Tulsi Gabbard: ఆ విషయంలో మోదీ, ట్రంప్ వైఖరి ఒక్కటే.. ప్రశంసించిన తులసీ గబ్బార్డ్

Tulsi Gabbard:
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump)– భారత ప్రధాని నరేంద్రమోదీ(Narendra modi) మంచి మిత్రులు. ఎన్నికల సమయంలోనూ మోదీ.. ట్రంప్‌కు సహాయం చేశారన్న వార్తలు ఉన్నాయి. ఇక 2018 నుంచి 2021 వరకు ఇద్దరూ కలిసి పనిచేశారు. పరస్పస సహకారం అందించుకున్నారు. ఇరు దేశాల అభివృద్ధికి కీలక ఒప్పందాలు చేసుకున్నారు. తాజాగా మళ్లీ ఇద్దరూ.. కీలక పదవుల్లో ఉన్నారు.
భారత ప్రధాని నరేంద్రమోదీ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇద్దరూ మంచి స్నేహితులు. రెండు దేశాల అభివృద్ధికి గతంలో కృషి చేశారు. పరస్పర సహకారం తీసుకున్నారు. తాజాగా ట్రంప్ మళ్లీ అధ్యక్షుడు అయ్యాడు. మోదీ వరుసగా మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టారు. ట్రంప్ బాధ్యతలు చేపట్టిన వెంటనే మోదీని వైట్‌హౌస్‌కు ఆహ్వానించారు. పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. అయితే సుంకాల విషయంలో మాత్రం అందరికీ ఒకటే నిబంధన అంటున్నారు. ఏప్రిల్ 2 నుంచి సుంకాలు విధించే యోచనలో ఉన్నారు. ఇప్పటికే కెనడా, మెక్సికో, చైనాలపై సుంఖాలు విధించారు. ఈ క్రమంలో భారత్‌కు వచ్చిన అమెరికా జాతీయ నిఘా డైరెక్టర్(America Intelligance Director) తులసీ గబ్బార్డ్ మోదీని ప్రశంసించారు. ఆమె మోదీ నాయకత్వాన్ని, భారత్–అమెరికా సంబంధాలను బలోపేతం చేసేందుకు ఆయన చేస్తున్న కృషిని పలుమార్లు కొనియాడారు.
చైసినా డైలాగ్‌లో పాల్గొనేందుకు..
భారత్‌లోని రైసినా డైలాగ్‌లో పాల్గొనేందుకు వచ్చిన గబ్బార్డ్(Gabbard), మోదీతో సమావేశమైన సందర్భంలో ఆయన విధానాలను ‘ప్రాక్టికల్ మరియు ప్రాగ్మాటిక్‘గా అభివర్ణించారు. చైనా విషయంలో మోదీ , అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లు సమతుల్య విధానాన్ని అనుసరిస్తున్నారని, ఇది యుద్ధాలను నివారించడంలో సహాయపడుతుందని అన్నారు. ‘మోడీ, ట్రంప్ ఇద్దరూ తమ దేశాల ఆర్థిక ప్రయోజనాలను కాపాడుతూనే పరస్పర సహకారానికి ప్రాధాన్యం ఇస్తున్నారు‘ అని ఆమె పేర్కొన్నారు. 2019లో మోడీ రెండోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు గబ్బార్డ్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, రెండు దేశాల మధ్య సంబంధాలు వాణిజ్యం, భద్రతా రంగాల్లో బలపడుతున్నాయని ఆమె అన్నారు. ఆమె 2014లో మోడీతో మొదటిసారి కలిసినప్పుడు ఆయనకు తన బాల్యంలోని భగవద్గీత కాపీని బహుమతిగా ఇచ్చారు, ఇది ఆమె ఆయన పట్ల గౌరవాన్ని చాటుతుంది.
అమెరికాలో మోదీని కలిసి..
ఫిబ్రవరిలో మోదీ అమెరికా(America) పర్యటన సందర్భంగా గబ్భార్డ్ ఆయన్ని కలిసి, భారత్–అమెరికా స్నేహాన్ని బలోపేతం చేయడంలో ఆయన ‘స్థిరమైన నాయకత్వం‘ను ప్రశంసించారు. మోదీ కూడా గబ్బార్డ్ను ‘భారత్–అమెరికా స్నేహానికి బలమైన స్వరం‘గా కొనియాడారు. ఈ సందర్భంగా ఆమెకు మహాకుంభ మేళా నుంచి సేకరించిన గంగాజలాన్ని(Ganga Jel)బహూకరించారు. తులసి గబ్బార్డ్ హిందూ సంప్రదాయాల పట్ల గౌరవంతో పాటు, మోడీ దార్శనికతను, ఆయన ప్రపంచ సమస్యల పరిష్కారంలో చూపిస్తున్న చొరవను విశేషంగా ప్రశంసించారు. ‘భారత్‌కు రావడం ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది‘ అని ఆమె ఈ పర్యటనలో చెప్పారు, రెండు దేశాల సంబంధాలు భవిష్యత్తులో మరింత బలపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
-
Trump Warns: ఇప్పుడు వదిలిపోండని.. అమెరికాలో ఉంటున్న విదేశీయులకు ట్రంప్ వార్నింగ్
-
Donald Trump : వీటిని ఎల్లప్పుడూ కూడా క్యారీ చేయాల్సిందే.. ట్రంప్ న్యూ రూల్
-
Sunita Williams: సునీతా విలియమ్స్‌కు స్వాగతం పలికిన డాల్ఫిన్లు.. వీడియో చూసారా?
-
Sunita Williams: సునీతా విలియమ్స్ భువిపై రావడానికి ఎన్ని కోట్లు ఖర్చు అయ్యిందంటే?
-
NASA: అండర్ గ్రాడ్యుయేట్స్ ఇది మీకోసమే.. నాసాలో ఇంటర్నెషిప్ ప్రోగ్రామ్.. ఎలా అప్లై చేసుకోవాలంటే?