IPL 2025 : హెడ్, క్లాసెన్, అభిషేక్ మెరుపులు.. ఢిల్లీలో హైదరాబాద్ బ్యాటర్ల సింహతాండవం!

IPL 2025 : ఈ ఐపీఎల్ సీజన్ హైదరాబాద్ జట్టుకు ఒక ఎమోషనల్ రోలర్‌కోస్టర్ రైడ్ లాంటిది. రాజస్థాన్ టీం పై మొదటి మ్యాచ్‌లో ఏకంగా 286 పరుగులు చేసి.. 300 లోడింగ్ అనే క్యాప్షన్‌ను ట్రెండ్ చేసినప్పుడు, అభిమానులు ఎంతో ఆశించారు. కానీ ఆ ఆశలు నిరాశగా మారాయి. ఆ తర్వాత వరుస ఓటములతో జట్టు పాతాళానికి పడిపోయింది. 300 లోడింగ్ కాదు, కనీసం మ్యాచ్‌లు గెలవండి చాలంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఆటగాళ్లు హార్డ్ హిట్టింగ్ కోసం వెళ్లి బోల్తా పడ్డారని, చివరికి ప్లేఆఫ్ అవకాశాలను కూడా సంక్లిష్టం చేసుకుని గ్రూప్ దశ నుంచే ఇంటికి వెళ్లారని తీవ్రమైన విమర్శలు వచ్చాయి.
అయితే, చివరి రెండు మ్యాచ్‌లలో వరుస విజయాలతో కావ్య మారన్ జట్టు కొంత ఊపిరి పీల్చుకుంది. ఇప్పుడు ఢిల్లీలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో హైదరాబాద్ బ్యాటర్లు తమ అసలు ప్రతాపాన్ని చూపించారు. 300 లోడింగ్ అనే ఆ ట్యాగ్‌లైన్‌కు కొత్త అర్థం వచ్చేలా ఆడకపోయినా, ఈసారి మాత్రం తమ స్టైల్ ఆఫ్ క్రికెట్‌తో అదరగొట్టారు.
Read Also:Instagram : బంధాలను బలోపేతం చేసే ఇన్స్టాగ్రామ్ ఫీచర్.. బ్లెండ్ గురించి పూర్తి వివరాలివే!
తాజా మ్యాచ్‌లో హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ టాప్ గేర్‌లో ఆడి, కోల్‌కతా బౌలర్లకు చుక్కలు చూపారు. ఓపెనర్లు అభిషేక్ శర్మ 32 పరుగులు, ట్రావిస్ హెడ్ 76 పరుగులు చేసి జట్టుకు అదిరిపోయే పునాది వేశారు. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ తన విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఆ తర్వాత వచ్చిన దక్షిణాఫ్రికా స్టార్ హెన్రిచ్ క్లాసెన్ ఏకంగా సెంచరీతో విరుచుకుపడ్డాడు. అతని పవర్ హిట్టింగ్‌కు ఢిల్లీ స్టేడియం దద్దరిల్లింది. ఇషాన్ కిషన్ 29 పరుగులతో క్లాసెన్‌కు అండగా నిలిచి, స్కోరు బోర్డును ముందుకు నడిపాడు.
Six hitting at its best 🔥pic.twitter.com/tHiDttyqX1
— SunRisers Hyderabad (@SunRisers) May 25, 2025
సన్ రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో హైదరాబాద్ జట్టు 178 పరుగుల భారీ స్కోరు సాధించింది. ట్రావిస్ హెడ్ కూడా సెంచరీ చేస్తాడని అభిమానులు ఆశించారు. కానీ నరైన్ బౌలింగ్‌లో 76 పరుగుల వద్ద హెడ్ ఔటయ్యాడు. అలాగే అభిషేక్ శర్మ కూడా నరైన్ బాల్ కే చిక్కాడు. ఒకవేళ అభిషేక్ శర్మ ఔట్ కాకుండా ఉండి ఉంటే హైదరాబాద్ స్కోరు ఇంకా భారీగా ఉండేదని బహుశా 300 మార్క్‌కు దగ్గరయ్యేదని విశ్లేషకులు అంటున్నారు. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న ఈ పిచ్‌పై హైదరాబాద్ బ్యాటర్లు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు.
Read Also:Jio’s Big Offer: జియో యూజర్లకు గుడ్ న్యూస్..రూ.100కే జియోహాట్‌స్టార్ 90 రోజులు, 5GB డేటా!
క్లాసెన్, ఇషాన్ కిషన్ అద్భుత ఫామ్‌లో ఉండడంతో హైదరాబాద్ 300 పరుగులు సాధిస్తుందని అభిమానులు ఆశించారు. చివరి ఓవర్లలో కోల్‌కతా బౌలర్లు కొంత పుంజుకోవడంతో స్కోరు 278 పరుగులకే పరిమితం అయింది. దీంతో 300 లోడింగ్ అనే రికార్డుకు ఈసారి కూడా చేరువ కాలేకపోయారు. ఈ రికార్డు నమోదై ఉంటే అది హైదరాబాద్ పేరు మీద సరికొత్త అధ్యాయం అయ్యేది.
గతంలో బెంగళూరు, ముంబై, లక్నో వంటి జట్లపై హైదరాబాద్ భారీగా పరుగులు చేసింది. ఇప్పుడు కోల్‌కతా నైట్ రైడర్స్‌పై కూడా తన పవర్ హిట్టింగ్‌ను చూపించింది. గ్రూప్ దశలో కోల్‌కతా చేతిలో హైదరాబాద్ ఓటమి పాలైనందున, ఇప్పుడు కావ్య మారన్ జట్టు ప్రతీకారం తీర్చుకునే పనిలో ఉందని హైదరాబాద్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ మ్యాచ్‌తో హైదరాబాద్ జట్టుకు కొత్త ఉత్సాహం వచ్చినట్లే.
-
IPL 2025: నేడే ఆసక్తికర మ్యాచ్.. ఫైనల్క వెళ్లేదెవరు? ఇంటికెళ్లేదెవరు?
-
IPL 2025 : నేడే ఎలిమినేటర్ మ్యాచ్.. గెలిచేదెవరు?
-
Jitesh Sharma: రికార్డు సృష్టించిన జితేష్ శర్మ.. ధోని రికార్డును బద్దలు కొట్టి..!
-
Kohli Emotion: విన్నింగ్ రన్.. కోహ్లీ ఏమోషన్.. ఆర్సీబీ విజయం వీడియో వైరల్
-
Those two behind Punjab Kings: పంజాబ్ కింగ్స్ వెనుక ఆ ఇద్దరు.. వారి వల్లే టాప్ 2 ప్లేస్ సొంతం
-
Yuzvendra Chahal : ప్రీతి జింటా టాప్-2 ఆశలకు యుజ్వేంద్ర చాహల్ బ్రేక్