు, దిగుమతులు ఇలా ఆపేయడంతో నిత్యావసరాలు, పెట్రోల్ ధరలు అన్ని కూడా ఆకాశాన్ని తాకాయి. ఆఖరుకు స్టాక్ మార్కెట్లు కూడా కుప్పకూలాయి. ఈ ఆపరేషన్ సిందూర్‌తో పాక్ స్టాక్ మార్కెట్లు 6 శాతం పడిపోయాయి. పాక్ ప్రజల్లో కూడా భయం మొదలు కావడంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికీ పాక్ తగ్గకపోతే మాత్రం ఇంకా పరిస్థితులు ఘోరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: Operation Sindoor: పాక్‌పై భారత్ వైమానిక దాడులు.. 1971 తర్వాత ఇదే తొలిసారి?
ఇదిలా ఉండగా జమ్మూకశ్మీర్ పహల్గంలో జరిగిన ఉగ్రదాడుల్లో 28 మంది టూరిస్ట్‌లు మృతి చెందారు. సంతోషంగా కుటుంబ సభ్యులు, భాగస్వాములతో గడుపుదామని వెళ్లిన వారు ఉగ్రవాదులకు బలి అయ్యారు. ఈ ఉగ్రదాడుల్లో కేవలం హిందువులనే టార్గెట్ చేసి హతం చేశారు. ఉగ్రవాదులు పక్కా ప్లానింగ్‌తో మతం ఏదని అడిగి మరి చంపారు. దీనికి ప్రతీకారంగా భారత్ పాక్‌పై వైమానిక దాడులు చేసింది. బుధవారం అర్థరాత్రి సమయంలో పాకిస్థాన్, పాక అక్రమిత కాశ్మీర్‌లోని మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో మొత్తం 90 మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలుస్తోంది. భారత త్రివిధ దళాలు వైమానిక దాడులను చేపట్టిన కొన్ని నిమిషాల్లోనే పూర్తి చేశాయి. ఈ దాడుల్లో మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలను కూల్చివేసింది. ప్రతీకారంగా అర్థ రాత్రి సమయంలో దాడి చేసింది. పహల్గాంలో చనిపోయిన అమాయకుల ఆత్మకు శాంతి కలిగేలా భారత్ ఈ వైమానిక దాడికి పాల్పడింది. ఉగ్రవాదాలకు సంబంధించిన తొమ్మిది స్థావరాలను భారత్ నాశనం చేసింది. ముఖ్యంగా బహవల్పూర్‌ను టార్గెట్ చేసి మెరుపు దాడులు నిర్వహించింది. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్‌కు చెందిన హెడ్ క్వార్టర్, జైషే మహమ్మద్‌కు చెందిన మదర్సాలే స్థావరాలను భారత్ ఆర్మీ నాశనం చేసింది. పహల్గాం దాడికి ఇండియా ప్రతీకారం తీర్చుకుంది.
-
Zodiac signs: బుధుడు మార్పులతో దశ తిరగబోతున్న రాశులివే
-
Operation Sindoor: ఇట్స్ అఫిషియల్.. ఆపరేషన్ సిందూర్ మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే?
-
Dry Coconut: ఎండు కొబ్బరితో ఆరోగ్యం.. చిన్న ముక్క తింటే చాలు
-
Pakistan: అంతర్జాతీయ మీడియా పరువు తీసుకున్న పాక్.. వీడియో వైరల్
-
Operation Sindoor: ఇప్పటి వరకు పాక్‌పై భారత్ చేపట్టిన మిలిటరీ ఆపరేషన్స్ ఇవే
-
Operation Sindoor: పాకిస్తాన్, పీఓకేలో కీలక ఉగ్రవాద స్థావరాలు ఎన్ని ఉన్నాయో తెలుసా?