Operation Sindoor: పాక్‌పై భారత్ వైమానిక దాడులు.. 1971 తర్వాత ఇదే తొలిసారి?
Operation Sindoor: బుధవారం తెల్లవారు సమయంలో భారత్ మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో మొత్తం 90 మందికి పైగా చనిపోయినట్లు తెలుస్తోంది.

Operation Sindoor: పాక్‌పై భారత్ ఉగ్రదాడికి ప్రతీకార చర్య తీసుకుంది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్‌పై వైమానిక దాడులు చేసింది. బుధవారం తెల్లవారు సమయంలో భారత్ మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో మొత్తం 90 మందికి పైగా చనిపోయినట్లు తెలుస్తోంది. ఇండియన్ త్రివిధ దళాలు కలిసి పాక్ ఉగ్రవాద స్థావరాలపై దాడి చేశాయి. అయితే 1971 తర్వాత మళ్లీ ఇప్పుడే త్రివిధ దళాలు కలిసి పాక్‌పై దాడి చేశాయి. భారత్ – పాక్ మధ్య కార్గిల్ వార్ 1971లో జరిగింది. దీని తర్వాత కూడా భారత్ పాక్‌పై దాడులు నిర్వహించింది. పుల్వామా, యురి వంటి ఎటాక్‌లు కూడా చేసింది. అయితే ఈ దాడుల్లో భారత త్రివిధ దళాలు పాల్గొనలేదు. కానీ ఇప్పుడు జరిగిన ఆపరేషన్ సిందూర్‌లో మాత్రం ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ అన్నీ కూడా కలిసి చేశాయి. పాకిస్థాన్, పాక్ అక్రమిత కశ్మీర్‌లోని మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి చేసింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ ప్రతీకారం తీర్చుకుంది.
Also Read: Operation Sindoor: భారత్ మెరుపు దాడి నిర్వహించిన మిస్సైల్స్ ఏంటో మీకు తెలుసా?
జమ్మూకశ్మీర్ పహల్గంలో జరిగిన ఉగ్రదాడుల్లో 28 మంది టూరిస్ట్‌లు మృతి చెందారు. సంతోషంగా కుటుంబ సభ్యులు, భాగస్వాములతో గడుపుదామని వెళ్లిన వారు ఉగ్రవాదులకు బలి అయ్యారు. ఈ ఉగ్రదాడుల్లో కేవలం హిందువులనే టార్గెట్ చేసి హతం చేశారు. ఉగ్రవాదులు పక్కా ప్లానింగ్‌తో మతం ఏదని అడిగి మరి చంపారు. దీనికి ప్రతీకారంగా భారత్ పాక్‌పై వైమానిక దాడులు చేసింది. బుధవారం అర్థరాత్రి సమయంలో పాకిస్థాన్, పాక అక్రమిత కాశ్మీర్‌లోని మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో మొత్తం 90 మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలుస్తోంది. భారత్ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ ఈ వైమానిక దాడులను చేపట్టిన కొన్ని నిమిషాల్లోనే పూర్తి చేశాయి. ఈ దాడుల్లో మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలను కూల్చివేసింది. ప్రతీకారంగా అర్థ రాత్రి సమయంలో దాడి చేసింది. పహల్గాంలో చనిపోయిన అమాయకుల ఆత్మకు శాంతి కలిగేలా భారత్ ఈ వైమానిక దాడికి పాల్పడింది. ఉగ్రవాదాలకు సంబంధించిన తొమ్మిది స్థావరాలను భారత్ నాశనం చేసింది. ముఖ్యంగా బహవల్పూర్‌ను టార్గెట్ చేసి మెరుపు దాడులు నిర్వహించింది. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్‌కు చెందిన హెడ్ క్వార్టర్, జైషే మహమ్మద్‌కు చెందిన మదర్సాలే స్థావరాలను భారత్ ఆర్మీ నాశనం చేసింది. పహల్గాం దాడికి ఇండియా ప్రతీకారం తీర్చుకుంది.
-
Dhruv Jurel: ఇండియాకు ధ్రువ్ జురెల్ ఉంటే గెలుపు ఖాయమా
-
Asia Cup 2025 India Vs Pakistan: ఆసియా కప్ లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ వేదిక ఎక్కడో తెలుసా?
-
Amit Shah: ఆపరేషన్ సింధూర్ పై లోక్ సభలో రెండో రోజు చర్చ.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు
-
Asia Cup 2025: ఆసియా కప్ లో భారత్ పాకిస్థాన్ వర్సెస్ మ్యాచ్ పై ఏసీసీ క్లారిటీ
-
Shikhar Dhawan: భారత్ -పాకిస్థాన్ మ్యాచ్ పై ఉత్కంఠ.. ధావన్ ఏమన్నాడంటే
-
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ పై లోక్ సభలో చర్చ.. రాజ్ నాథ్ ఏమన్నాడంటే