Team India : ఇంగ్లండ్ టూర్‌కు టీమిండియాను ప్రకటన.. కెప్టెన్, వైస్ కెప్టెన్ ఎవరంటే?

Team India : ఇంగ్లండ్ పర్యటనకు టీమిండియాను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. మే 24న కొత్త టెస్ట్ కెప్టెన్‌తో పాటు జట్టును కూడా ప్రకటిస్తారని వార్తలు వస్తున్నా, అంతవరకూ ఆగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అప్పుడే తన టీమిండియాను సెలెక్ట్ చేసేశాడు. ఆయన ఎంపిక చేసిన 16 మంది సభ్యుల జట్టుకు జస్ప్రీత్ బుమ్రాను కెప్టెన్‌గా నియమించాడు. దీంతో భారత టెస్ట్ జట్టు కెప్టెన్సీ విషయంలో ఆయన ఎవరికి మద్దతు ఇస్తున్నారో స్పష్టంగా తెలుస్తోంది.
గిల్‌కు వైస్ కెప్టెన్సీ
వసీం జాఫర్ బుమ్రాను కెప్టెన్‌గా ఎంపిక చేసినంత మాత్రాన శుభ్‌మన్ గిల్‌ను పక్కన పెట్టలేదు. తన 16 మంది సభ్యుల జట్టులో గిల్‌కు చోటివ్వడమే కాకుండా బుమ్రాకు వైస్ కెప్టెన్ గా నియమించాడు.
ముగ్గురు ఓపెనర్లు, పంత్ వికెట్ కీపర్
జాఫర్ తన జట్టులో ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్ ను, అతని జోడీగా కేఎల్ రాహుల్‌ను సెలక్ట్ చేసుకున్నాడు. అభిమన్యు ఈశ్వరన్‌ను టీమ్‌కు మూడో ఓపెనర్‌గా తీసుకున్నాడు. వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌ను, రెండో వికెట్ కీపర్‌గా ధ్రువ్ జురెల్‌ను జాఫర్ తన జట్టులో చేర్చుకున్నాడు.
Read Also:Highest-Paid Person: ప్రపంచంలోనే అత్యధిక జీతం పొందుతున్న వ్యక్తి మన భారతీయుడే.. ఎంతంటే?
My India squad for Eng tour:
1. Yashasvi
2. KL
3. Shubman (vc)
4. Iyer/Karun
5. Pant (wk)
6. Jadeja
7. Shardul
8. Kuldeep
9. Shami
10. Bumrah (c)
11. Siraj
12. Easwaran
13. Jurel (wk)
14. Sarfaraz
15. Arshdeep/Prasiddh/Akashdeep
16. WashingtonWhat’s yours?#ENGvIND
— Wasim Jaffer (@WasimJaffer14) May 22, 2025
జాఫర్‌కు కన్ఫ్యూజన్.. నాలుగో స్థానానికి ఆప్షన్స్
నాలుగో స్థానంలో ఎవరు ఆడతారనే విషయంలో వసీం జాఫర్ కాస్త కన్ఫ్యూజన్లో ఉన్నట్లు కనిపించాడు. ఆ స్థానానికి శ్రేయాస్ అయ్యర్, కరుణ్ నాయర్ల పేర్లను ఆప్షన్లుగా పెట్టాడు. అదే విధంగా అర్ష్‌దీప్, ఆకాశ్‌దీప్, ప్రసిద్ధ్ కృష్ణలలో ఒకరిని సెలక్ట్ చేయడంలోనూ ఆయనకు కొంత గందరగోళం ఉంది. ఈ ముగ్గురి పేర్లను కూడా ఆప్షన్లుగానే చూపించాడు.
స్పిన్, పేస్ బాధ్యతలు వీళ్లకే
వసీం జాఫర్ జట్టులో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ఇద్దరు స్పిన్ ఆల్ రౌండర్లుగా ఉన్నారు. వీరు కాకుండా మూడో స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ ను ఎంపిక చేశాడు. పేస్ బౌలింగ్ విభాగానికి వస్తే, కెప్టెన్ బుమ్రాతో పాటు మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ బాధ్యతలు తీసుకోనున్నారు. వీళ్లతో పాటు పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్‌గా శార్దూల్ ఠాకూర్‌కు జాఫర్ చోటిచ్చాడు.
Read Also:Plane: గాల్లో విమానం ఉండగానే వడగళ్ల వర్షం.. విమానం ఎలా మారిందో చూశారా?
వీరికి చోటు దక్కలేదు
ఇంగ్లండ్ పర్యటనకు 10 కిలోల బరువు తగ్గించుకున్న సర్ఫరాజ్ ఖాన్‌ను వసీం జాఫర్ ఎంపిక చేశాడు. అయితే, ఈ మధ్య బాగా వార్తల్లో ఉన్న సాయి సుదర్శన్‌కు తన జట్టులో చోటివ్వలేదు. అంతేకాకుండా, అక్షర్ పటేల్ ను కూడా వసీం జాఫర్ తన జాబితా నుంచి పక్కన పెట్టాడు.