Rajamouli : మహేష్ సినిమా కోసం ఏకంగా ఓ నగరాన్ని నిర్మిస్తున్న దర్శక ధీరుడు జక్కన్న

Rajamouli : వారణాసి.. భూమిపై పుట్టినటువంటి మొదటి అద్భుత నగరమని పురాణాలు పేర్కొంటాయి. ఇటీవల యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో వారణాసి నగరం గురించి చాలా విషయాలను పేర్కొన్నారు. ఆ సినిమా కథ మొత్తం వారణాసి నేపథ్యంతోనే నడుస్తుంది. ప్రస్తుతం మన దర్శకధీరుడు రాజమౌళి కూడా వారణాసి నగరం పౌరాణిక ప్రాముఖ్యతకు ముగ్ధుడైనట్లు కనిపిస్తున్నారు. ఆయన దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమా షూటింగ్‌ను వారణాసిలో చేయనున్నారు. అయితే, ఆయన నిజంగా వారణాసికి వెళ్లడం లేదు. వారణాసినే హైదరాబాద్ కు తీసుకురాబోతున్నారు.
ప్రస్తుతం రాజమౌళి, మహేశ్ బాబుతో ఓ ప్రస్టేజియస్ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా మూడో షెడ్యూల్ హైదరాబాద్‌లో మొదలైంది. రామోజీ ఫిలిం సిటీలో సినిమా షూటింగ్ జరుగుతోంది. అక్కడే చాలా గ్రాండ్‌గా వారణాసి నగరం సెట్‌ను నిర్మిస్తున్నారట. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ కొత్త సినిమా కథ ఒక అడ్వెంచర్ కు సంబంధించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పౌరాణిక కథ ఆధారంగా ఆసక్తికరమైన మలుపులు ఉండబోతున్నట్లు సమాచారం.
Read Also:Life Lessons: నీ చుట్టూ ఎవరు ఉంటారో.. వారే బట్టే నీ భవిష్యత్తు?
ఇదే కారణంతో రాజమౌళి తన సినిమాను మనదేశంలోని పౌరాణిక ప్రాముఖ్యత కలిగిన నగరాల్లో చిత్రీకరిస్తున్నారు. అంతేకాకుండా, విదేశాల్లో కూడా చాలా షూటింగ్ ఉండబోతోంది. ఇప్పటికే ఒడిశా, అస్సాం ఇంకా కొన్ని ప్రదేశాల్లో సినిమా షూటింగ్ చేశారు. ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీలో వారణాసి సెట్ వేసి షూటింగ్ చేయనున్నారు. తర్వాతి షెడ్యూల్‌లో చిత్రబృందం కెన్యాకు వెళ్లనుందట. అక్కడ సినిమా షూటింగ్ చేయబోతున్నారు. కెన్యాలోని విశాలమైన మైదానాల్లో ఒక గ్రాండ్ చేజ్ సీక్వెన్స్‌ను చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. ఆ తర్వాత చిత్రబృందం అమెజాన్ అడవులకు వెళ్లి, అక్కడ ఆసక్తికరమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనుంది.
ఈ సినిమా, ఇప్పటివరకు భారతదేశంలో తీసిన సినిమాలలోకెల్లా అత్యంత ఖరీదైన సినిమా కానుంది. ఈ సినిమా కోసం దాదాపు రూ.1000కోట్ల బడ్జెట్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా నటిస్తుండగా, ఆయనతో పాటు ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Read Also:Dusharla Satyanarayana: ప్రకృతి మీద ప్రేమతో.. 70 ఎకరాలను అడవిగా సృష్టించిన వ్యక్తి ఎవరో తెలుసా?
రాజమౌళి ఈ సినిమాను హాలీవుడ్ సినిమా ‘ఇండియానా జోన్స్’ ఆధారంగా తీస్తున్నట్లు సమాచారం. ‘ఇండియానా జోన్స్’ సినిమా కూడా ఒక అడ్వెంచర్ కథను కలిగి ఉంటుంది. ఈ సినిమా కోసం రాజమౌళి చాలా హాలీవుడ్ స్టూడియోలతో అగ్రిమెంట్స్ చేసుకున్నారు. అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ (VFX), సౌండ్ డిజైన్, ఇంకా కొన్ని సరికొత్త టెక్నాలజీలను ఈ సినిమా కోసం ఉపయోగిస్తున్నారు. ఈ సినిమా వచ్చే సంవత్సరం విడుదల కానుంది. మహేష్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
-
Arjun Das: అర్జున్ దాస్.. ఇప్పుడు ఇతడి వెంటే మన స్టార్ హీరోలు పడుతున్నారు..
-
Priyanka Chopra: అట్లీ, అల్లు అర్జున్ మూవీలో హీరోయిన్‌గా ప్రియాంక?
-
SSMB 29: రాజమౌళి నుంచి మహేష్ కు విముక్తి.. వైరల్ అవుతున్న మీమ్స్
-
SSMB29: మహేష్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. SSMB29 రెండు పార్ట్‌లు కాదు!
-
Rajamouli and Mahesh babu : SSMB 29 మూవీ నటీనటులను భయపెడుతున్న రాజమౌళి కొత్త రూల్…
-
Rajamouli : రాజమౌళి మాతో ఒక్క సినిమా చేయి అంటూ బతిమిలాడుకున్న స్టార్ హీరోలు వీళ్లేనా..?